తిరుమల మాజీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు హత్య కేసుగా మార్చారు. అన్ని ఆధారాలు పరిశీలించిన తర్వాత ఆయన ప్రమాదవాశాత్తూ లేదా .. ఆత్మహత్య చేసుకోలేదని తేల్చారు. బలమైన ఆయుధం..గొడ్డలి లాంటి ఆయుధంతో ముందుగా తలపై దాడి చేశారని ఆ తర్వాత రైలు ప్రమాదం జరిగినట్లుగా సృష్టించారని గుర్తించారు. ఈ మేరకు హత్య కేసుగా మార్చారు.
ఉదయం తిరుపతిలో సిట్ ఆఫీసు లో హాజరు కావడానికి తాను పనిచేస్తున్న రైల్వే పోలీసు విభాగం గుంతకల్లు నుంచి రైల్లో బయలుదేరేందుకు ఆయన పదకొండున్నర సమయంలో స్టేషన్ కు వచ్చాడు. ఆయన బైక్ ను స్టేషన్ పార్కింగ్ లో గుర్తించారు. సీసీ ఫుటేజిని కూడా వెలికి తీశారు. ఆయనను ఎవరైనా ఫాలో అయ్యారా లేదా అన్నది కూడా విశ్లేషిస్తున్నారు. సతీష్ కుటుంబ సభ్యులు ఆయనది హత్యేనని.. పరకామణి కేసుతో సంబంధం ఉందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ కేసును పోలీసులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ కూడా వచ్చి సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. హత్య అనడానికి కొన్ని క్లూస్ లభించాయని అంతర్గతంగా అన్నీ బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. కొన్ని రోజుల్లో ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.


