కర్ణాటక బీజేపీకి “గాలి” ప్లస్సా..? మైనస్సా..?

కర్ణాటకలో గాలి జనార్ధన్ రెడ్డికి ఇప్పుడు నాలుగు జిల్లాల్లో బీజేపీ గెలుపు బాధ్యతలు అప్పగించారు. ఆ నాలుగు జిల్లాల్లో గాలి జనార్ధన్ రెడ్డిపైనే కమలనాధులు ఆశలు పెట్టుకున్నారు. బాళ్లారి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒకప్పుడు గాలి సోదరులు ఆడిందే ఆట..పాడిందే పాట అన్నట్లుగా రాజకీయాలు నడిపారు. కానీ గాలి జనార్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో జైలుకు వెళ్లిన తర్వాత ఆయన ఇమేజ్ పూర్తిగా పడిపోయింది. బళ్లారి జిల్లాలోకి అడుగు పెట్టడానికి గాలి జనార్దన్ రెడ్డికి పర్మిషవ్ లేదు. కానీ ఆ చుట్టుపక్కల జిల్లాలకు వెళ్లవచ్చు. అందుకే బళ్లారి పొరుగు జిల్లాలో మకాం వేసి తన అనుచరవర్గంతో పాటు… బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం విస్త్రతంగా ప్రచారం చేస్తున్నారు.

మొదట్లో గాలి జనార్ధన్ రెడ్డిని పార్టీలోకి తీసుకుంటే అవినీతి మచ్చ పడుతుందని భయపడిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా… గాలి వర్గానికి తమ పార్టీకి ఏం సంబంధం లేదని ప్రకటించారు. కానీ రాజకీయ పరిస్థితులు చూసి.. టిక్కెట్ల కోసం పోటీ పడిన అభ్యర్థుల జాతకాలు చూసి.. అమిత్ షా, యడ్యూరప్ప చేతులెత్తేశారు. అదే సమయంలో.. గాలి జనార్ధన్ రెడ్డి ముందుకు వచ్చారు. తన అనుచరులకు టిక్కెట్లు ఇస్తే గెలిపించుకు వస్తానని అంతే కాక…ఇతర పార్టీ అభ్యర్థులకు కూడా ఆర్థికంగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దీంతో అమిత్ షా సరేననక తప్పలేదు. అమిత్ షా చెప్పినట్లు … గాలి జనార్ధన్ రెడ్డికి అధికారికంగా పార్టీ కండువా కప్పలేదు. కానీ… ఆయన కండువాతోనే బీజేపీ కి ప్రచారం చేస్తున్నారు. ఆయనతో కలిసి బీజేపీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప… స్టేజీ పంచుకుంటున్నారు. అంతే కాదు…గాలి జనార్ధన్ రెడ్డిని… క్షమిస్తారంటూ ప్రకటించి సంచలనం రేపారు. గాలిపై సీబీఐ కేసుల్ని కొట్టేయాలని.. ఆయనను క్షమించాలని.. మోదీతో మాట్లాడినట్లున్నారనే అని.. యడ్యూరప్పపై సిద్ధరామయ్య నేరుగా విమర్శలు చేస్తున్నారు.

తనకు పట్టు ఉన్న ప్రాంతంలో నిస్సహాయంగా ఉన్న బీజేపీనే.. గాలి జనార్ధన్ రెడ్డికి కొత్త ఉత్సాహం తెచ్చిపెట్టింది. అ అవకాశాన్ని అంది పుచ్చుకుని.. బీజేపీలోకి చొచ్చుకుపోయారు. ఇప్పుడు యడ్యూరప్ప కూడా గాలి జనార్ధన్ రెడ్డి చెప్పినట్లు చేస్తున్నారు. బాదామీలో సిద్ధరామయ్యను ఓడిస్తానని.. గాలి జనార్ధన్ రెడ్డి నమ్మకం కలిగించడంతో… గాలికి ఆప్తుడయిన శ్రీరాములును.. సిద్ధరామయ్యకు పోటీగా అక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. అంటే.. ఇప్పుడు కర్ణాటక మొత్తం కాకపోయినా… బళ్లారి ఆ చుట్టుపక్కల ఏరియాల్లో.. బీజేపీ రథసారథి గాలి జనార్ధనరెడ్డే. ఇది కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశంలా మారింది. రూ. 50 వేల కోట్ల కర్ణాటక సంపదను దోచుకున్న జనార్ధన్ రెడ్డి ని బీజేపీ ప్రొత్సహిస్తోందంటూ.. కర్ణాటక కాంగ్రెస్ దూకుడైన ప్రచారం చేస్తోంది. ఈ ఆరోపణల కారణంగా… ఎక్కడ గాలి జనార్ధన్ రెడ్డితో కలిసి వేదిక పంచుకోవాల్సి వస్తుందోనని అమిత్ షా.. బళ్లారి ఏరియాల్లో ప్రచారాన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు.

అతిశయోక్తులు చెప్పి రాజకీయ నేతలను బుట్టలో వేసుకోవడంలో గాలి జనార్ధన రెడ్డి దిట్ట. ఆ విషయం..బీజేపీ నేతలకు తెలియక కాదు. అసలు ఓడిపోవడం కన్నా.. ఒకటో రెండో సీట్లు తెచ్చుకోవడం బెటర్ అన్నట్లు… వారి గాలి జనార్ధన్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఈ ప్రభావం… కర్ణాటకలోని మిగతా ప్రాంతాలపై పడనుంది. బీజేపీ ఇమేజ్ పైనే మచ్చ తేనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close