దర్యాప్తుపై స్టే సరికాదు..చట్టం తన పని తాను చేసుకోనివ్వాలి : సుప్రీంకోర్టు

చట్టం తన పని తాను చేసుకునేలా అవకాశం ఇవ్వాలని.. దర్యాప్తుపై స్టే విధించొద్దని అనేక సార్లు చెబుతూ వస్తున్నామని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన ఓ పిటిషన్‌ విచారణ సమయంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తుళ్లూరు తహసీల్దార్‌గా ఉన్నప్పుడు… అన్నే సుధీర్ బాబు అనే వ్యక్తి ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూములను బెదిరించి రిజిస్టర్ చేయించుకున్నారని ఏపీ సీఐడీ కేసు పెట్టింది. అయితే తాను విధినిర్వహణ మాత్రమే చేశానని అంతా చట్ట ప్రకారమే చేశానని.. ఎక్కడా అవకతవకలు కానీ.. చట్ట ఉల్లంఘనలు కానీ జరగలేదని అన్నే సుధీర్ బాబు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ విషయంలో విచారణ జరిపిన హైకోర్టు దర్యాప్తుపై స్టే ఇచ్చింది. భూముల అమ్మకాలు, కొనుగోళ్లే జరిగాయి కానీ.. బెదిరింపులకు పాల్పడినట్లుగా కానీ.. మరో వివాదం కానీ లేదని ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నే సుధీర్ బాబు వాదించారు. బెదిరింపులకు పాల్పడి కొనుగోలు చేశారన్నదానికి సీఐడీ ఎలాంటి ఆధారాలను సమర్పించలేదని కోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ స్టే ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. హైకోర్టు ఈ తరహా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. చట్టం తన పని తాను చేసుకునేలా అవకాశం ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

అయితే.. హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఒక వారంలో స్టే పై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు కు సూచించింది. వారంలో హైకోర్టు పరిష్కరించకపోతే పోతే మూడు వారాల్లో కేసును తామే పరిష్కరిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో తప్పుడు కేసులు పెడుతోందని.. ఇటీవలి కాలంలో అనేక మంది హైకోర్టులకు వెళ్తున్నారు. కొంత మందికి అనుకూలంగా హైకోర్టు తీర్పులిస్తోంది. దర్యాప్తుపై స్టే విధిస్తోంది.ఈ నేపధ్యంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నిమ్మగడ్డను కలిసిన సీఎస్..! రివర్స్ వాదన..?

స్థానిక ఎన్నికల నిర్వహణపై అభిప్రాయం చెప్పాలని.. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. పార్టీ పరంగా తన అభిప్రాయం చెప్పడానికి నిరాకరించిన వైసీపీ... అధికారికంగా మాత్రం సీఎస్...

రాజధాని రైతులకు బేడీలు వేసిన పోలీసులపై వేటు..!

ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి అమరావతికి భూములిచ్చిన ఎస్సీ, ఎస్టీ రైతులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి.. నిబంధనలకు విరుద్ధంగా బేడీలు వేసి.. జైలుకు తరలించిన ఘటనలో ఆరుగురు కానిస్టేబుళ్లను గుంటూరు ఎస్పీ విశాల్...

వైసీపీ వైపు సీపీఎం.. ఎన్నికల వైపు మిగతా పార్టీలు..!

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పార్టీల అభిప్రాయాలు సేకరించారు. అధికార పార్టీ వైసీపీ ఈ సమావేశానికి హాజరు కాలేదు. హాజరైన పార్టీల్లో ఒక్క...

రూ.2 కోట్లు డిమాండ్ చేసిన హీరోయిన్‌

క‌రోనా చిత్ర‌సీమ‌ని పూర్తిగా సంక్షోభంలో నెట్టేసింది. సినిమా రంగం కోలుకోవ‌డానికి చాలా కాలం ప‌డుతుంద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. నిర్మాత‌ల‌కు కాస్త ఉత్సాహాన్ని, ఊపిరిని ఇవ్వాలంటే తార‌లు పారితోషికం త‌గ్గించుకోవాల్సిందే అంటూ స‌ల‌హా...

HOT NEWS

[X] Close
[X] Close