ఫైళ్ళేలేవు, ఉన్నా అన్నీ కొర్రీలే! ఢిల్లీ – ఏపీల గ్యాప్

వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా ఫరవాలేదు అని ఆకలితో ఉన్నవాడు ధీమాలు పోతూంటే, వడ్డన పూర్తి చేసి గిన్నెలు కడుక్కుని వెళ్ళిపోయాడు వడ్డించేవాడు…

చూడకుండానే వెళ్ళిపోయాడని చిన్నతనం, మళ్ళీ వస్తాడని ఆశ, తెలిసున్నవాడిని కూడా అడుక్కోవాలా అనే రోషం …ఇది ఆకలితో వున్న వాడి అవస్ధ …

పళ్ళు తోముకోవాలి. పళ్ళెం పట్టుకుని వరసలో కూర్చోవాలి. అలాకాకుండా ఎక్కడికో వంటలు తీసుకువెళ్ళి వడ్డించడం ఎలాకుదురుతుందని వడ్డించేవాడి విసుగుదల.

ఆంధ్రప్రదేశ్‌కూ, కేంద్రప్రభుత్వానికీ మధ్య ముఖ్యంగా పట్టణాభివృద్ధి శాఖమంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడికీ మధ్య సంబంధాలు ఇలాగే వున్నాయి.100 స్మార్ట్ సిటిలకోసం ఆయన శాఖలో 48 వేలకోట్లరూపాయల నిధివుంది. అంటే సిటికి 480 కోట్లరూపాయలు కేటాయిస్తారు. పొరుగున వున్నతమిళనాడుకి 12 స్మార్ట్ సిటిలను కర్నాటకు 6 స్మార్ట్ సిటీలను ఆంధ్ర ప్రదేశ్ కు 3 స్మార్ట్ సిటిలను ఎంపిక చేశారు.

విభజనవల్ల నష్టపోయివున్న ఆంధ్రప్రదేశ్‌ను వీలైనన్ని విధాలుగా ఆదుకుంటానని ఇప్పటికీ చెబుతూనే వున్నా మాటలమనిషే తప్ప చేతల మనిషి కాదని తమిళనాడుకు ఇచ్చిన స్మార్ట్ సిటీల సంఖ్యను చూసి సామాన్యులు తిట్టుకునే పరిస్ధితి వుంది. ఇందుకు రాష్ట్రం ప్రభుత్వం నుంచి నిర్ణీత ఫార్మేట్‌లో ప్రతిపాదనలే వెళ్ళలేదని నాయుడిగారి ఆఫీస్ వివరాలు తెప్పించుకోవడం వల్లే ఈ మూడునగరాలైనా స్మార్ట్ సిటీలుగా ఎంపికయ్యాయని బిజేపి వర్గాల ద్వారా తెలిసింది.

రెండులక్షల కోట్ల రూపాయల బడ్జెట్టు వున్న అర్బన్ హౌసింగ్ ప్రోగ్రామ్ ద్వారా తెలంగాణాలోని 54 చిన్న పట్టణాల్లో ఇళ్ళు నిర్మించాలని ఆ రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఎపి ప్రభుత్వం నుంచి ఈ తరహాలో ఒక్క ప్రతిపాదన కూడా వెళ్ళలేదంటున్నారు.

కేంద్రప్రభుత్వంలోని వివిధ శాఖలకు రాష్ట్రాలనుంచి అనేక పధకాల మంజూరుకి సంబందించిన ప్రతిపాదనలు చేరుతూవుంటాయి. వీటిలో సమగ్రమైన లేదా నిర్ణీత ఫార్మేట్‌లో వున్నవి మాత్రమే పరిగణనలోకి వస్తాయి. ఇలాంటి ఫైలింగ్ సిస్టమ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంటే తెలంగాణా ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేస్తోందని చెబుతున్నారు.

