ఏడాదిలో 90 శాతం హామీలు అమలు చేశాం : జగన్

మద్యం రేట్లను పెంచడం ద్వారా మద్యం తాగే వారి సంఖ్య 24 శాతం మేర తగ్గిపోయిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తేల్చారు. పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా.. మన పాలన- మీ సూచన అనేక ఐదు రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి రోజు పాలన వ్యవస్థలో వికేంద్రీకరణ, సచివాలయాల వ్యవస్థపై చర్చ జరిగింది. సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. లబ్ధిదారులు, వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించినవారితో మాట్లాడి.. ప్రభుత్వ పనితీరుపై సూచనలు, సలహాలు స్వీకరించారు. ఈ సందర్భంగా జగన్ వివక్షలేని పాలన అందించాలని గట్టిగా అనుకున్నానని.. ఆ మేరకు.. మనసా, వాచా, కర్మణా నీతివంతంగా పాలన అందిస్తున్నానన్నారు. చివరి లబ్దిదారుడి వరకు అందరికీ న్యాయం చేసేందుకు విప్లవాత్మక మార్పులు తెచ్చామని గుర్తు చేశారు. ప్రజల ఇంటి ముందుకే సంక్షేమ ఫలాలు తెచ్చి ఇస్తున్నామని గుర్తు చేశారు.

అధికారంలోకి వచ్చిన ఏడాదిలో నాలుగు లక్షల ఉద్యోగాలిచ్చామన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా లక్షా 35వేల ఉద్యోగాలు.. ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను నియమించామని .. ప్రజలందరూ సంతృప్తి చెందే స్థాయిలో గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. గతంలో లంచమిస్తే తప్ప పెన్షన్‌ రాని పరిస్థితి ఉండేదని.. ఇప్పుడు ప్రతినెలా ఒకటో తారీఖు ఉదయాన్నే చిరునవ్వుతో పెన్షన్‌ అందిస్తున్నామని గుర్తు చేశారు. మద్య నియంత్రణ కోసమే…రేట్లను భారీగా పెంచామని.. అందు వల్ల గతంలో వారానికి ఐదుసార్లు తాగేవాళ్లు ఇప్పుడు రెండుసార్లే తాగుతున్నారని విశ్లేషించారు. ప్రతి గ్రామంలో ఇంగ్లీష్‌ మీడియం స్కూల్స్‌ తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం.. 54 రకాల మందులు గ్రామస్థాయిలో అందుబాటులో ఉంచబోతున్నామన్నారు. వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం.. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ జనతా బజార్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నామని .. మొదటి సంవత్సరంలోనే 90శాతం మేనిఫెస్టో హామీలను అమలు చేశామని జగన్ ప్రకటించారు. మహిళలతో పాటు వివిధ వర్గాలతో జగన్ ముఖా ముఖి మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళా సంక్షేమ పాలన నడుస్తోందన్నారు. మరో నాలుగు రోజుల పాటు ఈ మేథోమథనం జరుగుతుంది. ఆ తర్వాత 30వ తేదీన ప్రమాణస్వీకారం చేసి ఏడాది అయిన సందర్భంగా… సంబరాలు చేసుకుంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ దళిత రైతు ఆత్మహత్య ప్రభుత్వ హత్యే..!

నెల్లూరు జిల్లాలో ఓ దళిత రైతు.. తన భూమిని బలవంతంగా లాక్కుంటున్నారన్న ఆవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల జరుగుతున్నాయి. అయితే.....

‘ల‌వ్ స్టోరీ’ ప్లానింగు ఇదీ….

సాధార‌ణంగా శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలు తీసే తీరు పాసింజ‌ర్ రైలుని త‌ల‌పిస్తుంటాయి. ఆగి... ఆగి.. కొంచెం.. కొంచెం.. త‌న మూడ్ ని బ‌ట్టి, షూటింగ్ చేస్తుంటాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. దానికి త‌గ్గ‌ట్టుగా లాక్...

ఆర్‌.ఎఫ్‌.సీలో సెటిలైపోతున్న రౌడీ

పూరి జ‌గ‌న్నాథ్ - విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ న‌టిస్తున్న తొలి పాన్ ఇండియా ప్రాజెక్టు ఇది. క‌థ ప్ర‌కారం సినిమా మొత్తం ముంబైలోనే...

‘ఓ పిట్ట క‌థ’ లాభాల వెనుక పెద్ద క‌థ‌

లాక్ డౌన్‌కి ముందు, థియేట‌ర్లు మూసివేయ‌డానికి ఓ వారం ముందు విడుద‌లైన సినిమా 'పిట్ట‌క‌థ‌'. మంచి ప‌బ్లిసిటీతో విడుద‌లైన ఈ చిన్న సినిమా.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఏ ర‌క‌మైన ప్ర‌భావాన్నీ చూపించ‌లేక‌పోయింది. క‌రోనా...

HOT NEWS

[X] Close
[X] Close