గంటా కూడా కుమారుడికే వైసీపీ కండువా కప్పించబోతున్నారు..!

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమయింది. గతంలో చాలా సార్లు ముహుర్తం పెట్టుకున్నారు కానీ… వైసీపీ నేతల్ని బుజ్జగించడం ఆలస్యమయింది. వారం రోజుల్లోఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవనున్నట్లుగా చెబుతున్నారు. ఇతర టీడీపీ ఎమ్మెల్యేల్లాగా.. గంటా కూడా తన కుమారుడ్ని వైసీపీలో చేర్చి తాను మాత్రం అధికారికంగా కండువా కప్పుకోరు. గతంలోనే గంటా వైసీపీలో చేరుతారనే ప్రచారం జరిగింది కానీ.. అప్పట్లో ఆగిపోయింది.

కొంత మంది నేతలు గంటాకు వ్యతిరేకంగా హైకమాండ్ వద్ద లాబీయింగ్ చేయడంతో అప్పట్లో ఆగిపోయింది. అయితే అసెంబ్లీ సమావేశాల కంటే ముందే చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలన్న వ్యూహంతో వైసీపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట వాసుపల్లి గణేష్ కుమార్‌ని వైసీపీలో చేర్చుకున్నారు. దీంతో నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి దూరం అయినట్లు అయింది. గంటాతో కలిపి ఐదుగురు పార్టీ మారినట్లు అవుతుంది. టీడీపీకి పద్దెనిమిది ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారు.

వైసీపీ ఉత్తరాంద్ర ఇన్చార్జ్‌గా ఉన్న విజయసాయిరెడ్డి గతంలో గంటా సైకిళ్ల స్కామ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. త్వరలో గంటా అరెస్టవుతారని.. మంత్రి అవంతి శ్రీనివాస్ హెచ్చరించడం ప్రారంభించారు. అయితే.. అన్నింటినీ సర్దుబాటు చేసి.. గంటాను పార్టీలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. గంటాపై విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేకే రాజును వైసీపీ హైకమాండ్ పిలిచి మాట్లాడింది. గంటా పార్టీలోకి వచ్చినా రాజకీయ భవిష్యత్‌కు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close