కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ ఉద్రిక్తత..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. నిబంధనలకు.. విభజన చట్టాలకు తూట్లు పొడిచేలా.. ఏపీ ముఖ్యమంత్రి కృష్ణా జలాల విషయంలో.. కొత్త ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో నిర్ణయం తీసుకున్నారని కేసీఆర్ మమండిపడ్డారు. తాను జల వివాదాలను పరిష్కరించుకునేందుకు స్వయంగా స్నేహహస్తం అందించినప్పటికీ… ఏపీ సర్కార్ ఇలా చేయడం ఏమిటని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రితో వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత.. జలవనరులశాఖ ఉన్నతాధికారులతో పాటు అడ్వకేట్ జనరల్‌నూ పిలిపించి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అందులో ఏపీ సర్కార్ తీరుపై మండిపడ్డారు. న్యాయపోరాటానికి వెళ్లాలని నిర్ణయించారు.

పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచేలా ఏపీ కొత్త ప్రాజెక్ట్..!

కేసీఆర్ ఆగ్రహానికి కారణం… సంగమేశ్వరం నుంచి శ్రీశైలం కుడి ప్రధాన కాలువలోకి రోజుకు మూడు టీఎంసీలు మళ్లించేలా ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీవో జారీ చేయడమే. పోతిరెడ్డిపాడుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో సంగమేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసి శ్రీశైలం కుడి ప్రధాన కాలువలోకి పోయడం, పోతిరెడ్డిపాడు, బనకచెర్ల హెడ్‌రెగ్యులేటర్లను 80వేల క్యూసెక్కులు తీసుకెళ్లేలా పటిష్ఠం చేయడం తదితర పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 7వేల కోట్లతో ఫస్ట్ ఫేజ్ కింద పనులకు పరిపాలన అనుమతులు ఇచ్చారు.

కేసీఆర్ పట్టించుకోలేదంటూ తెలంగాణ విపక్షాల విమర్శలు..!

గతంలో పోతిరెడ్డి పాడు సామర్థ్యాన్ని పెంచుతామని ఏపీ సీఎం జగన్ ప్రకటన చేసినప్పుడే.. తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. పత్రికా ప్రకటన ఆధారంగా తాము ఏం చేయలేమని కృష్ణా బోర్డు చెప్పడంతో ఆ వివాదం అక్కడితో ఆగిపోయింది. తాజాగా ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో.. తెలంగాణలో కలకలం ప్రారంభమయింది. అయితే.. జీవో జారీ చేసి వారం దాటిపోయినా తెలంగాణ సర్కార్ పట్టించుకోలేదు. ఇతర రాజకీయ పార్టీల నేతలు విమర్శలు ప్రారంభించడంతో.. సర్కార్ అప్రమత్తమయింది. కేసీఆర్ ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ఏపీతో తాడో పేడో తేల్చుకోవాలని కేసీఆర్ నిర్ణయం..!

పోతిరెడ్డిపాడు గురించి గతంలో టీఆర్ఎస్ చేసిన ఉద్యమం గురించి అందరికీ తెలుసు. పోతిరెడ్డిపాడును పేల్చేస్తామన్నట్లుగా కేసీఆర్ ప్రకటనలు చేశారు. అయితే.. ఇప్పుడు అదే పోతిరెడ్డి పాడు నుంచి పెద్ద ఎత్తున నీరు తీసుకెళ్లేందుకు జగన్ ప్రయత్నిస్తున్నా.. నోరు మెదపడం లేదంటూ.. కాంగ్రెస్ నేతలు… తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రారంభించారు. కాంగ్రెస్ నేతలు ఉత్తర, దక్షిణ తెలంగాణ నినాదం తీసుకొచ్చారు. ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసే కాళేశ్వరంపై దృష్టి పెట్టి.. దక్షిణ తెలంగాణ వనరుల్ని మాత్రం కాపాడటం లేదంటున్నారు. జగన్ కు తెలంగాణ ప్రయోజనాలు అమ్మేశారని ఆరోపిస్తున్నారు. జగన్ సర్కార్ ఏర్పడిన మొదట్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి నీటి వివాదాలు పరిష్కరించుకునే ప్రయత్నం చేశారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉమ్మడి ప్రాజెక్ట్ కట్టాలనుకున్నాయి. కానీ ఏం జరిగిందో కానీ.. ఏపీ సీఎం తర్వాత రూటు మార్చారు. పోతిరెడ్డి పాడు వివాదం రాను రాను… రాజకీయ వివాదం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నిర్లక్ష్యమే ముంచింది…కాళేశ్వరంపై నిపుణుల మధ్యంతర నివేదిక

కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ డ్యాం సేఫ్టీ మధ్యంతర నివేదికను అందజేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలో ప్రభుత్వానికి సూచించింది.వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని...

పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్ – విప్లవమే !

ఐదేళ్ల పాలనలో తాను చాలా విప్లవాలు తెచ్చానని జగన్ రెడ్డి చెబుతూ ఉంటారు. విప్లవం అంటే ఆ రేంజ్ అనుకుంటున్నారో కానీ ఆయన కానీ ఆయన రచయితలు కానీ ఆ పదాన్ని...

యార్లగడ్డ లక్ష్మీ ప్రసాదూ కూటమికే ప్రచారం చేస్తారట !

జగన్ ఓటమి ఖాయమని తేలిపోయిందని అంచనాకు వచ్చిన భజన బ్యాచ్ లో కొంత మంది తమ పాత పరిచయాలను అడ్డం పెట్టుకుని బయటకు వచ్చి కూటమికి మద్దతు ప్రకటిస్తున్నారు. యార్లగడ్డ...

గ్రేటర్ లో వర్షం పడితే ఇంతేనా..!?

గ్రేటర్ హైదరాబాద్ లో మంగళవారం కురిసిన కుండపోత వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరదనీరుతో రోడ్లు, వీధులన్నీ నిండిపోయాయి. దాదాపు రెండు గంటలపాటు వర్షం దంచి కొట్టడంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close