“సైరా సెట్” బూడిద..! కారణం అదేనా..?

మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న “సైరా నరసింహారెడ్డి” సినిమా షూటింగ్‌కు అడ్డంకుల మీద అడ్డంకులు వచ్చి పడుతున్నాయి. సినిమా షూటింగ్ కోసం.. నిర్మించిన అత్యంత కీలకమైన బీదర్ కోట సెట్… తగలబడిపోయింది. హైదరాబాద్ నగర శివార్లలోని.. చిరంజీవి సొంత ఫామ్‌హౌస్‌లో… దాదాపుగా రెండెకరాల స్థలంలో ఈ సెట్ నిర్మించారు. ఇందులోనే.. కీలక సన్నివేశాల షూటింగ్ జరుగుతోంది. గురువారం సాయంత్రం ఆరు గంటల వరకూ.. కూడా షూటింగ్ జరిగింది. అయితే.. తెల్లవారుజామున ఒక్క సారిగా.. మంటలు చెలరేగడంతో… సెట్ .. బుగ్గి అయిపోయింది. షూటింగ్ మరో ఇరవై రోజులు జరిగి ఉంటే…సెట్‌తో పెద్దగా పని ఉండేది కాదు. కానీ… ఇంకా.. చేయాల్సిన షూటింగ్ మిగిలి ఉండగానే.. సెట్‌ అగ్నిప్రమాదం బారిన పడటంతో.. సైరా యూనిట్.. దిగ్భ్రాంతికి గురయింది.

సైరా సినిమా కోసం.. అత్యంత భారీ సెట్‌లను.. కోట్ల రూపాయల వ్యయంతో పలు చోట్ల నిర్మించారు. అందులో ఒకటి కోకాపేట సెట్. బ్రిటిష్ వారిపై పోరాడిన యోధుని కథ కావడంతో.. అప్పటి వాతావరణాన్ని పునంసృష్టించడానికి… యూనిట్ చాలా కష్టపడింది. ఏ మాత్రం రాజీ పడకుండా… కోట్ల రూపాయలతో సెట్‌లు నిర్మించి షూటింగ్ కొనసాగిస్తున్నారు. అయితే.. సెట్ల ఇబ్బందులు మాత్రం.. తరచుగా.. యూనిట్‌ను ఇబ్బంది పెడుతున్నాయి. కొన్నాళ్ల కిందట … అల్యూమినీయం ఫ్యాక్టరీ దగ్గర నిర్మించిన సెట్‌ను.. పర్మిషన్ లేదని అధికారులు కూల్చి వేశారు. దాంతో కొంత ఇబ్బంది ఎదురయింది. ఇప్పుడు కోకాపేట సెట్ కాలిపోవడంతో.. మరిన్ని సమస్యలు చుట్టుముట్టినట్లయింది.

కోకాపేట సెట్… చిరంజీవి ఫామ్‌హౌస్‌లోనే ఉంది. నిర్వహణ మొత్తం.. వారు నియమించిన ఉద్యోగుల చేతుల్లోనే ఉంది. అగ్నిప్రమాదం ఎలా జరిగిందనేదానిపై అనేక సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. విపరీతమైన ఎండలు, అధిక ఉష్ణోగ్రతలతోపాటు.. సెట్ నిర్మాణం, నిర్వహణ కోసం తీసుకు వచ్చిన వస్తువులను.. సరైన విధంగా భద్రపరచలేదని భావిస్తున్నారు. మండే గుణం ఉండేవి.. సెట్ నిర్మాణంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇలాంటి సమయంలో.. కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటి వాటిలో నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్లే మంటలు రాజుకున్నాయని చెబుతున్నారు. ఇప్పుడీ సెట్ కాలిపోవడం వల్ల.. షూటింగ్ పై ఎలాంటి ప్రభావం పడుతుందో.. యూనిట్ వర్గాలు బయటకు చెప్పడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com