తమిళనాడులో ఈ సారి ఉచితాలకు మించి..!

తమిళనాడు సీఎం పళని స్వామి ఎన్నికలకు ముందుగా ప్రజలకు భారీ తాయిలాలు ప్రకటించారు.అమలు చేస్తారోలేదో తెలియదు కానీ.. అధికారికంగా నిర్ణయాలు తీసేసుకున్నారు. రుణాల మాఫీతో పాటు విద్యార్థులందరూ పరీక్షలు రాయకుండానే పాసయ్యేలా నిర్ణయం తీసుకున్నారు. పళనిస్వామి నిర్ణయాలు చూసి…తమిళ ప్రజలు కూడా నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా భయం ఇప్పుడు ఎక్కడా లేదు. స్కూళ్లు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో కొద్ది రోజుల కిందట.. 9,10,11 తరగతుల విద్యార్థులకు పరీక్షలు రద్దు చేసింది. ఒకటి నుంచి ఎనిమిది వరకు సాధారణంగానే పబ్లిక్ పరీక్షలు ఉండవు. దీంతో తమిళనాడులో అందరూ పరీక్షలులేకుండా పాస్ అయినట్లనిపించింది.

ఇదంతా ఎన్నికల జిమ్మిక్కే. విద్యార్థుల తల్లిదండ్రులను ఆకట్టుకోవడానికి పళనిస్వామి ఇలా చేశారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే సమయంలో రైతు రుణమాఫీని ప్రకటించారు. కొన్ని షరతులు పెట్టినప్పటికీ దాదాపుగా రూ. పదిహేను వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తారు. అదే సమయంలో ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయసును కూడా 60 ఏళ్లకు పెంచుతూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ పెట్టిందని తెలియగానే.. మరికొన్ని ఆఫర్లు ప్రకటించారు. అందులో బంగారం రుణాల రద్దు కూడా ఉంది.

అయితే ఇవన్నీ అమల్లోకి రావాలంటే మళ్లీ పళనిస్వామి సీఎం కావాలి. అప్పుడు మాత్రమే అమల్లోకి వస్తాయి. లేకపోతే.. రావు. ఎలా లేదన్నా.. మళ్లీ మేనిఫెస్టో విడుదల చేయాల్సి ఉంటుంది. ఆ మేనిఫెస్టోనూ మరిన్ని ఉచిత పథకాలు రెడీ అవుతాయి. మొత్తానికి అరవం మార్క్ అతి.. తమిళనాడు ఎన్నికల్లో కనిపిస్తోంది. ఇంత చేసినా పళనిస్వామికి ఏమైనా చాన్స్ ఉందా అంటే పెదవి విరుపులే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారిని ఒక్క సారీ దర్శించుకోని వైసీపీ అభ్యర్థి..!

తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తిపై భారతీయ జనతా పార్టీ నేతలు కొత్త కొత్త విషయాలు ప్రసారం చేస్తున్నారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి ఇంత వరకూ ఒక్క సారంటే ఒక్క సారి కూడా తిరుమల...

కోల్‌కతా ఓడిపోవడానికే ఆడినట్లుందే..!?

ఎవరైనా మ్యాచ్‌లు ఎందుకు ఆడతారు..? గెలవడానికే ఆడతారు. కానీ ఓడిపోవడానికే ఆడితే ఎలా ఉంటుంది..?. నిజంగా ఓడిపోవడానికి ఎవరూ ఆడరు..కానీ మంగళవారం నాటి ముంబై, కోల్‌కతా మ్యాచ్ చూస్తే రెండు జట్లు ఓడిపోవడానికి...

ఆ ప్రాజెక్ట్ చూస్తామంటే కుదరదంటోన్న ఏపీ..!

ఓ ప్రాజెక్ట్‌ను చూడటానికి వస్తామని కృష్ణాబోర్డు అంటోంది. చూసేందుకు కూడా ఒప్పుకోబోమని.. ఏపీ సర్కార్ తేల్చి చెబుతోంది. కృష్ణా బోర్డు మాత్రం.. అదే పనిగా తాము వస్తున్నామని తేదీ ఖరారు చేసి ఏపీ...

ఏపీలోనే ధరలెక్కువ..! ఎందుకని..?

సాధారణంగా నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి..? పట్టణాల్లో .. నగరాల్లో ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో దేశంలో అన్ని ప్రాంతాల్లో ఉన్న సాధారణ రేట్లే ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం.. నిత్యావసర...

HOT NEWS

[X] Close
[X] Close