PPP అంటే ఏమిటి..? ఈ మాట ఎవర్ని అడిగినా.. పబ్లిక్, ప్రైవేటు, పార్టనర్ షిప్ అని చెబుతారు. అంటే.. ప్రభుత్వం, ప్రైవేటు కలిసి నిర్వహిస్తాయి. ఓ టైం తర్వాత అంతా ప్రభుత్వానికి చెందుతుంది. కానీ PPP అంటే జగన్ రెడ్డి డిక్షనరీలో మాత్రం ప్రైవేటు అని ఉంటుంది. వందశాతం ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేయడమే PPP అనుకుంటారు. అదే అందరికీ చెబుతారు. ప్రజలకు చెబుతారు. పెద్దలకు చెబుతారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు చెప్పారు. రేపు గవర్నర్‌కూ చెబుతారు. ఎవరైనా పీపీపీ అంటే.. ప్రైవేటు మాత్రమే కాదు కదా అని అంటే.. అవును.. కాదని చెబుతారు. కానీ బయటకు వచ్చి మళ్లీ జగన్ రెడ్డి డిక్షన్రరీలో ఉన్న ప్రైవేటు పాటే పాడుతారు. నమ్మేవాళ్లను పిచ్చి వాళ్లను చేయడానికి బరి తెగించి ఎవరేమనుకుంటే మాకేంటి అన్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు.
కోటి సంతకాల పేరుతో ఫేక్ డ్రామా
మెడికల్ కాలేజనీ ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా కోటి సంతకాలను సేకరించామని వైసీపీ నేతలు ప్రకటించుకున్నారు. సంతకాలు సేకరించారో లేదో అందరూ చూశారు. కోటి అంటే.. రామకోటి రాసినట్లుగా సంతకాలు చేశారోలేదో.. నిజంగా వారు చూపిస్తున్న పుస్తకాలు ఖాళీగా ఉన్నాయా.. సంతకాలు ఉన్నాయా అన్నది కూడా ఎవరికీ తెలియదు. అవి ఎవరికీ ఇవ్వరు. కానీ సేకరించేశామని ర్యాలీలు చేశారు. ఎన్నికల ర్యాలీలు ఎలా చేస్తారో అలా చేసి.. సంతకాలకు ప్రచారం చేసుకున్నారు. వాటిని గవర్నర్ కు ఇస్తామని ప్రకటించుకున్నారు. అసలు ప్రైవేటీకరణ ఎక్కడ జరుగుతోంది అన్న ప్రశ్నలకూ సమాధానం లేదు.
నిర్మలా సీతామన్ అడిగారు..రేపు గవర్నర్ అడిగితే ఏం చెబుతారు?
ఇటీవల నిర్మలా సీతారామన్ వద్దకు సుబ్బారెడ్డి మిగతా ఎంపీలతో వెళ్లి.. ఏపీలో మెడికల్ కాలేజీలను ప్రైవేటకరణ చేస్తున్నారని ఆపాలని కోరారు. ఆమెకు ఇచ్చిన వినతి పత్రంలో పీపీపీ అని ఉంది. PPPఅంటే ప్రైవేటీకరణ కాదు కదా అన్న ప్రశ్నకు సుబ్బారెడ్డి వద్ద సమాధానం లేదు. మిగతా ఎంపీల వద్ద లేదు. అవును మేడమ్ అని సమాధానం చెప్పి బయటకు వచ్చి.. మళ్లీ మీడియా ముందు మాత్రం రంకేలేశారు. రేపు గవర్నర్ వద్దకూ వెళ్తారు. గవర్నర్ కూ అదే డౌట్ వస్తుంది. ప్రైవేటీకరణకు.పీపీపీ మోడల్ కు చాలా తేడా ఉందని.. ఎందుకు ఇలా అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి వైసీపీ వద్ద సరుకు ఉండదు. కానీ బయటకు వచ్చి మీడియాకు చెప్పాలనుకున్నది చెప్పేశారు. చల్లాలనుకున్న బురద చల్లేస్తారు.
జగన్ అజ్ఞానమే వైసీపీ పెట్టుబడి
వైసీపీ విధానం గురించి ఎవరు ఎంత ప్రశ్నించినా సమాధానం జగన్ చెప్పినదే చెబుతారు. అది కాదు అయ్యా.. జరుగుతోంది ప్రైవేటీకరణ కాదు.. అని చెప్పినా వారు వినిపించుకోరు. మా జగన్ అన్న అది ప్రైవేటీకరణ అని చెప్పారు దానికే ఫిక్సయిపోతాం అంటారు. అలాగే చేస్తున్నారు. జగన్ రెడ్డికి చెప్పేవారు లేరు.చెప్పినా ఆయన వినరు. తాను ఓ టాపిక్ అందుకున్నా కాబట్టి దాన్ని రుద్ది రుద్ది అదే నిజమని ప్రజల్ని నమ్మించగలనన్న ధీమా ఆయనది. ఆయన అజ్ఞానమే వైసీపీ పెట్టుబడి. ఈ అజ్ఞానమే వారిని 11కు తీసుకు వచ్చింది. రేపటికి ఏ స్థాయికి తీసుకెళ్తుందో ఆ పార్టీ నేతలే ఊహించుకోవాలి.
