మత సంస్థలకు విదేశీ నిధులు కట్..!

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 200కుపై చారిటబుల్ ట్రస్టుల గుర్తింపుల్ని… కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. విదేశాల నుంచి వస్తున్న విరాళాల వివరాలు.. వాటిని ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో లెక్కలు చెప్పకపోవడంతో.. గుర్తింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో వీటి సంఖ్య 90 ఉండగా.. ఏపీలో 168గా తేలాయి. వీటిలో తొంభై శాతం క్రిస్టియన్ మతానికి సంబంధించినవే. విదేశాల నుంచి విరాళాలు పొందుతూ.. సేవలు చేస్తున్నట్లుగా .. మత ప్రచారం చేస్తున్న సంస్థల వివరాలే ఎక్కువగా ఉన్నాయి. ఇలా చేస్తూ.. తాము విదేశాల నుంచి అందుకుంటున్న మొత్తం.. వాటిని ఖర్చు పెడుతున్న వైనంపై.. వివరాలు కేంద్రానికి ఇవ్వకుండా దాచి పెడుతున్నారు. ఇలాంటి సంస్థల నిర్వాకాలపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.

ఏపీలో బ్యాన్ చేసిన.. చారిటబుల్ ట్రస్టుల్లో.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ పేరు మీద ఎర్పాటు చేసిన చారిటబుల్ ట్రస్ట్ కూడా ఉంది. ఆ ట్రస్ట్ పేరుతో.. ఏం చేశారో.. క్లారిటీ లేదు. కానీ పెద్ద ఎత్తున విదేశాల నుంచి విరాళాలు సేకరించారని.. వాటికి సంబంధించిన వివరాలు మాత్రం.. కేంద్రానికి తెలియచేయలేదని..తెలుస్తోంది. అందుకే.. ఆ ట్రస్టుపైనా.. కేంద్రం నిషేధం విధించింది. ఏపీలో క్రిస్టియన్ సంస్థ కార్యకలాపాలు విస్తృతమయ్యాయి. మత మార్పిళ్లు చేస్తున్నామని గొప్పగా చూపించుకుని.. విదేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులు సేకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిని కట్టడి చేయడానికి కేంద్రం రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది.

క్రిస్టియన్ చారిటబుల్ ట్రస్టుల పేరుతో మత మార్పిళ్లకు పాల్పడుతున్న ఆరోపణలు చాలా కాలం నుంచి ఈ స్వచ్చంద సంస్థలపై ఉన్నాయి. వీటి వివరాలన్ని బయటకు తీసిన.. కేంద్ర హోంశాక.. చివరికి.. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పైనా సీబీఐ దాడులు చేయించింది. ఆ సంస్థ కేంద్రంగా… నిధుల పంపిణీ జరుగుతోందని అనుమానిస్తోంది. మత మార్పిళ్ల మాఫియాకు అడ్డుకట్టవేయాలన్న కేంద్రం పట్టుదల.. తాజా నిర్ణయంతో బయటపడినట్లయిందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పూర్తి పేరు వాడకపోతే జగన్ పార్టీకి చిక్కులే..!?

నర్సాపురం ఎంపీ తెచ్చిన పెట్టిన కష్టం.. వైసీపీని ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఆయనను టార్గెట్ చేసి.. రకరకాల కేసులు పెడుతూ.. చికాకు పెడుతున్నామని వైసీపీ పెద్దలు అనుకుంటున్నారేమో కానీ.. ఆయన లేవనెత్తిన...

మీడియా వాచ్‌: ప్రముఖ కార్టూనిస్ట్‌‌కు క‌రోనా?

తెలుగులోనే అగ్ర‌గామి దిన ప‌త్రిక‌లో ప‌నిచేస్తున్న ప్ర‌ముఖ కార్టూనిస్ట్‌‌ కు క‌రోనా సోకిన‌ట్టు స‌మాచారం. ద‌శాబ్దాలుగా అగ్ర‌గామిగా కొన‌సాగుతున్న ప‌త్రిక‌లో... ఈయ‌న కార్ట్యూన్ల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంటుంది. తొలి పేజీలో.. త‌న గీతల‌తో...

కేసీఆర్ ఆరోగ్యంపై పిటిషన్.. హైకోర్టు ఆగ్రహం..!

తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా కాలంగా కనిపించడం లేదని .. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియచేయాలంటూ... హైకోర్టులో తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై...

ప్రసాదాలు, విగ్రహాలతో కేంద్రం నుంచి నిధులు రాలతాయా..!?

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ...కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. జీతాలు ఇవ్వడానికి ఎనిమిదో తేదీ వరకూ ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిన సందర్భంలో .. తక్షణం రాష్ట్రానికి...

HOT NEWS

[X] Close
[X] Close