తెలకపల్లి రవి : రాజేందర్‌ రాజకీయ రాగాలు

తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ బడ్జెట్‌లో ఆదాయ వ్యయాలకు సంబంధించి అనేక వ్యాఖ్యానాలు వచ్చాయి. ప్రణాళికా వ్యయం అధికంగా చూపించడం మంచి లక్షణమే గాని అప్పులను అమితంగా పెంచడం సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత ఏడాది పరిమితంగా చేసిన కేటాయింపులే సగమైనా ఖర్చు చేయనప్పుడు ఈ ఏడాది మరింత భారీగా చూపినవి నిజంగా ఖర్చు చేస్తారా అన్న సందేహాలు కూడా వచ్చాయి. ఆ వాదోవవాదాలు పక్కనపెడితే రాజేందర్‌ బడ్జెట్‌ ప్రసంగంలో రాజకీయ రాగాలు అధికంగానే వినిపించాయి. ఇటీవల జిహెచ్‌ఎంసి ఎన్నికలు ఆ తర్వాత కాలంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌, కెటిఆర్‌ తదితరులు వినిపించిన సుహృద్భావం స్థానే మళ్లీ విభజన ఉద్యమ కాలంనాటి పలు విమర్శలు విసుర్లు ముందుకు తెచ్చారు. సమైక్య రాష్ట్రంలో పాలకులు తెలంగాణను నిర్లక్ష్యం చేశారన్న విమర్శ ఎలాగూ వుంటుంది కాని ఆయన అంతటితో ఆగలేదు. పాలన చేతకాదన్నారని కాని చేసి చూపించామని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల సమర్థతను గాని సంసృతిని గాని సంస్కారవంతులైన వారెవరూ అగౌరవపరచరు. ఎవరైనా ఎక్కడైనా మాట్లాడి వుంటే అది వారి వ్యక్తిగతం తప్ప ఇరుప్రాంతాల ప్రజలకూ పార్టీలకూ సంబంధం లేని విషయం. కనుక పదే పదే వాటిని ప్రస్తావించుకోవడం వల్ల కలిగే ప్రయోజనం లేదు. తెలంగాణ ముమ్మాటికి ధనిక రాష్ట్రం అని నొక్కి వక్కాణించారు. భారత దేశాన్ని పేదలతో కూడిన ధనిక దేశం అంటారని ఆయన గుర్తుంచుకోవాలి. సంపదలు సామాన్యులకు సమ పంపిణీ జరగడం సమస్య తప్ప వుండటం లేకపోవడం కాదు. ఆయన రాజకీయ వ్యక్తిగత నేపథ్యం దృష్యా ఆ సామాజికన్యాయ భావన కోసం కృషి చేయడం జరగాలి. ఆయన పేర్కొన్న కౌటిల్యుడు ఆ తరహాకు చెందిన వారు కాదు మరి. బడ్జెట్‌ ప్రసంగంలో కెసిఆర్‌ను అమితంగా పొగిడారు సరే గాని కెటిఆర్‌ను కూడా ప్రశంసించడం మరో విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close