రవిప్రకాష్‌కు బెయిల్.. అయినా జైల్..!

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌కు బెయిల్ మంజూరయింది. కానీ పోలీసులు ఆయనను కొద్ది గంటల ముందే మరో కేసులో పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకోవడంతో.. రిలీజయ్యే అవకాశం లేదు. టీవీ9 కొత్త యాజమాన్యం చేసిన “బోనస్” ఫిర్యాదు మేరకు పోలీసులు  ఐదో తేదీన రవిప్రకాష్‌ను అరెస్ట్ చేశారు. అప్పట్నుంచి ఆయనను రిమాండ్ ఖైదీగా ఉంచారు. సీఈవోగా ఉన్న సమయంలో అక్రమంగా రూ. 18 కోట్లు డ్రా చేసుకున్నారంటూ నమోదు చేసిన కేసుపై అదనపు వివరాలు తెలుసుకుంటామంటూ… పోలీసులు కస్టడీకి అడిగారు. కానీ కోర్టు నిరాకరించింది. హైకోర్టు కూడా తదుపరి చర్యలేమీ వద్దని ఆదేశించండంతో.. ఆయనకు బెయిల్ రావడం ఖాయమయింది. ఏ క్షణమైనా బెయిల్ ఉత్తర్వులు వస్తాయని పోలీసులు ఊహించి.. ఆయనను.. నకిలీ ఈమెయిల్ ఐడీ సృష్టించారంటూ.. ఐటీ చట్టం కింద అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరు పరిచారు. సహజంగానే పధ్నాలుగు రోజుల రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులనూ.. రవిప్రకాష్ బెయిల్ పొందితేనే బయటకు రాగలుగుతారు. అయితే.. పోలీసులు ఆ తర్వాత  మరో పెట్టీ కేసు ఏదో ఒక్కటి పెట్టరన్న గ్యారంటీ లేదు.

రవిప్రకాష్‌ను కచ్చితంగా జైల్లో ఉంచాలన్న లక్ష్యంతోనే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి. పోలీసులకు ఇలా.. ఓ వ్యక్తి అదే పనిగా జైల్లో ఉంచేలా.. ఓ ప్రణాళిక ప్రకారం వ్యవహరించాల్సిన పని లేదని.. ఓ బలమైన శక్తి .. ఆయనను జైల్లో ఉంచేలా.. పోలీసులకు మార్గదర్శకం చేస్తున్నాన్న విమర్శలు రవిప్రకాష్ క్యాంప్ నుంచి వినిపిస్తున్నాయి. ఆ బలమైన శక్తి… ఆయన ఢీకొంటున్న జూపల్లి రామేశ్వరరావు, మేఘా కృష్ణారెడ్డిలేనని ఇప్పటికే రవిప్రకాష్ బహిరంగంగా ఆరోపణలు చేశారు. పోలీసును జూపల్లి రామేశ్వరారరావు నేరుగా ఆదేశిస్తున్నారని గతంలోనే ప్రకటించారు.

రవిప్రకాష్ పెట్టిన కేసులు అరెస్ట్ చేసేంత పెద్ద కేసులు కాదని… న్యాయనిపుణులు చెబుతున్నారు. ఐటీ చట్టం కింద… ఓ ఫేక్ ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేశారన్న కేసు పెట్టడమే హాస్యస్పదమయితే దాని కోసం ప్రత్యేకంగా పీటీ వారెంట్ తీసుకుని… మరీ రిమాండ్‌కు తరలించాల్సిన అవసరం ఏముందనేది.. చాలా మందికి వస్తున్న సందేహం. రవిప్రకాష్‌ పోరాడుతున్న వ్యక్తులు అత్యంత బలమైన వారు కావడం.. వారికి అధికారం అండగా ఉండటంతో.. వారి ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజ్యాంగం, చట్టం, న్యాయం ఏవీ కూడా… ఉనికిలో లేనట్లుగా పరిస్థితులు మారడం.. అందర్నీ విస్మయ పరుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంగ్లిష్ మీడియం కోసమూ సుప్రీంకోర్టుకు ఏపీ సర్కార్..!

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో ఇంగ్లిష్ మీడియం మాత్రమే ఉండాలనే పట్టుదలను ప్రదర్శిస్తున్న ఏపీ సర్కార్.. సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో...

కృష్ణా బోర్డు భేటీలో ఎప్పటి వాదనలే.. ఎప్పటి వాటాలే..!

కృష్ణా నద యాజమాన్య బోర్డు భేటీలో ఆరు గంటలు వాదోపవాదాలు చేసుకున్నా..చివరికి మొదటికే వచ్చారు రెండు రాష్ట్రాల అధికారులు. ఇద్దరి వాదనలుక..కేఆర్ఎంబీ బోర్డు.. డీపీఆర్‌లు సమర్పించాలనే సూచనతో ముగింపునిచ్చింది. డీపీఆర్‌లు...

తూచ్.. విజయ్‌ మాల్యాను అప్పగించరట..!

విజయ్ మాల్యాను అప్పగించడం లేదని బ్రిటన్ ప్రభుత్వం తేల్చేసింది. న్యాయపరమైన ప్రక్రియ పూర్తి కాలేదని.. చట్ట లాంచనాలు పూర్తి చేయాల్సి ఉందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. అవి ఏమిటో..ఎప్పుడు పూర్తవుతాయో..మాత్రం చెప్పడం లేదు....

బాల‌య్య ఇంట్లో విందు… చిరు వ‌స్తాడా?

జూన్ 10... బాల‌కృష్ణ పుట్టిన రోజు. ఈసారి పుట్టిన రోజు ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. ఇది ఆయ‌న ష‌ష్టి పూర్తి మ‌హోత్స‌వ సంవ‌త్స‌రం. అందుకే ఈ పుట్టిన రోజుని కాస్త ప్ర‌త్యేకంగా జ‌రుపుకోవాల‌ని బాల‌య్య...

HOT NEWS

[X] Close
[X] Close