రిలీజ్ రోజున షాకిచ్చిన‌ శివ‌కార్తికేయ‌న్ సినిమా

ఈరోజు రిప‌బ్లిక్ డే. సెల‌వుదినం. కొత్త సినిమాల‌కు మంచి ఛాన్స్‌. అందుకే రెండు డ‌బ్బింగ్ సినిమాలు బాక్సాఫీసు ముందు క్యూ క‌ట్టాయి. అందులో కెప్టెన్ మిల్ల‌ర్ ఒక‌టి. మ‌రోటి.. శివ‌కార్తికేయ‌న్ న‌టించిన అయ‌లాన్‌. సైన్స్ ఫిక్ష‌న్ జోన‌ర్‌లో త‌యారైన ఈ సినిమా గ‌త‌వారంలోనే త‌మిళ‌నాట విడుద‌లైంది. ఈరోజు.. టాలీవుడ్ లోకి అడుగుపెట్టాలి. అయితే.. అనివార్య కార‌ణాల‌తో అయ‌లాన్ షోస్ అన్నీ ర‌ద్ద‌వుతున్నాయి. ఉద‌యం 10 గంట‌ల ఆట‌ల‌కు టికెట్లు అమ్మిన త‌ర‌వాత థియేట‌ర్ యాజ‌మాన్యం `సారీ` చెప్పి, డ‌బ్బులు వాప‌స్ చేసింది. మార్నింగ్ షో, మాట్నీ ఆట‌లూ ర‌ద్దవుతున్నాయి. శివ‌కార్తికేయ‌న్ సినిమా ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో విడుద‌ల‌కు బ్రేక్ ప‌డింద‌ని, అందుకే షోలు ర‌ద్దువుతున్నాయ‌ని తెలుస్తోంది. వీలైనంత త్వ‌ర‌గా ఈ స‌మ‌స్య‌ని క్లియ‌ర్ చేసుకొని, రిలీజ్ కి క్లియ‌రెన్స్ తెచ్చుకోవాల‌ని తెలుగు నిర్మాత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. రిప‌బ్లిక్ డే సెల‌వుని క్యాష్ చేసుకోవాల‌న్న అల‌యాన్ ప్ర‌య‌త్నం బెడ‌సికొట్టింది. ఇదే రోజు విడుద‌ల అవుతున్న కెప్టెన్ మిల్ల‌ర్‌కు ఇది ప్ల‌స్ కానుంది. ధ‌నుష్‌కి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. పోటీకి రావాల్సిన సినిమా ఆగిపోయింది. దాంతో ధ‌నుష్ సినిమానే ఏకైక ఆప్ష‌న్ గా మిగిలింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జనసైనికుల్ని రెచ్చగొట్టేందుకు వైసీపీ దింపుడు కళ్లెం ఆశలు !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం పూర్తయింది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఏ సీట్లలో పోటీ చేయాలో కూడా ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే పవన్ 24 సీట్లే తీసుకున్నారంటూ.....

విచారణకు రాను – సీబీఐకి కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు తాను హాజరు కావడం లేదని సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి...

మళ్లీ ఉద్యోగుల పోరాటం ప్రభుత్వానికి తాకట్టు !

ఎన్నికలకు ముందు ఉద్యోగ నేతలు ఆందోళనలు అంటూ హడావుడి చేశారు. కానీ అదంతా స్క్రిప్టెడ్ అని.. ఏమీ చేయకపోయినా ఏదో ఇచ్చినట్లుగా హడావుడి చేయడానికని మొదటి నుంచి అనుమానాలుననాయి. ఇప్పుడు అదే నిజం...

అభిప్రాయం : జనసేన శ్రేణుల అంతర్మధనం

2024 ఎన్నికల రాజకీయ వేడి రాజకుంది. తెలుగు దేశం పార్టీజనసేన కలిసి ఏర్పాటు చేసుకున్న పొత్తు లో భాగం గా జనసేన 24 ఎమ్మెల్యే సీట్ల లో పోటీ చేస్తుందని చంద్రబాబు -పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close