ఈవారం బాక్సాఫీస్‌: 8 సినిమాల‌తో జాత‌ర‌

డిసెంబ‌రు అంతా కొత్త సినిమాల‌తో టాలీవుడ్ క‌ళ‌క‌ళ‌లాడిపోనుంది. దానికి త‌గ్గ‌ట్టే అఖండ‌తో మంచి బూస్ట‌ప్ వ‌చ్చింది. డిసెంబ‌రు 17న పుష్ఫ వ‌స్తోంది. ఆ త‌ర‌వాత శ్యాం సింగ‌రాయ్ ఉంది. దాంతో డిసెంబ‌రు అయిపోతుంది. ఆ వెంట‌నే సంక్రాంతి సీజ‌న్ మొద‌లైపోతుంది. చిన్న‌, మీడియం సినిమాల‌కు ఉన్న గ్యాప్ ఈ వారం మాత్ర‌మే. అందుకే ఏకంగా 8 సినిమాలు ఈ వారం విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. వ‌స్తున్న సినిమాలు 8 ఉన్నా, అంద‌రి దృష్టి ల‌క్ష్య‌, గ‌మ‌నంపైనే.

నాగ‌శౌర్య క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం లక్ష్య‌. ఇదో స్పోర్ట్స్ డ్రామా. టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటున్నాయి. శౌర్య 8 ప్యాక్ బాడీతో… మాస్ ని త‌న వైపుకు లాగేస్తున్నాడు. ఈ సినిమాతో శౌర్య ఇమేజ్ మార‌బోతోంద‌ని చిత్ర‌బృందం గ‌ట్టిగా చెబుతోంది. వ‌రుడు కావ‌లెనులో ప‌క్కా క్లాస్ గా క‌నిపించాడు. శౌర్య‌. ఆ సినిమా విడుద‌లైన నెల రోజుల లోపే.. మాస్ ట‌చ్‌తో రాబోతున్నాడు. మ‌రి ఈ సినిమా ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటుందో చూడాలి.

ఈవార‌మే గ‌మ‌నం వ‌స్తోంది. శ్రియ ప్ర‌ధాన పాత్ర పోషించిన చిత్ర‌మిది. ప్ర‌సిద్ధ డీఓపీ జ్ఞాన‌శేఖ‌ర్ నిర్మాత‌. బుర్రా సాయిమాధ‌వ్‌, ఇళ‌య‌రాజా లాంటి వాళ్లు ఈ సినిమా స్టాండ‌ర్డ్ ని పెంచారు. ప్ర‌చార చిత్రాలు చూస్తుంటే ఓ ఫీల్ గుడ్ సినిమా చూడ‌బోతున్నామ‌న్న న‌మ్మ‌కాన్ని క‌లిగిస్తున్నాయి. ఈ వారం వ‌చ్చే సినిమాల్లో దీనిపై ప్ర‌త్యేక దృష్టి పెట్టొచ్చు.

వీటితో పాటుగా మ‌డ్డీ, న‌యీం డైరీస్‌,చ బుల్లెట్ స‌త్యం, క‌టారి కృష్ణ‌, మ‌న‌వూరి పాండ‌వులు, ప్రియ‌త‌మా చిత్రాలు ఈవార‌మే రాబోతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గురివిందలు : కడపకు వైఎస్ పేరు పెట్టినప్పుడు జగన్, విజయమ్మ స్పందించారా!?

కృష్ణా జిల్లాను రెండు మక్కలు చేసి ఒక దానికి ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అని పేరు పెడుతున్నట్లుగా ప్రభుత్వం చెబుతోంది. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించింది. చట్టపరమైన అడ్డంకులు అన్నింటినీ అధిగమించి జిల్లా...

విడాకుల‌పై నేనేం మాట్లాడ‌లేదు: నాగార్జున‌

నాగ‌చైత‌న్య - సమంత విడాకుల‌పై నాగార్జున స్పందించార‌ని, స‌మంత కోరిక మేర‌కే నాగ‌చైత‌న్య విడాకులు ఇచ్చాడ‌ని, ఇందులో చై చేసిందేం లేద‌న్న‌ట్టు... ఈరోజు సోష‌ల్ మీడియాలో వార్త‌లు గుప్పుమ‌న్నాయి. దాంతో... ఈ విడాకులకు...

హిందూపురం జిల్లా కోసం బాలకృష్ణ పోరాటం తప్పదు !

కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడాన్ని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎప్పటి నుండో సమర్థిస్తున్నారు. అయితే ఆయన డిమాండ్ ఒక్కటే హిందూపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయడం. కానీ ప్రభుత్వం మాట...

తెలంగాణ ఐఏఎస్ కూతురి పెళ్లికి “మేఘా” ఖర్చులు !?

తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి, ఇరిగేషన్ బాధ్యతలు చూస్తున్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్‌కుమార్‌పై తీవ్రమైన ఆవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల రజత్ కుమార్ కుమార్తె పెళ్లి అత్యంత జరిగింది. హైదరాబాద్‌లోని పలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close