ఫ్రైడే స్పెషల్: సీబీఐ అదే వాదన వినిపిస్తే జగన్‌కు కష్టమే..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నేడు “డీ డే”. కోర్టుకు వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్‌పై నేడు సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే సీబీఐ.. జగన్ పిటిషన్ కు వ్యతిరేకంగా స్ట్రాంగ్ కౌంటర్ దాఖలు చేసింది. తాను ముఖ్యమంత్రి అయ్యానని.. ఏపీ లోటు బడ్జెట్‌లో ఉందని.. తాను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావడం వల్ల… ప్రజాధనం ఖర్చు అవుతుందనే కారణంతో… వైఎస్ జగన్… వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరారు. జగన్ పిటిషన్ ను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. జగన్‌ వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని వాదించింది.

జగన్‌ పిటిషన్‌కు వ్యతిరేకంగా సీబీఐ దాఖలు చేసిన కౌంటర్‌లో సీబీఐ చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది. జగన్‌ జైల్లో ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేశారని.. తెలిపింది. ఇప్పుడు సీఎం పదవిలో ఉన్న జగన్‌.. సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ కౌంటర్‌లో వాదించింది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చే కారణం కాదని సీబీఐ స్పష్టం చేసింది. విజయవాడ నుంచి వారానికోసారి రావడం.. కష్టమేమీ కాదని కౌంటర్‌లో సీబీఐ స్పష్టం చేసింది. ఎంపీగా ఉన్న జగన్‌ సాక్షులను ప్రభావితం చేయడంతోపాటు ఆధారాలను తారుమారు చేసే ప్రయత్నం చేయడం వల్లే ఆయన్ను అరెస్టు చేశామని సీబీఐ చెబుతోంది. అరెస్టును సీబీఐ ప్రత్యేక కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా సమర్థించాయని కౌంటర్‌లో పేర్కొన్నారు. హవాలా ద్వారా డబ్బు మళ్లించిన మైనెక్‌ మెహతా, మరో సాక్షిగా ఉన్న గోపాలకృష్ణన్‌ మురళిలను.. బెదిరించిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. కౌంటర్‌లో చెప్పిన విషయాలన్నీ గతంలో సీబీఐ కోర్టుకు సమర్పించిన ఆధారాలే. ఇప్పుడు మరోసారి కోర్టుకు గుర్తు చేసింది.  

సాధారణంగా…  విచారణ సంస్థలు వ్యతిరేకిస్తే కోర్టులు బెయిళ్లు, వ్యక్తిగత హాజరు మినహాయింపులు ఇవ్వవు. జగన్ పై సీబీఐ వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుంటే.. అవకాశమే ఉండదు.  విచారణ సంస్థలు వ్యతిరేకిస్తున్న కారణంగానే.. చిదంబరం, డీకే శివకుమార్ లాంటి నేతలకు ఇంత వరకూ బెయిల్ దక్కలేదు. నెల రోజులకుపైగానే వారు జైళ్లలో ఉంటున్నారు.  ఇప్పుడు సీబీఐ వాదన జగన్మోహన్ రెడ్డి పిటిషన్‌కు వ్యతిరేకంగా ఉండటంతో.. ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌కు వైసీపీ ముఖ్య నేతలు గురవుతున్నారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించకపోతే జగన్‌కు కొత్త చిక్కులు ప్రారంభమవుతాయి. ముఖ్యమంత్రి హోదాలో వారం.. వారం కోర్టుకు వెళ్లడం నైతికత కాదు. అందుకే జగన్‌కు ఈ రోజు డీ డేగా మారింది.  

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close