థానేలో దారుణం: ఒకే కుటుంబానికి చెందిన 14మంది హతం

హైదరాబాద్: మహారాష్ట్రలోని థానే పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తన కుటుంబంలోని 14 మందిని హతమార్చి, తాను కూడా ఆత్మహత్యచేసుకుని చనిపోయాడు. చనిపోయిన వారిలో హంతకుడి తల్లిదండ్రులు, ముగ్గురు సోదరీమణులు, భార్యతోపాటు ఎనిమిదిమంది పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఘటన ఇవాళ తెల్లవారుఝామున జరిగింది.

నిందితుడు 35 ఏళ్ళ మహమ్మద్ హన్సిల్ అన్వర్ వారేకర్ ఒక ఛార్టర్డ్ ఎకౌంటెంట్ అని తెలిసింది. అతను వీరందరికీ ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చి, వారు స్పృహకోల్పోయి పడిపోయిన తర్వాత కత్తితో గొంతులు కోశాడని చెబుతున్నారు. ఆ తర్వాత అతను ఉరివేసుకుని చనిపోయాడు. అతని చేతిలో ఆ కత్తి కూడా ఉంది. మరోవైపు అతని బారిన పడినవారిలో ఒక మహిళ మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఆమె కోలుకుంటే ఈ ఘటనపై మరింత వివరాలు బయటకొచ్చే అవకాశముంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com