చైతన్య : ఇది గురువుపై జరిగిన కుట్ర !

నారాయణ.. తన పేరుతోనే పాఠశాల స్థాపించి.. అతి దిగువ స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి. మహా వృక్షంగా ఎదిగిన వ్యక్తి. పిల్లలకుజీవితంలో ఎదగాలంటే ఎలాంటి చదువు కావాలో అలాంటి చదువు చెప్పించిన వ్యక్తి, నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగువాళ్లు ఎక్కడ ఉన్నా.. వారిలో నారాయణ విద్యార్థులు ఉంటారు. అంతగా.. లక్షల మంది యువత జీవితాల్లో మార్పు తెచ్చిన గొప్ప గరువు నారాయణ. ఇవాళ ఆయనకు ఎలాంటి పరిస్థితి కల్పించారు. అత్యంత దారుణంగా పేపర్ లీక్ కాలేదని .. వాట్సాప్‌లో ఉపాధ్యాయులు షేర్ చేసుకున్నారని తెలిసినా రాజకీయ కక్ష సాధింపుల కోసం ఆయనను అరెస్ట్ చేశారు. అది ఓ గురువుకు వేసిన సంకెళ్లు మాత్రమే. చట్టం అధికారానికి చుట్టం అయి తెగిస్తే ఏర్పడిన వైపరీత్యమే.

కాపు విద్యావేత్తకు ఇంత అవమానమా ?

కాపు సామాజికవర్గంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన నారాయణ నేడు ఆసియాలోనే అతి పెద్ద విద్యా వ్యవస్థను నడుపుతున్నారు. అంటే ఆయన కృషి పట్టుదల ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాజకీయాల్లోకి రావడమే తప్పయినట్లుగా ఉంది. మంత్రిగా ఉన్నంత కాలం ఆయన ఎవరిపైనా కక్ష సాధింపులకు కూడా పాల్పడలేదు. పైగా తన విద్యా సంస్థల ద్వారా పేద పిల్లలకు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ఏర్పాట్లు చేశారు. దాన్ని వైసీపీ నేతలు అప్పట్లో అన్ని రకాల విమర్శలు చేసి అడ్డుకున్నారు. ఇప్పుడు అత్యంత ఎత్తుకు ఎదిగిన ఓ కాపు విద్యా వేత్తను అవమానకరంగా అరెస్ట్ చేసి.. దారుమమైన తప్పునకు పాల్పడ్డారు.

గురువుల్ని కులాల ప్రకారం చూసి విమర్శిస్తారా ?

అధికారం ఉందని.. పోలీసులు చేతుల్లో ఉన్నారని.. గత మూడేళ్లుగా వారితో పిట్టకథలు చెప్పిస్తూనే ఉన్నారు. చివరికి కోర్టులో దొంగతనాలు జరిగినా అవే పిట్టకథలు వినిపించారు. విద్యా సంస్థల నిర్వహణ నుంచి వైదొలిగి రెండేళ్లవుతున్నా.. తాము అరెస్ట్ చేసిన ఓ వైస్ ప్రిన్సిపాల్ దగ్గర స్టేట్ మెంట్ తీసుకుని అందులో నారాయణ పేరు చెప్పారంటూ అరెస్ట్ చేశారు. దానికి చాలా కథలను అల్లారు. నిజమో అబద్దమో తెలుసుకోలేని స్థితిలో ప్రజలు లేరు. కానీ గుడ్డిగా నమ్మే కొంత మంది ఉంటారు. వారు నిజాలను కూడా నమ్మరు. వారికి కావాల్సిందే వారు నమ్ముతారు. అలాంటి వారిని పక్కన పెడితే.. ఇది ఖచ్చితంగా ప్రజలు విశ్లేషించుకునే సంఘటన కూడా. కులాల ప్రకారం.. పార్టీల ప్రకారం కూడా చూసి విమర్శిస్తున్నారు. మీడియా కూడా నిజాలేవో తెలిసి కూడా అడ్డంగా అబద్దాలు ప్రచారం చేస్తోంది.

గురువుకు జరిగిన అవమానం సమాజానికి కీడు !

పొంగూరు నారాయణను అరెస్ట్ చేశామని.. టెన్త్ పరీక్షా పత్రాల మాల్ ప్రాక్టీస్..లీక్ విషయంలో నిందలన్నీ నారాయణపై వేసేశామని ప్రభుత్వం సంబర పడితే అంతకు మించి తప్పిదం మరొకటి ఉండదు. ఈ అరెస్ట్ విద్యావ్యవస్థ మీద జరిగిన దాడి. చాలా మంది నారాయణ అరెస్ట్ తర్వాత బాగా జరిగిందని అంటున్నారు… వారి గురువులకు అలా జరిగితే సంతోషపడతారేమో తెలియదు. ఆయన కొన్ని లక్షల మంది విద్యార్థులను ప్రయోజకుల్ని చేశారు.. ఆయన పిల్లల్ని రుద్దింది ఎవరి కోసం.. వాళ్ల భవిష్యత్ కోసమే… సోషల్ మీడియాలోనూ నారాయణను అరెస్ట్ చేయడంపై కొంత మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు….. ఇది అరాచకమే.. ఆయన గురువు.. దండించే గురువు ఎప్పటికీ చెడ్డవాడు కాదు. గురువును అవమానించిన సమాజం ఎప్పటికీ బాగుపడదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close