విరాగాలు 5 : కూత లేదు మోత లేదు…

కూత లేకనే వచ్చెను ‘ప్రభు’వు రైలు బడ్జెట్టు
ప్రైవేటుకు పెద్దపీట వేయు గొప్ప కనికట్టు!
వైఫై గట్రా సేవలు సరికొత్త తరం చాక్లెట్టు
ధరల మోత మోగలేదు… జనానికది బిస్కట్టు!!

వసతులు అను ఊసు తప్ప విస్తరణల బాస లేదు
కొత్త మార్గాలూ రైళ్లనసలు ప్రకటించిన జాడ లేదు
తెలుగు జనుల ఆశలపై ఘనముగ చిలకరించె నీళ్లు
కొత్త రాష్ట్రాల కోటి కోర్కెలకే సమాధులౌ ఆనవాళ్లు

ఎలాంటి ప్రత్యేకతలు లేకుండా సురేశ్‌ప్రభు రైల్వేబడ్జెట్టును ప్రతిపాదించేశారు. 1.21 లక్ష ల కోట్ల ఖర్చును చూపించారే తప్ప.. అంత భారీ ఖర్చు వలన కొత్తగా ఏర్పాటు అవబోతున్న ఫ్యాక్టరీలు, కొత్త రైలు మార్గాలు ఏమీ కనిపించడం లేదు. అయినా సురేశ్‌ ప్రభు మొత్తానికి మమ అనిపించారు. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఆయన బడ్జెట్‌లో వంచన జరిగిందనే చెప్పాలి. ఇటు తెలంగాణకు గానీ.. అటు ఆంధ్రప్రదేశ్‌కు గానీ పెద్దగా ఒరిగిందేమీ లేదు.
ఈ రెండు రాష్ట్రాలు కూడా ఈసారి చాలా ఆశలు పెట్టుకున్నాయి. ఏపీ సర్కారు ఎన్డీయేలో భాగస్వామే కాగా, తెరాస కూడా అంతో ఇంతో స్నేహంగానే మెలగుతోంది. దానివల్ల తమ రాష్ట్రాలకు లబ్ధి ఉంటుందని వారు భావించారు. కానీ.. సురేశ్‌ ప్రభు వారినందరినీ కూడా దారుణంగా నిరాశపరిచారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్: మారుతి నుంచి ‘బేబీ’లాంటి ‘బ్యూటీ’

గ‌తేడాది వ‌చ్చిన సూప‌ర్ హిట్ల‌లో 'బేబీ' ఒక‌టి. చిన్న సినిమాగా వ‌చ్చి, సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకొంది. నిర్మాత‌ల‌కు, పంపిణీదారుల‌కూ విప‌రీత‌మైన లాభాల్ని పంచిపెట్టింది. ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా...

కాళ్లు పట్టుకోవడంలో పెద్దిరెడ్డి ఎక్స్‌పర్ట్ – కిరణ్ చెప్పిన ఫ్లాష్ బ్యాక్ !

కిరణ్ కుమార్ రెడ్డికి.. పెద్దిరెడ్డికి రాజకీయ వైరం దశాబ్దాలుగా ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు. ఒకే పార్టీలో ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డిపై పెద్దిరెడ్డికి వ్యతిరేకత ఉంది. కానీ తాను...

తేజా స‌జ్జా… క‌రెక్టు రూటులో!

'హ‌నుమాన్' లాంటి హిట్ త‌ర‌వాత ఏ హీరోకైనా కాస్త క‌న్‌ఫ్యూజన్ మొద‌లైపోతుంది. త‌ర‌వాత ఏం చేయాలి? ఎలాంటి క‌థ‌లు ఎంచుకోవాలి? అనే విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డిపోతుంటారు. ఆ గంద‌ర‌గోళంలో త‌ప్పులు...

మేనిఫెస్టో మోసాలు : సీపీఎస్ రద్దు ఏది బాసూ !

" అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు " .. ఈ డైలాగ్ పాదయాత్ర పొడుగుతూ వినిపించింది. ఉద్యోగుల్ని పిలిపించుకుని ర్యాలీలు చేసి... ప్లకార్డులు పట్టుకుని ఎంత డ్రామా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close