తూచ్.. శ్రీవారి భూములు అమ్మాలని బోర్డు నిర్ణయం తీసుకోలేదన్న సుబ్బారెడ్డి..!

శ్రీవారి భూములు అమ్మడానికి ఆస్తులు గుర్తించి..రిజిస్ట్రేషన్ అధికారాలను కూడా అధికారులకు కట్టబెట్టేసిన తర్వాత… ఇప్పుడు వివాదం ఏర్పడటంతో.. టీటీడీ బోర్డు చైర్మన్ మాట మార్చారు. భూములు అమ్మడానికి పాలక మండలి నిర్ణయం తీసుకోలేదని…కేవలం భూములు అమ్మకానికి రోడ్ మ్యాప్ మాత్రమే తయారు చేయాలని పాలక మండలి సూచించిందనే కొత్త వాదన తెరపైకి తీసుకు వచ్చారు. వేలంపై రెండు బృందాలను ఏర్పాటు చేశాం.. వేలం వేయాలంటే ఏం చేయాలి? ఎలా ముందుకెళ్లాలో చెప్పాలని కోరామన్నారు. నివేదికలు వచ్చిన తర్వాత నిర్ణయం ఉంటుందని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. ధార్మిక వాదులు.. స్వాములు సహా అందరి అభిప్రాయాలు తీసుకుంటామని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. శ్రీవారికి భక్తులు సెంటిమెంట్‌తో ఇచ్చిన ఆస్తులను అమ్మడంపై దేశవ్యాప్త దుమారం రేగింది.

దీంతో ఎవరేమనుకున్నా ఆస్తుల్ని అమ్మి తీరుతామన్న విధానంతో నిన్నటి వరకూ ఉన్న టీటీడీ ఇప్పుడు.. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు కానీ..మార్గాన్ని మాత్రం మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. టీటీడీలో నిరుపయోగంగా ఉన్న భూములను అమ్మడం కొత్తకాదని సుబ్బారెడ్డి.. అమ్మకం తప్పు కాదనే వాదనను బలంగా వినిపించే ప్రయత్నం చేశారు. 1974 నుంచి 2014 వరకు వందకుపైగా ఆస్తులు అమ్మారని.. లెక్కలు చెప్పారు. గ్రామాల్లో ఒకట్రెండు సెంట్ల టీటీడీ భూముల్ని కాపాడటం కష్టమని ఇప్పటికీ వాదిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ భూముల్ని అమ్మకానికి పెట్టిన ప్రభుత్వం..శ్రీవారి భూముల్ని కూడా… దోచుకునేందుకు ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు అన్ని వైపుల నుంచి వెల్లువెత్తాయి.

మాకు దోచుకోవాలన్న ఆలోచన లేదని.. అలా ఉంటే.. టీటీడీ భూములనే అమ్మాల్సిన అవసరం లేదని అంతకు మించిన మార్గాలున్నాయని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. షరా మామూలుగా చంద్రబాబు హయాంలో భూములు అప్పనంగా ఇచ్చేశారని ఆరోపణలు కూడా చేశారు. భూముల అమ్మకం విషయంలో అన్ని వైపుల నుంచి ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. చివరికి స్వరూపానంద స్వామి కూడా భక్తుల సెంటిమెంట్లను గౌరవించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి చెప్పినట్లుగా మీడియాకు సమాచారం ఇచ్చారు. ఇమేజ్ డ్యామేజ్ కావడంతో.. ఇప్పుడు ప్రభుత్వం వెనక్కి తగ్గతున్నట్లుగా కనిపిస్తోంది కానీ..శ్రీవారి భూముల్ని అమ్మబోమన్న ప్రకటన మాత్రం చేయలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐపీఎల్ స్టోరీస్‌: విరాట్ కి ఏమైంది?

విరాట్ కోహ్లీ.. ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ వ‌న్ బ్యాట్స్‌మెన్‌. ప్ర‌త్య‌ర్థి ఎవ‌రైనా, ఫార్మెట్ ఏదైనా - బౌల‌ర్ల‌పై భీక‌రంగా విరుచుకుపోవ‌డ‌మే త‌న‌కు తెలుసు. ఐపీఎల్ అంటే.. మ‌రింత చెల‌రేగిపోతాడు. ఐపీఎల్ లో అత్య‌ధిక ప‌రుగులు...

వైసీపీ నేతలు ఎన్ని మాటలన్నా బీజేపీ ఎందుకు భరిస్తోంది..!?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు వైసీపీ నేతలకు అలుసైపోయారు. వైసీపీ నేతలు ఏ స్థాయి వారైనా.. బీజేపీ నేతలపై ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం.. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ.....

శేఖర్ రెడ్డి వద్ద దొరికిన ఆ “కోట్లు” సాక్ష్యాలు కావా..!?

టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుడు శేఖర్‌రెడ్డికి సీబీఐ కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది. ఆయన నేరాలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవని.. కేసు మూసివేయవచ్చని సీబీఐ అధికారులు కోర్టుకు చెప్పడంతో ఈ మేరకు కోర్టు...

ఏపీ సర్కార్‌పై అశ్వనీదత్, కృష్ణంరాజు న్యాయపోరాటం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాపై సినీ నిర్మాత అశ్వనీదత్, రెబల్ స్టార్ కృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్లు వేశారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం తమ భూముల్ని తీసుకుని ఇస్తామన్న పరిహారం...

HOT NEWS

[X] Close
[X] Close