ప‌వ‌న్ సినిమా.. కక్క‌లేక మింగ‌లేక ప్రొడ్యూస‌ర్లు

ఇటు సినిమా – అటు రాజ‌కీయాలు.. అంటూ రెండు వైపులా ఊగిస‌లాడుతున్నాడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. త‌నెప్పుడు ఏ నిర్ణ‌యం తీసుకుంటాడో త‌న‌కే తెలీదు. స‌డ‌న్ గా మేక‌ప్ వేసుకొచ్చి ‘యాక్ష‌న్‌’ చేసినా ఆశ్చ‌ర్యంలేదు. వెంట‌నే ‘పేక‌ప్‌’ చెప్పేసినా షాక్ తినాల్సిన అవ‌స‌రం లేదు. ప‌వ‌న్ సినిమాల గురించి కొన్ని రోజులుగా వార్త‌లొస్తున్నాయి. చాలామంది ద‌ర్శ‌కుల పేర్లు వినిపించాయి. నిర్మాత‌లు రెడీ అయ్యారు. స్క్రిప్టులు పురుడుపోసుకుంటున్నాయి. ఈ సినిమాల గురించి ప‌వ‌న్ అస‌లు ఎర‌గ‌న‌ట్టే ఉన్నాడు. మ‌రోవైపు ఏపీ రాజ‌కీయాలు, అక్క‌డి స‌మ‌స్య‌ల‌తో త‌లమున‌క‌లైపోయాడు. ప‌వ‌న్ – జ‌గ‌న్ వ్య‌వ‌హారం మ‌రింత ముదురుతున్న నేప‌థ్యంలో, ప‌వ‌న్ ఇప్పుడు సినిమాలు చేసే మూడ్‌లోకి రావ‌డం చాలా క‌ష్టం.

అయితే ప‌వ‌న్ కి అడ్వాన్సులు ఇచ్చి, త‌ను త‌ప్ప‌కుండా మాకే సినిమాల చేస్తాడ‌న్న న‌మ్మ‌కంతో ఉన్న నిర్మాత‌లు స్క్రిప్టు విష‌యంలో ద‌ర్శ‌కుల్ని తొంద‌ర పెడుతున్నారు. దిల్‌రాజు, ఏ.ఎం.ర‌త్నం, మైత్రీ మూవీస్.. వీళ్లంతా ప‌వ‌న్ తో సినిమాలు చేయ‌డానికి రెడీగా ఉన్న‌వాళ్లే. వాళ్లెవ‌రు నేరుగా ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి.. మాతో సినిమా ఎప్పుడు? అని అడ‌గ‌లేని ప‌రిస్థితి. అలా ఎవ‌రు అడిగినా, ప‌వ‌న్ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో వాళ్ల‌కు తెలుసు. అలాగ‌ని ప్ర‌య‌త్నాలు మాన‌లేక‌పోతున్నారు. స‌డ‌న్‌గా ప‌వ‌న్ ఫోన్ చేసి ‘స్క్రిప్టు రెడీనా’ అంటే… అప్ప‌టికి సిద్ధంగా ఉండాలి క‌దా? అందుకే ఎవ‌రి ప్ర‌య‌త్నాల్లో వాళ్లున్నారు. ద‌ర్శ‌కుల ప‌రిస్థితి మ‌రోలా ఉంది. అస‌లు ప‌వ‌న్ మాకే సినిమా చేస్తాడ‌న్న గ్యారెంటీ ఏమిటి? ప‌వ‌న్ అడిగితే అప్పుడు చూద్దాం.. అన్న‌ట్టుంది వాల‌కం. దాంతో నిర్మాత‌లు మాత్రం చాలా స‌ఫ‌ర్ అవుతున్న‌ట్టు స‌మాచారం. సినిమాల విష‌యంలో ప‌వ‌న్ ఏదో ఓ స్ప‌ష్ట‌మైన నిర్ణ‌యం తీసుకుంటే ఆయా ద‌ర్శ‌కుల‌కు, నిర్మాత‌ల‌కు కాస్త క్లారిటీ ఉంటుంది. లేదంటే – ఈ ఊగిస‌లాట ఇలానే కంటిన్యూ అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పూర్తి పేరు వాడకపోతే జగన్ పార్టీకి చిక్కులే..!?

నర్సాపురం ఎంపీ తెచ్చిన పెట్టిన కష్టం.. వైసీపీని ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఆయనను టార్గెట్ చేసి.. రకరకాల కేసులు పెడుతూ.. చికాకు పెడుతున్నామని వైసీపీ పెద్దలు అనుకుంటున్నారేమో కానీ.. ఆయన లేవనెత్తిన...

మీడియా వాచ్‌: ప్రముఖ కార్టూనిస్ట్‌‌కు క‌రోనా?

తెలుగులోనే అగ్ర‌గామి దిన ప‌త్రిక‌లో ప‌నిచేస్తున్న ప్ర‌ముఖ కార్టూనిస్ట్‌‌ కు క‌రోనా సోకిన‌ట్టు స‌మాచారం. ద‌శాబ్దాలుగా అగ్ర‌గామిగా కొన‌సాగుతున్న ప‌త్రిక‌లో... ఈయ‌న కార్ట్యూన్ల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంటుంది. తొలి పేజీలో.. త‌న గీతల‌తో...

కేసీఆర్ ఆరోగ్యంపై పిటిషన్.. హైకోర్టు ఆగ్రహం..!

తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా కాలంగా కనిపించడం లేదని .. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియచేయాలంటూ... హైకోర్టులో తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై...

ప్రసాదాలు, విగ్రహాలతో కేంద్రం నుంచి నిధులు రాలతాయా..!?

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ...కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. జీతాలు ఇవ్వడానికి ఎనిమిదో తేదీ వరకూ ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిన సందర్భంలో .. తక్షణం రాష్ట్రానికి...

HOT NEWS

[X] Close
[X] Close