మ‌ళ్లీ గ‌బ్బ‌ర్ సింగ్ కాంబో

ప‌వ‌న్ క‌ల్యాణ్ – హ‌రీష్ శంక‌ర్ చేసిన `మాస్ మ్యాజిక్‌`కి నేటితో స‌రిగ్గా ఎనిమిదేళ్లు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ ఫ్యాన్స్ గ‌బ్బ‌ర్ సింగ్ విశేషాల్ని ఇంకోసారి గుర్తు చేసుకుని ఖుషీ ఖుషీ అయిపోతున్నారు. దానికి ఇప్పుడు ఓ బోన‌స్ కిక్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది మైత్రీ మూవీస్. త్వ‌ర‌లోనే మైత్రీ మూవీస్‌లో ప‌వ‌న్ కల్యాణ్ క‌థానాయ‌కుడిగా ఓ సినిమా రూపొందుతోంది. దీనికి హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌కుడు. ఇప్పుడు ఈ చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడు ఫిక్స‌య్యాడు. ఆ బాధ్య‌త దేవిశ్రీ ప్ర‌సాద్ కి అప్ప‌గించింది మైత్రీ మూవీస్. అంటే.. గ‌బ్బ‌ర్ కాంబో మ‌ళ్లీ రిపీట్ అవ్వ‌బోతోంద‌న్న‌మాట‌. ప‌వ‌న్‌కి ఎప్పుడూ అదిరిపోయే పాట‌లే ఇచ్చాడు దేవి. గ‌బ్బ‌ర్ సింగ్‌, అత్తారింటికి దారేది, జ‌ల్సా సినిమాల‌కు దేవినే సంగీతం అందించాడు. అవ‌న్నీ మ్యూజిక‌ల్ హిట్సే. స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమా ఫ్లాప్ అయినా – పాట‌లు బాగుంటాయి. సో.. మ‌రో సారి మ్యూజిక‌ల్ బొనాంజాకి ప‌వ‌న్ ఫ్యాన్స్ సిద్ధ‌మైపోవ‌చ్చిక‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close