తను ఒకప్పుడు స్టార్ హీరోయిన్. తెలుగులో పేరున్న హీరోల పక్కన సినిమాలు చేసింది. యూత్ బ్యాచ్ అందరితోనూ జట్టు కట్టింది. ఫేమ్ ఉన్నప్పుడు బాగానే సంపాదించింది. అయితే తెలుగులో ఆమె కెరీర్ దాదాపుగా ముగిసింది. ఇక్కడ పట్టించుకొనే నాధుడే లేడు. బాలీవుడ్ లో మాత్రం అడపా దడపా మెరుస్తోంది. కానీ తెలుగులో వచ్చిన క్రేజ్ అక్కడ లేదు. పారితోషికాలూ తక్కువే. కాబట్టి మళ్లీ తెలుగులో పాగా వేయాలనుకొంటోంది. కానీ కొత్తమ్మాయి రాక వల్ల… ఆమెను కనీసం పరిగణలోనికి కూడా తీసుకోవడం లేదు. దర్శకులంతా ఆమెను పూర్తిగా పక్కన పెట్టేశారు. దాంతో ఇప్పుడు హీరోల వైపు నుంచి నరుక్కొని రావడానికి ప్రయత్నిస్తోంది.
తను తెలుగులో విరివిగా సినిమాలు చేస్తున్నప్పుడు కొంతమంది యువ హీరోలతో బాగా సన్నిహితంగా మెలిగేది. వ్యక్తిగతంగా మంచి సాన్నిహిత్యం ఉంది. దాంతో ఇప్పుడు ఆ అనుబంధాన్ని వాడుకొని, ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తోందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘మనం అప్పట్లో అలా ఉండేవాళ్లం కదా. ఇప్పుడు కలిసి ఎందుకు సినిమా చేయకూడదు..? దర్శక నిర్మాతల్ని నన్ను గట్టిగా రికమెండ్ చేయ్’ అంటూ ఫోర్స్ చేస్తోందని టాక్. ఒక్క హీరోతోనే కాదు.. తనకు పరిచయం ఉన్న హీరోలందరితోనూ ఇలానే వ్యవహరిస్తోందట. చివరికి ఆ హీరోయిన్ నుంచి ఫోన్ వస్తోందంటేనే భయపడిపోతున్నారు హీరోలు. ఇంత వ్యవహారం నడుపుతున్నా.. ఆ హీరోయిన్‌కి తెలుగులో ఒక్క అవకాశం కూడా దక్కడం లేదు. బడా హీరోలు రికమెండేషన్ చేస్తే.. ఆ హీరోయిన్నే సినిమాల్లోకి తీసుకొంటుంటారు. టైర్ 2 హీరోల దగ్గర ఆ సౌలభ్యం లేదు. కొంతమంది దర్శకులు హీరోల్ని ఆప్షన్ అడుగుతారు కానీ… చివరికి తమకు నచ్చిన హీరోయిన్నే సినిమాల్లోకి తీసుకొంటారు. అంతిమంగా వాళ్లకు సినిమా రిజల్ట్ ముఖ్యం. కాబట్టి హీరోల మాటలు కూడా చెల్లుబాటు అవ్వడం లేదు. అందుకే ఆ హీరోయిన్ ఇంకా అవకాశాల కోసం అన్వేషిస్తూనే ఉంది.
