కాన్సాస్ లో కాల్పులు, నలుగురు మృతి

అమెరికాలో గన్ సంస్కృతి గురించి గుర్తు చేస్తూ ఎక్కడో అక్కడ కాల్పులు జరగడం, దానిలో అమాయకులయిన ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, గాయపడటం గురించి తరచు వార్తలు వింటూనే ఉంటాము. మళ్ళీ అటువంటి వార్త గురించి ఇప్పుడు మరోసారి చెప్పుకోవలసి వస్తోంది.

కాన్సాస్ సమీపంలోని హేస్టన్ అనే చిన్న పట్టణంలో గల ఎక్సెల్ ఇండస్ట్రీస్ అనే సంస్థలో పనిచేసిన సెడ్రిక్ ఫోర్డ్ అనే మాజీ ఉద్యోగి ఈ దుశ్చర్యకి పాల్పడ్డాడు. అతను గురువారం ఉదయం ఏకే-47 మెషన్ గన్ తీసుకొని ఆ కర్మాగారం వద్దకు వచ్చి ఆవరణలో ఉన్న ఒక వ్యక్తిని కాల్చి చంపాడు. ఆ తరువాత లోపలకి ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో మరో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఆ కాల్పులలో కనీసం 30మందికి పైగా గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు హార్వే కంట్రీ షరీఫ్ టి. వాల్టన్ తెలిపారు. ఈ సంగతి తెలియగానే అక్కడికి చేరుకొన్న పోలీసులు, సెడ్రిక్ ఫోర్డ్  ని కాల్చి చంపారు.

అమెరికాలో ఈ వికృత గన్ సంస్కృతి వలన ఏటా కనీసం 25-30,000 మంది పౌరులు మరణిస్తున్నారు. కనుక దానిని అరికట్టేందుకు చట్టసవరణలు చేయాలని ఒబామా ప్రభుత్వం ప్రయత్నించింది కానీ దానికి ప్రజల నుండి వ్యతిరేకత ఎదురవడంతో వెనకడుగు వేయవలసి వచ్చింది. ప్రభుత్వంతో యొక్క ఈ నిస్సహాయత కారణంగానే తరచూ ఇటువంటి వార్తలు వినవలసివస్తోంది. అది అమెరికా స్వయంకృతాపరాధమే కనుక దానికి ఎవరినీ నిందించలేము.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆదర్శప్రాయ వ్యక్తిగా తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకున్న తమ్మినేని..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. తనను తాను ఆదర్శప్రాయ వ్యక్తిగా సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. ఆదర్శ ప్రాయ వ్యక్తిగా.. స్పీకర్ హోదాలోనే కోర్టులపై కామెంట్లు చేశానని చెప్పుకొచ్చారు. న్యాయవ్యవస్థపై.. తమ్మినేని సీతారాం రెండురోజుల...

ఇక రామ్ చ‌ర‌ణ్… వెబ్ సిరీస్‌

రాబోయే రోజుల్లో వెబ్ సిరీస్‌లు వినోద రంగాన్ని ఆక్ర‌మించ‌బోతున్నాయి. సినిమాల్ని మించిన మేకింగ్‌, కంటెంట్‌తో వెబ్ సిరీస్‌లు ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని అందిస్తున్నాయి. వాటి ప్రాధాన్య‌త‌ని స్టార్లు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. స‌మంత‌, త‌మ‌న్నా లాంటి...

బాల‌య్య‌తో అమ‌లాపాల్‌?

నంద‌మూరి బాల‌కృష్ణ - బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. `మోనార్క్‌` అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. బాల‌య్య పుట్టిన రోజున‌... ఓ ప‌వ‌ర్ ఫుల్ టీజ‌ర్ విడుద‌ల చేశాడు...

అమరావతి విషయంలో ప్రధానిపై భారం వేస్తున్న చంద్రబాబు..!

అమరావతి రైతుల ఉద్యమం ప్రారంభమై రెండు వందల రోజులు పూర్తయిన సందర్భంగా... దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు..వర్గాలు..మేధావుల నుంచి మద్దతు లభిస్తోంది. వర్చవల్ పద్దతిలో అందరూ.. పెద్ద ఎత్తున తమ సంఘిభావం తెలియచేస్తున్నారు....

HOT NEWS

[X] Close
[X] Close