పుష్ప ఐటెం సాంగ్ కి ఐదుగురు డ్యాన్స్ మాస్టర్లు

అల్లు అర్జున్- సుకుమార్- దేవిశ్రీ ప్రసాద్.. ఈ ముగ్గురిది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన ఆర్య, ఆర్య2 .. ఆడియో పరంగా చార్ట్ బస్టర్స్. ఇప్పటికీ ఆ సినిమాల్లో పాటలు ఎవర్ గ్రీన్ గా ప్లే అవుతుంటాయి. ఐటెం సాంగ్స్ గురించి అయితే స్పెషల్ గా చెప్పుకోవాలి. ఆర్యలో ‘అ అంటే అమలాపురం’ పాట ఒక జనరేషన్ ని ఊపేసింది. ఆర్య2లో ‘రింగ రింగా’.. అయితే మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అదరగొట్టింది. ఇప్పుడు ఈ ముగ్గురు మూడోసారి కలిశారు పుష్ప కోసం. పుష్ప సినిమానే కాదు ఆడియోపైనా భారీ అంచనాలు వున్నాయి. ముఖ్యంగా ఐటెం సాంగ్ పైన. పుష్ప యూనిట్ కూడ ఐటెం సాంగ్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పాట కోసం సమంతని ఒప్పించారు. మొదట్లో సమంత పెద్ద ఆసక్తి చూపించలేదు. అయితే సుకుమార్ చాలా కన్వేన్స్ చేసి ఒప్పించారు. సమంత కళ్ళు చెదిరే రేమ్యునిరేషన్ డిమాండ్ చేసినపప్పటికీ మరో అలోచన లేకుండా అడిగినంత ఇచ్చారు.

పుష్ప ఐటెం సాంగ్ ని యూనిట్ ఎంత సీరియస్ గా తీసుకుందో చెప్పడానికి మరో నిదర్శనం.. ఈ పాటకి ఐదుగురు డ్యాన్స్ మాస్టర్లు. అవును.. ఈ పాట కోసం ఐదు మంది డ్యాన్స్ మాస్టర్లు పని చేశారు. మొదట ఈ ఐటెం సాంగ్ కోసం జానీ మాస్టర్ ని ఫిక్స్ చేశారు. రంగస్థలంలో ‘జిగేలు రాణి’లో మాస్ డ్యాన్సులతో అదరగొట్టిన జానీపై సుకుమార్ కి మంచి నమ్మకం వుంది. షూటింగ్ డేట్ లాక్ చేశారు. కానీ ఎంతకీ పాట ఫైనల్ కాలేదు. రెండుసార్లు డెట్లు పోస్ట్ పోన్ చేసుకున్న జానీ.. ఎంతకీ పాటపూర్తి కాకపోవడం, షూటింగ్ వాయిదా పడటంతో తనకున్న వేరే కాల్ షీట్లు కారణంగా పుష్ప ఐటెం సాంగ్ నుంచి తప్పుకున్నాడు.

జానీ తర్వాత మంచి జోష్ లో వున్న శేఖర్ మాస్టర్ ని రంగంలో దించారు. శేఖర్ మాస్టర్ స్టెప్పులు కంపోజ్ చేసి సమంతతో రెండు రోజులు రిహార్సల్ కూడా చేశాడు. అయితే ఈ రిహార్సల్ పుటేజ్ చూసిన అల్లు అర్జున్.. అసంతృప్తి వ్యక్తం చేశాడు. కోరియోగ్రఫీలో కొత్తదనం ఏమీ కనిపించలేదని ఫీలైన బన్నీ.. బాలీవుడ్ నుంచి గణేష్ ఆచార్యని రంగంలో దించారు. ఈ సినిమాలో ‘దాక్కోదాక్కో మేక’ అనే పాటకు గణేష్ ఆచార్య డ్యాన్స్ మాస్టర్. ఆ పాట బన్నీకి బాగా నచ్చింది. దీంతో ఐటెం సాంగ్ భాద్యత గణేష్ కే అప్పగించారు. అయితే అక్కడితో ఆగలేదు. తన దగ్గర వున్న మరో ఇద్దరు కొరియోగ్రఫర్స్ ని కూడా ఇన్వాల్ చేయించాడు బన్నీ. వాళ్ళ ఇన్ పుట్స్ తీసుకున్నాడు. ది బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వాలనే టార్గెట్ తో దాదాపు టీం అంతా పని చేసింది.

ఈ ఐటెం పాట పై చాలా అంచనాలు పెట్టుకున్నాడు బన్నీ. ఇందులో గూని పాత్రలో కనిపిస్తున్నాడు బన్నీ. అలాంటి పాత్ర డ్యాన్స్ లు చేయడానికి కొన్ని పరిమితులు వున్నాయి. ఆ పరిమితులని పాటిస్తూనే ఫ్యాన్స్ ని అలరించడానికి చాలా హోం వర్క్ చేశాడు బన్నీ. కచ్చితంగా ఈ పాట ఒక బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం పుష్ప టీం అంతటిలో వుంది. మరి తెరపై ఈ పాట ఎలా అలరిస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close