14 ఏళ్ల కిందటి కేసులో జగ్గారెడ్డి అరెస్ట్..! రాజుకున్న రాజకీయం..!!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత… సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డిని నిన్న ఆర్థరాత్రి పోలీసులు హడావుడిగా అరెస్ట్ చేశారు. పటాన్‌చెరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో.. సివిల్ డ్రెస్‌లో వచ్చిన పోలీసులు.. పరారీలో ఉన్న వ్యక్తిని పట్టుకున్నట్లుగా.. జగ్గారెడ్డిని పట్టుకుపోయారు. పధ్నాలుగేళ్ల కిందట..జగ్గారెడ్డి… మనుషుల అక్రమ రవాణా చేశారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో… అరెస్ట్ చేశామని పోలీసులు మీడియాకు చెబుతున్నారు. పధ్నాలుగేళ్ల కిందట.. జగ్గారెడ్డి భార్యాపిల్లల పేరుతో ముగ్గురు గుజరాతీల్ని తీసుకెళ్లి అమెరికాలో వదలి పెట్టి వచ్చారనేది ఆరోపణ. తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకున్న సమయంలో జగ్గారెడ్డిని అరెస్ట్ చేయడం దుమారం రేపుతోంది. జగ్గారెడ్డిని అరెస్ట్ చేసిన సమాచారం తెలిసిన వెంటనే.. పీసీసీ ముఖ్యనేతలంతా పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ప్రభుత్వానికి హెచ్చరికలు చేశారు. సంగారెడ్డి మొత్తం బంద్ పాటిస్తున్నారు.

తెలంగాణలో టీఆర్ఎస్‌ను గట్టిగా ఎదుర్కొనేవాళ్లలో జగ్గారెడ్డి ముందు ఉంటారు. కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సభ నిర్వహించాలన్నా.. ఆయనే ముందు ఉంటారు. కొద్ది రోజుల కిందట.. రాహుల్ గాంధీ సభను నిర్వహించడానికి కోమటిరెడ్డి లాంటి వాళ్లు వెనుకడుగు వేస్తే..సంగారెడ్డిలో తాను బాధ్యత తీసుకుని సభ పెట్టించారు జగ్గారెడ్డి. అప్పటి నుంచే కాంగ్రెస్‌లో జోష్ వచ్చింది. ఎన్నికలు ఖాయం అని తేలిన తర్వాత ఇప్పుడు మరో సభ నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు. మెడికల్ కాలేజీ కోసం ఆందోళనలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో జగ్గారెడ్డిని 14 ఏళ్ల కిందట.. నేరం చేశారని ఆరోపించి అరెస్ట్ చేయడం .. రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది.

నిజానికి దాదాపుగా పుష్కరం కిందట… ప్రజాప్రతినిధులు.. తమకు ఉన్న అడ్వాంటేజ్‌ను అడ్డం పెట్టుకుని… మనుషుల్ని అక్రమ రవాణా చేశారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఎక్కువగా ఉత్తరాది ప్రజాప్రతినిధులపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో అప్పట్లో టీఆర్ఎస్ సభ్యులపైనా అవే ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో టీఆర్ఎస్‌లో ఉన్న ఆలె నరేంద్ర అనే ముఖ్యనేతను… పార్టీ నుంచి బహిష్కరించడానికి కేసీఆర్ ఈ ఆరోపణలను.. ఓ అస్త్రంగా వాడుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ కేసులేవీ బయటకు రాలేదు. ఇప్పుడు హఠాత్తుగా… జగ్గారెడ్డి.. అలా మనుషుల అక్రమ రవాణా చేశారని.. కేసు పెట్టి ఏకంగా అరెస్ట్ చేసేశారు. పీసీసీ నేతలు.. ఇప్పుడు రివర్స్‌లో ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్, హరీష్‌పైనా… అక్రమ రవాణా కేసులు ఉన్నాయంటున్నారు. హరీష్ కుటుంబ సభ్యుల పేర్లతో ఇప్పటికీ.. అమెరికాలో కొంత మంది ఉన్నారని.. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణ రాజకీయం.. కొత్త కొత్త మలుపులు తిరుగుతుందని భావించక తప్పదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close