ఫైనాన్షియ‌ర్లూ… కాస్త‌ పెద్ద మ‌నసు చూప‌రా?!

ఈఎంఐలు క‌ట్టాల్సిన వాళ్లంద‌రికీ శుభ‌వార్త చెప్పింది కేంద్ర ప్ర‌భుత్వం. మూడు నెల‌ల పాటు ఎలాంటి ఈఎంఐ చెల్సించాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పి, మ‌ధ్య‌త‌ర‌గ‌తివాళ్ల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇంటి అద్దెలు క‌ట్టుకోవ‌డ‌మే గ‌గ‌నం అయిపోతుంది. ఇక వ‌డ్డీలు, వాయిదాలూ అంటే చాలా క‌ష్టం. నిజంగా ఇది శుభ‌ప‌రిణామం.

అయితే… నిర్మాత‌ల‌కు అప్పులిచ్చే షైనాన్షియ‌ర్లూ కాస్త పెద్ద మ‌న‌సుచేసుకుంటే మంచిదేమో అనిపిస్తోంది. చిత్ర‌సీమ అంటే హీరోల చుట్టూ, ద‌ర్శ‌కుల చుట్టూ తిరిగే వ్య‌వ‌స్థ మాత్ర‌మే కాదు. అందులో ఫైనాన్షియ‌ర్లూ కీల‌క పాత్ర పోషిస్తుంటారు. సినిమా ఎంత పెద్ద‌దైనా స‌రే, వెనుక బడా బ‌డా నిర్మాత ఉన్నా స‌రే – ఫైనాన్షియ‌ర్ స‌హాయం తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. వాళ్ల వ‌డ్డీలు కూడా వేరే స్థాయిలో ఉంటాయి. సినిమా విడుద‌ల‌కు ముందు ఫైనాన్షియ‌ర్ల‌కు స‌ర్దుబాటు చేయాల్సిందే. అడిగినంత ఇవ్వాల్సిందే.

క‌రోనా ప్ర‌భావంతో నిర్మాత‌లు వ‌ణికిపోయేది ఈ వ‌డ్డీల భారాన్ని త‌ల‌చుకునే. షూటింగులు ఆగిపోయాయి. సినిమాలు ఎప్పుడు విడుద‌ల అవుతాయో చెప్ప‌లేం. ఈలోగా తెచ్చుకున్న అప్పుకి వ‌డ్డీ కొండ‌లా పెరిగిపోతుంటుంది. సినిమా పూర్త‌యి, విడుద‌లై, చేతికి డ‌బ్బులు అందేంత వ‌ర‌కూ ఆ వ‌డ్డీ ఎక్క‌డ ఆగుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి. ఈ బాధ‌ని బ‌డా ఫైనాన్షియ‌ర్లు అర్థం చేసుకోవాల్సిందే. వాళ్లు పెద్ద మ‌న‌సు చూపించాల్సిందే. ఈ లాక్ డౌన్ వ‌ల్ల ఆల‌స్య‌మ‌యిన సినిమాలపై, నిర్మాత‌ల‌పై క‌రుణ చూపించాల్సిందే. వ‌డ్డీ త‌గ్గించుకోవ‌డ‌మో, లేదంటే ఈ లాక్ డౌన్ కాలానికి వ‌డ్డీ వ‌సూలు చేయ‌క‌పోవ‌డ‌మో, లేదంటే మిన‌హాయింపు ఇవ్వ‌డ‌మో చేస్తే త‌ప్ప ఏ నిర్మాతా కోలుకోడు. సినిమా అనేది ఓ చ‌క్రం. అందులో 24 విభాగాలూ ఇరుసులే. ఒక్క‌టి గాడి త‌ప్పినా – ఆ చ‌క్రం ఆగిపోయే ప్ర‌మాదం నెల‌కుంటుంది. ఈ విష‌యం చిత్ర‌సీమ‌లో ఉంటున్న‌వాళ్ల‌కి తెలియంది కాదు. ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌పై క‌రుణ చూపించిన‌ట్టు, ఈ ఫైనాన్షియ‌ర్లూ నిర్మాత‌ల జీవితాన్ని, భ‌విష్య‌త్తుని దృష్టిలో ఉంచుకుని, వ‌డ్డీని మిన‌హాయించుకుంటే – నిర్మాత‌ల‌కు కొండంత చేయూత అందించిన‌ట్టు అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close