బీజేపీ తల్చుకుంటే శ్రీవారి ఆస్తుల అమ్మకం నిలిపివేత ఎంత సేపు..!?

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు..శ్రీవారి ఆస్తులను అమ్మకానికి పెట్టిన విషయంపై బీజేపీ భగ్గమని లేస్తోంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు దీక్షలకు సిద్ధమయ్యారు..తెలంగాణ నేతలు కూడా.. ఊరుకునేది లేదని.. హెచ్చరికలు జారీ చేస్తున్నారు. స్వయంగా… బీజేపీ సిఫారసు మీద.. పాలకమండలిలో సభ్యుడిగా పదవి పొందిన రాకేష్ శర్మ కూడా.. ఈ అమ్మకాల నిర్ణయాన్ని వ్యతిరేకించారు. బోర్డు అనుమతితోనే… ఆస్తుల అమ్మకాల నిర్ణయం తీసుకున్నామని .. టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి చెబుతున్నారు కానీ.. రాకేష్ శర్మ మాత్రం.. అలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పడం లేదు. గత పాలక మండలి సమావేశం నిర్ణయం అని చెబుతూ.. ఇప్పుడు అమ్మకం ఏమిటని ప్రశ్నించారు. భక్తులు ఎంతో.. సెంటిమెంట్‌గా శ్రీవారికి ఆస్తులు విరాళాలుగా ఇస్తారని .. ఆ సెంటిమెంట్ ను గౌరవించి.. ఆస్తుల అమ్మకాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

భారతీయ జనతా పార్టీ.. టీటీడీ నిర్ణయంపై.. రాజకీయ పోరాటం చేస్తోంది. శ్రీవారి భక్తులు, హిందూ సంస్థలు, బీజేపీ శ్రేణులు ఆందోళనలకు సిద్ధం కావాలని పిలుపునిస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా.. అదే వాదన వినిపిస్తున్నారు. శ్రీవారి ఆస్తులు రక్షించకపోతే.. ఊరుకునేది లేదని చెబుతున్నారు. బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కల్యాణ్ కూడా భూముల విక్రయ నిర్ణయాన్ని వ్యతిరేకించారు భూములను అమ్మకుండా ఇతర మార్గాలను ఎందుకు అన్వేషించడం లేదు .. భూములు ఎందుకు అమ్ముతున్నారో తెలియాల్సిన అవసరం ఉందన్నారు. భూముల విక్రయంపై హైకోర్టు అనుమతి తీసుకున్నారా అని సోషల్ మీడియాలో ప్రశ్నించారు. దేవుడి భూముల విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే.. నిలిపివేయడం.. చాలా చిన్న విషయమని.. అంటున్నారు.

అయితే.. శ్రీవారి విషయంలో రాజకీయ వివాదాలు రేపి.. లబ్ది పొందాలనుకుంటే మాత్రం.. బీజేపీ హైకమాండ్ మాత్రం సైలెంట్ గా ఉంటుందని… ఆ సైలెన్స్‌ను అర్థాంగీకారంగా తీసుకుని వైసీపీ సర్కార్ మందుకెళ్తుందని.. దాన్ని బీజేపీ హిందూత్వ రాజకీయంతో క్యాష్ చేసుకుంటుందని అంటున్నారు. నిజంగా శ్రీవారి ఆస్తులను.. పరిరక్షించాలని.. భక్తుల సెంటిమెంట్లను గౌరవించాలనే లక్ష్యం ఉంటే మాత్రం.. పై స్థాయిలో ఒత్తిడి తెచ్చి అయినా బీజేపీ.. వైసీపీ సర్కార్ నిర్ణయాన్ని నిలిపి వేస్తుందని అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ దళిత రైతు ఆత్మహత్య ప్రభుత్వ హత్యే..!

నెల్లూరు జిల్లాలో ఓ దళిత రైతు.. తన భూమిని బలవంతంగా లాక్కుంటున్నారన్న ఆవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల జరుగుతున్నాయి. అయితే.....

‘ల‌వ్ స్టోరీ’ ప్లానింగు ఇదీ….

సాధార‌ణంగా శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలు తీసే తీరు పాసింజ‌ర్ రైలుని త‌ల‌పిస్తుంటాయి. ఆగి... ఆగి.. కొంచెం.. కొంచెం.. త‌న మూడ్ ని బ‌ట్టి, షూటింగ్ చేస్తుంటాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. దానికి త‌గ్గ‌ట్టుగా లాక్...

ఆర్‌.ఎఫ్‌.సీలో సెటిలైపోతున్న రౌడీ

పూరి జ‌గ‌న్నాథ్ - విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ న‌టిస్తున్న తొలి పాన్ ఇండియా ప్రాజెక్టు ఇది. క‌థ ప్ర‌కారం సినిమా మొత్తం ముంబైలోనే...

‘ఓ పిట్ట క‌థ’ లాభాల వెనుక పెద్ద క‌థ‌

లాక్ డౌన్‌కి ముందు, థియేట‌ర్లు మూసివేయ‌డానికి ఓ వారం ముందు విడుద‌లైన సినిమా 'పిట్ట‌క‌థ‌'. మంచి ప‌బ్లిసిటీతో విడుద‌లైన ఈ చిన్న సినిమా.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఏ ర‌క‌మైన ప్ర‌భావాన్నీ చూపించ‌లేక‌పోయింది. క‌రోనా...

HOT NEWS

[X] Close
[X] Close