హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తూండటంతో ఒకప్పుడు చాలా దూరం అనుకున్న ప్రాంతాలు ఇప్పుడు హాట్ స్పాట్లుగా మారుతున్నాయి. గజ్వేల్ కొన్నాళ్ల కిందటివరకూ గ్రామీణ ప్రాంతంగా ఉండేది. ఇప్పుడు ఈ ప్రాంతం హైదరాబాద్ పరిధిలో అత్యుత్తమ రియల్టీ హాట్స్పాట్లుగా మారుతోంది. ప్రభుత్వ ప్రాజెక్టులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, ఇండస్ట్రియల్ పార్కులు, పెట్టుబడిదారుల ఆసక్తి కారణంగా ఇక్కడ భూమి ధరలు గణనీయంగా పెరిగాయి.
రీజనల్ రింగ్ రోడ్ గజ్వేల్ రియాల్టీకి ఎక్కువ ప్లస్ గా మారుతోంది. హైదరాబాద్ నగరం నుంచి సుమారు 50 కి.మీ. దూరంలో గజ్వేల్ ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్ లో భాగంగా పెద్ద జంక్షన్ నిర్మాణం జరుగుతోంది. ఇది హైదరాబాద్, నాగ్‌పూర్, ముంబై, పూణే, నిజామాబాద్ వంటి నగరాలతో కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. ఈ రోడ్డు ప్రజ్ఞాపూర్ సమీపంలో పోతుండటంతో భూమి ధరలు బాగా పెరిగాయి. గజ్వెల్-కొడకండ్ల రూట్లో రైల్ లైన్ కూడా పరిశీలనలో ఉంది. గజ్వేల్, ప్రజ్ఞాపూర్ లలో ఇండస్ట్రీయల్ పార్కులు ఏర్పాటవుతున్నాయి. ఉపాధికోసం ఆయా ప్రాంతాలకు పెద్ద ఎత్తున జనం తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే వచ్చే ఐదేళ్లలో మరో వంద శాతం ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్ రియల్టీ మార్కెట్లో భూమి ధరలు ఎక్కువగా ఉండటంతో, పెట్టుబడిదారులు గ్రామీణ ప్రాంతాల వైపు మళ్లారు. గజ్వెల్లో భూమి ధరలు గత మూడేళ్లలో 200-300 శాతం పెరిగాయి, ఒక ఎకరానికి రూ. 2-5 కోట్లకు చేరాయి. ప్రజ్ఞాపూర్‌లో కూడా ఇదే పరిస్థితి ఉంది. గజ్వెల్ RRR జంక్షన్ సమీపంలోని గుండంపల్లి, సంగుపల్లి, కసారం, ప్రజ్ఞాపూర్ ప్రాంతాల్లో ఇప్పటికే రియల్ ఎస్టేట్ వెంచర్లు ఎక్కువయ్యాయి. DTC లేఅవుట్లో చదరపు గజంకు రూ. 15,000 నుంచి రూ. 28,000 వరకు చెబుతున్నారు. గజ్వెల్ చుట్టూ చదరపు గజంకు రూ. 16,000 నుంచి రూ. 30,000 వరకు పలుకుతోంది.