గన్నవరం రివ్యూ : యార్లగడ్డ ముందు తేలిపోతున్న వంశీ !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. టీడీపీ కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రెండు సార్లు గెలిచారు. ఆయన వైసీపీలోకి పోవడంతో టీడీపీకి నాయకత్వం లేదనుకున్నారు. కానీ వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు చేరడంతో సీన్ మారిపోయింది. ఇప్పుడు వంశీకి గడ్డు పరిస్థితి ఏర్పడింది. యార్లగడ్డ దూకుడు ముందు వంశీ తేలిపోతున్నారు.

టీడీపీ హిట్ లిస్ట్ లో ఉన్న నియోజకవర్గాల్లో ఒకటి గన్నవరం

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కొన్ని హాట్ సీట్లలో గన్నవరం ఒకటి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ వైసీపీకి మారిపోయారు. ఆయన ప్రత్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరిపోయారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులే పోటీ చేస్తున్నారు. కానీ పార్టీలే మార్పు. వల్లభనేని వంశీకి వైసీపీలో పలు వర్గాలు వ్యతిరేకంగా ఉంటే… టీడీపీలో మాత్రం యార్లగడ్డ వెంకట్రావు వెనుక క్యాడర్ అంతా నిలిచారు. సామాజికవర్గ పరంగా టీడీపీకి అడ్వాంటేజ్ ఉంది. టీడీపీ ఓడిపోయిన తర్వాత వంశీ అనేక సవాళ్లు ఎదురవుతాయని తెలిసినా వైసీపీలో చేరిపోయారు. పార్టీలో తరచుగా విభేదాలు, వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు.. వంశీకి సహకరించడం లేదు. అయితే.. అధిష్టానం మాత్రం గన్నవరం బాధ్యతలు వంశీకే అప్పజెప్పింది. రాబోయే ఎన్నికల్లోనూ.. మళ్లీ ఆయన్నే పోటీకి దించాలనే ఆలోచనతో ఉంది. ఇప్పటికే.. నియోజకవర్గంలో నెలకొన్న విబేధాలకు సంబంధించి.. అనేకసార్లు పార్టీ పెద్దలు చర్చించారు. అయినా.. పరిష్కారం దొరకట్లేదు. చివరికి యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరిపోయారు.

వైసీపీలోనే ఉన్న దుట్టా వర్గం మద్దతు యార్లగడ్డకే !

ఇక్కడ బలంగా ఉన్న కమ్మ సామాజికవర్గం ఓటర్లు.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకి వ్యతిరేకంగా ఉన్నారు. చంద్రబాబు అండతో రాజకీయాల్లోకి వచ్చి ఆయన కుటుంబాన్ని దూషించడం మైనస్‌గా మారింది. సామాజికవర్గం మొత్తం వెలి వేసినట్లుగా వ్యవహరించడంతో తర్వాత ఆయన మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పారు. కానీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలోనే.. కమ్మ సామాజికవర్గమంతా.. దాదాపుగా వంశీకి వ్యతిరేకంగానే పనిచేస్తోంది. యార్లగడ్డ వెంకట్రావు సహజంగా దూకుడుగా ఉండే నేత. గత ఎన్నికల్లో మూడు వేల ఓట్ల స్వల్ప తేడాతోనే పరాజయం పాలయ్యారు. సామాజికవర్గ పరంగా వైసీపీకి దూరంగా ఉండే ప్రాంతంలోనూ ఆయన గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన టీడీపీ తరపున బరిలోకి దిగుతున్నారు. పార్టీలో చేరినప్పటి నుండి వంశీ టార్గెట్ గా రాజకీయాలు చేస్తున్నారు. దీంతో వంశీని వ్యతిరేకించే వారంతా.. యార్లగడ్డ వెంట చేరిపోయారు. వంశీకి వైసీపీలోనే మద్దతు లేదు. టీడీపీలో ఉన్నప్పుడు కేసులు పెట్టి వేధించారని.. వైసీపీలో చేరిన తర్వాత కూడా తన అనుచరులకే ప్రాధాన్యం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. వారంతా వంశీకి వ్యతిరేకంగా యార్లగడ్డకు మద్దతుగా పని చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

1989 తర్వాత గెలవని టీడీపీయేతర అభ్యర్థులు

1955లో గన్నవరం నియోజకవర్గం ఏర్పడింది. పుచ్చలపల్లి సుందరయ్య, కాకాని వెంకటరత్నం లాంటి దిగ్గజాలు ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిథ్యం వహించారు. పుచ్చలపల్లి సుందరయ్య.. 3 సార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత.. కాంగ్రెస్ అభ్యర్థులు 4 సార్లు గెలిచారు. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత.. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలకు చెక్ పెడుతూ.. టీడీపీ హవా కొనసాగింది. గన్నవరం అంటే.. పసుపు పార్టీకి కంచుకోట అనే ముద్ర పడిపోయింది. 1989లో చివరిసారి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. ఆ తర్వాత రెండు సార్లు ఇండిపెండెంట్లు విజయం సాధించారు. 2009 నుంచి గన్నవరంలో వరుసగా 3 సార్లు విజయం సాధించింది టీడీపీ. గన్నవరం పరిధిలో నాలుగు మండలాలున్నాయి. అవి.. ఉంగుటూరు, గన్నవరం, బాపులపాడు. వీటితో పాటు విజయవాడ రూరల్ మండలంలోని 9 గ్రామాలు.. గన్నవరం నియోజకవర్గం పరిధిలోకే వస్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close