ఫైలు సిద్ధం చేసే ఉద్యోగులకు మెరుగులు దిద్ది పంపే ఐఎఎస్ అధికారులకు ఇదంతా క్షుణ్ణంగా తెలుసు. పధకం వర్తింపచేసుకోడానికి యోగ్యత లేకపోయినా ప్రతిపాదన పంపి ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా ఫైలుని సజీవంగా వుంచి రాజకీయ అనుకూలతలను అవకాశాలను బట్టి ఆమోదింపజేసుకోవడం ఒక ఎత్తుగడగా అన్ని రాష్ట్రాలూ పాటిస్తున్నాయి. విజయవాడ మెట్రోరైలు ఫైలుని ఇందుకు తాజా ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇలాంటి ‘ఫైలింగ్’ రాజకీయ నాయకత్వం అంటే ముఖ్యమంత్రి సూచన లేదా అభీష్టం మేరకే జరుగుతూంటుంది. అయితే తమిళనాడు కేడర్ అంత శ్రద్ధగా, తిరుగులేని విధంగా ఫైలు రూపొందించగల బుద్ధి కుశలత ఆంధ్రప్రదేశ్ అధికారులకు (ఆమాటకొస్తే దేశంలో మరేరాష్ట్ర యంత్రాంగానికీ లేదు)లేదు. ముఖ్యమంత్రులు ఎవరైనా సరే రాష్ట్రప్రయోజనాలకు వున్న ఏ అవకాశాన్నీ వదులుకో కూడదన్న సంస్కృతి తమిళనాడు సచివాలయం సొంతం.

ఎక్కడాలేనన్ని న్యూస్ టివిల వల్ల ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఉన్నతాధికారులు ఏదోవిధంగా రాజకీయనాయకులతో సమానంగా కొన్నిసార్లు, అంతకు మించీ ప్రచారంలోకి వచ్చేస్తూంటారు. ఏ రాష్ట్రం లోనూ లేని విధంగా ఎపిలోనే ఏ అధికారైనా టివిలో మాట్లాడేస్తూంటారు. ప్రచారం పెంచే వత్తిడి అంతా ఇంతా కాదు. ఒకసారి ఈ వలలో పడిన వారి ఫోకస్ అసలు పని నుంచి తప్పుతుంది. అనేక అనేక ఇతర సమస్యలతో పాటు ఎపి ఫైళ్ళు పెండింగ్ లో ఉండిపోడానికి ఇదికూడా ఒక కారణమే!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సుబ్రహ్మణ్య.. ఏదో గట్టి ప్లానే

రవిశంకర్ ఆల్ రౌండర్. యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, డైరెక్షన్ ఇలా పలు విభాగాల్లో ఆయనకి ప్రతిభ వుంది. ఇప్పుడు ఆయన తనయుడు అద్వాయ్ ని తెరకి పరిచయం చేస్తున్నారు. స్వయంగా రవిశంకర్ దర్శకత్వం...

మ‌ళ్లీ ద‌ర‌ఖాస్తులా… రేవంత్ స‌ర్కార్ కు తెల్ల‌రేష‌న్ కార్డులిచ్చే ఆలోచ‌న ఉందా?

తెలంగాణ‌లో తెల్ల రేష‌న్ కార్డుల సంగ‌తి రేపు మా ఇంట్లో ల‌డ్డూల భోజ‌నం క‌థ‌లా మారింది. గ‌త ప‌ది సంవ‌త్స‌రాల్లో కొత్త కార్డుల కోసం ఎన్నో కుటుంబాలు ఎదురు చూశాయి. పెళ్లిళ్లు అయి,...

జానీ మాస్ట‌ర్ స‌స్పెండ్… వైసీపీకి జ‌న‌సేన‌కు ఇదీ తేడా!

రాజ‌కీయాల్లో మార్పుల‌కు శ్రీ‌కారం చుడుతాం అంటూ ప్ర‌క‌టించే డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్... త‌ను చెప్పిన మాట‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్టే ప్ర‌య‌త్నంలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్నారు. ముఖ్యంగా మ‌హిళ‌ల‌పై వేధింపుల విష‌యంలో పార్టీ...

మల్లాది మౌనం..జంపింగ్ కోసమేనా?

వైసీపీ సీనియర్ నేతలంతా సైలెంట్ మోడ్ లో ఉండేందుకే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అధికారం ఉన్నన్నాళ్లు లౌడ్ స్పీకర్ లాగా చెలరేగిపోయిన సీనియర్లు.. అధికారం కోల్పోయాక కిక్కురుమనడం లేదు. వైసీపీ అనుకూల మీడియాలో తరుచుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close