నితిన్‌కి ‘చెక్’ పెట్టేశారు

నితిన్ – చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి కాంబినేష‌న్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ర‌కుల్‌, ప్రియా వారియ‌ర్ క‌థానాయిక‌లు. ఈ సినిమాకి `చెక్‌` అనే టైటిల్ పెట్ట‌నున్నార‌ని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పుడు అదే ఖాయం చేసేశారు. ఈ సినిమాకి `చెక్‌` అనే టైటిల్ నిర్ణ‌యిస్తూ.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు.

జైలు నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. అందుకు త‌గ్గ‌ట్టే ఫ‌స్ట్ లుక్ ఉంది. ఇందులో నితిన్ ఉరిశిక్ష ప‌డిన ఖైదీ గా న‌టిస్తున్నాడు. జైల్లోంచి త‌ప్పించుకోవ‌డానికి నితిన్ వేసే ఎత్తుల నేప‌థ్యంలో జ‌రిగే క‌థ ఇది. స్క్రీన్ ప్లే చ‌ద‌రంగం ఆట‌లా ర‌స‌వ‌త్త‌రంగా ఉండ‌బోతోంద‌ట‌. అందుకే ఈ టైటిల్ నిర్ణ‌యించారు. చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌లో ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాప్ ద‌ర్శ‌కుల వెంట ప‌డుతున్న మెగా అల్లుడు

`విజేత‌`తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు క‌ల్యాణ్ దేవ్‌. రెండో సినిమా `సూప‌ర్ మ‌చ్చీ`. ఇది సెట్‌లో ఉండ‌గానే.. రెండు మూడు సినిమాలు సెట్ చేసుకున్నాడు. ఇప్పుడు త‌న ఖాతాలో మ‌రో సినిమా...

ఇన్‌సైడ్ టాక్‌: ‘ఉప్పెన’ పాట ‘వెర్ష‌న్‌’ల గోల‌

ఓ పాట‌కు ఒక‌డ్రెండు వెర్ష‌న్లు రాయించుకోవ‌డం ఇది వ‌ర‌కు ఉండేది. ఒకే ట్యూన్ ఇద్ద‌రు ముగ్గురికి ఇచ్చి, ఎవరి అవుట్ పుట్ బాగుంటే.. వాళ్ల పాట ఓకే చేయ‌డం జ‌రిగేది. అయితే.. ఇప్పుడు...

ప్రభుత్వ పెద్దల సన్నిహితుల చానల్‌లో మంత్రి వ్యతిరేకత వార్తల అర్థమేంటి..?

తెలంగాణకు చెందిన ఓ మంత్రి రాసలీలలంటూ తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అధీనంలో ఉన్న న్యూస్ చానల్ హంగామా ప్రారంభించడం టీఆర్ఎస్‌లో కలకలం రేపుతోంది.కొద్దీ రోజులుగా ఆ...

కళ్ల ముందు కనిపిస్తున్న ఇళ్లతో టీడీపీ రాజకీయం..!

పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలిస్తామంటూ హడావుడి చేసిన వైసీపీ సర్కార్... ఏడాదిన్నర గడిచిపోయినా ఆ దిశగా కనీసం అడుగులు వేయలేకపోయింది. ఆ పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న అభిప్రాయం...

HOT NEWS

[X] Close
[X] Close