టీడీపీ పొలిట్ బ్యూరో పదవికి గల్లా రాజీనామా..! అసంతృప్తేనా..?

తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యురాలి పదవికి గల్లా అరుణ కుమారి రాజీనామా చేశారు. లేఖను చంద్రబాబుకు పంపారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో సంస్థాగత ఎన్నికల సందడి నెలకొంది. పార్టీ పదవులను చంద్రబాబు భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా అధ్యక్షులను ప్రకటించారు. రాష్ట్రకమిటీని ప్రకటించడానికి ముహుర్తం సిద్ధం చేసుకున్నారు. రెండు రోజుల్లో అచ్చెన్నాయుడును రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించనున్నట్లుగా చెబుతున్నారు.

ఈ సమయంలో పొలిట్ బ్యూరో సభ్యత్వానికి గల్లా అరుణ కుమారి రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే….పార్టీలో అన్ని వ్యవస్థను ప్రక్షాళన చేసి.. యువతరానికి ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో… గల్లా అరుణకుమారికి ఈ సారి పొలిట్ బ్యూరోలో చోటు దక్కడం కష్టమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ముందుగానే గౌరవంగా ఆమె రాజీనామా చేసినట్లుగా చెబుతున్నారు. గల్లా అరుణకుమారి ప్రత్యక్ష రాజకీయాలకు కొంత కాలంగా దూరంగా ఉంటున్నారు.

2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆమె రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు. ఆమె కుమారుడు గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా రెండో సారి గెలిచారు. 2019ఎన్నికల్లో గల్లా అరుణకుమారి పోటీ చేయలేదు. పొలిట్ బ్యూరో సభ్యత్వం విషయంలో గల్లా రాజీనామా సాధారణ విషయమేనని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. గల్లా జయదేవ్ పార్టీలో కీలకంగా ఉంటున్నారు. ఆయన అమరావతి రైతుల కోసం శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నారు. తన వ్యాపార సంస్థలపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతున్నా వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో గల్లా అరుణ రాజీనామా వ్యక్తిగతమేనని టీడీపీ వర్గాలంటున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కళ్ల ముందు కనిపిస్తున్న ఇళ్లతో టీడీపీ రాజకీయం..!

పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలిస్తామంటూ హడావుడి చేసిన వైసీపీ సర్కార్... ఏడాదిన్నర గడిచిపోయినా ఆ దిశగా కనీసం అడుగులు వేయలేకపోయింది. ఆ పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న అభిప్రాయం...

క్రైమ్ : అత్త – అల్లుడు – వివాహేతర బంధం- హత్య..

సమాజంలో చిత్రమైన నేరాలు అప్పుడప్పుడూ వెలుగుచూస్తూ ఉంటాయి. అలాంటిది హైదరాబాద్‌లో ఒకటి బయటపడింది. ఓ నడి వయసు మహిళ.. ఓ యువకిడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తాను పెళ్లి చేసుకోలేదు కనుక.. కూతుర్ని...

యుద్ధం మొద‌ల‌వ్వ‌క‌ముందే.. తెల్ల‌జెండా ఊపేసిన ర‌జ‌నీ!

క‌రోనా ఎంత ప‌ని చేసిందో? క‌రోనా వ‌ల్ల సినిమా షూటింగులు ఆగిపోయాయి. సినిమా విడుద‌ల‌లూ ఆగిపోయాయి. ఆఖ‌రికి... ఓ సూప‌ర్ స్టార్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశానికీ బ్రేకులు ప‌డ్డాయి. ఆ స్టార్...

పెళ్లి సంద‌డి ‘క్లాసులు’ షురూ!

రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న చిత్రం `పెళ్లి సంద‌డి`. ఆనాటి పెళ్లి సంద‌డిలో శ్రీ‌కాంత్ హీరో అయిన‌ట్టే, ఇప్ప‌టి పెళ్లి సంద‌డిలో శ్రీ‌కాంత్ త‌న‌యుడ్ని హీరోగా ఎంచుకున్నారు. శ్రీ‌కాంత్ వార‌సుడు రోష‌న్‌కి ఇప్ప‌టికే...

HOT NEWS

[X] Close
[X] Close