బాల‌య్య హీరోయిన్ ఫిక్స్ కాలేద‌ట‌

నంద‌మూరి బాల‌కృష్ణ – బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ సినిమా త్వ‌ర‌లో సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. `రూల‌ర్‌` త‌ర‌వాత సెట్స్‌పైకి వెళ్లే బాల‌య్య సినిమా ఇదే. బోయ‌పాటి తో హ్యాట్రిక్ కాంబో కాబ‌ట్టి అంచ‌నాలు భారీగా ఉన్నాయి. బోయ‌పాటి ఇప్ప‌టికే క‌థ సిద్ధం చేసేసుకున్నాడు. న‌టీన‌టులు, ఇత‌ర సాంకేతిక నిపుణుల ఎంపిక‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో క‌థానాయిక‌గా క‌న్న‌డ భామ ర‌చిత రామ్‌ని ఎంచుకున్న‌ట్టు ప్రచారం జ‌రిగింది. అయితే… అలాంటిదేం లేద‌ని, క‌థానాయిక‌ని ఇంకా ఫిక్స్ చేయ‌లేద‌ని తెలుస్తోంది. అస‌లు ర‌చిత రామ్‌ని ఈ విష‌య‌మై ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రూ సంప్ర‌దించ‌లేద‌ని ర‌చిత పీఆర్ టీమ్ తెలిపింది. ప్ర‌తినాయ‌కుడిగా సంజ‌య్‌ద‌త్ ఎంపిక దాదాపు ఖాయ‌మైన‌ట్టే. సంగీత ద‌ర్శ‌కుడిగా అనిరుథ్ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే అన్ని వివ‌రాల‌తో ఓ ప్రెస్ నోట్ విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. బాల‌య్య – బోయ‌పాటి టీమ్ లో ఎవ‌రెవ‌రు ఉన్నారో తెలియాలంటే… అప్ప‌టి వ‌ర‌కూ ఎదురుచూడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com