‘గాలి సంప‌త్’ ట్రైల‌ర్‌: ఫ‌.. ఫా.. ఫీ.. ఫో.. అంటే అదిరింది!

త‌న పేరు సంప‌త్‌. నోట్లోంచి గాలి త‌ప్ప మాట రాదు. అందుకే త‌న‌ని గాలి సంప‌త్ అని పిలుస్తారు. త‌న‌కో కొడుకు. త‌న‌కీ కొన్ని ఆశ‌యాలు, ఆశ‌లు, ప్రేమ‌లూ ఉన్నాయి. కానీ.. త‌నకు త‌న తండ్రే అడ్డొస్తున్నాడ‌న్న కోపం, బాధ‌, అనుమానం. మ‌రి.. ఈ తండ్రీ కొడుకుల క‌థ ఎలా సాగింది? తెలియాలంటే `గాలి సంప‌త్` చూడాల్సిందే. ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే కాకుండా, క‌థ‌, మాట‌లు. స్క్రీన్ ప్లే అందించిన సినిమా ఇది. అనీష్ కృష్ణ ద‌ర్శ‌కుడు. తండ్రీ కొడుకులుగా రాజేంద్ర ప్ర‌సాద్‌, శ్రీ విష్ణు న‌టించారు. మార్చి 11న విడుద‌ల కాబోతోంది.

అనిల్ రావిపూడి అంటే కామెడీ. కామెడీ అంటే అనిల్ రావిపూడి. ఆ మార్క్‌.. ట్రైల‌ర్‌లో క‌నిపించింది. ఫ‌.. ఫ‌.. ఫీ.. ఫా అంటూ రాజేంద్ర ప్ర‌సాద్ చేసే గా(లి)ర‌డీ మాట‌లు, దానికి స‌త్య ఇచ్చే ఎబ్రివేష‌న్లు, ర‌ఘుబాబు అనుమానాలు.. ఇవ‌న్నీ ఫ‌న్నీగా సాగాయి. అయితే.. ఎమోష‌నల్ ట‌చ్ కూడా ఉంద‌ని అర్థ‌మైంది.

”పిల్ల‌లు త‌ప్పు చేస్తే త‌ల్లిదండ్రులు చాలా ఓపిగ్గా, ప్రేమ‌గా క‌రెక్ట్ చేస్తారు. అదేంటో కాస్త మీసాలొచ్చేస‌రికి.. పెద్దోళ్లు ఏం చేసినా, ఊరికే చిరాకులు వ‌చ్చేస్తాయి.. కోపాలు వ‌చ్చేస్తాయి. నేను కూడా మానాన్నని కాస్త ఓపిగ్గా, ప్రేమ‌గా అడ‌గాల్సింది సార్”

అనే డైలాగ్‌తో.. తండ్రీ కొడుకుల మ‌ధ్య గ్యాప్ ఎక్క‌డ వ‌స్తుందో, ఎలా వ‌స్తుందో చెప్పేశాడు అనిల్ రావిపూడి. అటు ఎమోష‌న్‌, ఇటు ఫ‌న్‌, కాస్త థ్రిల్ ఇవ‌న్నీ మిక్స్ చేసిన సినిమా ఇది. ఆ తూకం స‌మ‌పాళ్ల‌లో కుదిరితే.. శ్రీ‌విష్ణుకి మ‌రో హిట్ ద‌క్కిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎగ్జిట్ పోల్స్ : గుజరాత్‌లో మళ్లీ బీజేపీ – హిమాచల్‌లో టఫ్ ఫైట్ !

రెండు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకే మొగ్గు కనిపిస్తోందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. హిమాచల్ ప్రదేశ్‌లో పోలింగ్ నెలకిందటే ముగిసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంది. గుజరాత్...

రోజాకు ఇంత అవమానమా !

మంత్రి రోజా అంటే ఫైర్ బ్రాండ్. నోరు తెరిస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. ఆ నోరుకు భయపడే మంత్రి పదవి ఇచ్చారనే టాక్ కూడా ఉంది అది వేరే విషయం. కానీ మంత్రి...

3 రాజధానులు కాదు 3 రాష్ట్రాలు చేయాలన్న పయ్యావుల !

రాయలసీమ గర్జన పేరుతో వైసీపీ నిర్వహించిన సభ ద్వారా ప్రజల మూడ్ ఏమిటో వైసీపీ పెద్దలకు అర్థమయ్యే ఉంటుందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సెటైర్ వేశారు. సీమ గర్జన పేరుతో...

విజయ్ ఫ్యామిలీతో జాన్వీ కపూర్ బాండింగ్

విజయ్‌ దేవరకొండ కి బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ వుంది. లైగర్ సినిమాకి ముందే విజయ్ అక్కడ క్రేజ్ తెచ్చుకున్నాడు. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా విజయ్ అంటే ఇష్టపడతారు. జాన్వీ కపూర్ కి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close