భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు… వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా… దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే… విశాఖ జిల్లాలో రిజర్వుడు నియోజకవర్గాల్లో తప్ప.. మిగతా నాయకుల అందరి గుండెల్లో ‘గంటా’ అనే రైలు పరిగెడుతూ ఉంటుంది. అలాగే ప్రజల్లో కూడా ఆసక్తి నెలకొంటూ ఉంటుంది… ఈ ‘గంటా శ్రీనివాసరావు’ ఏ నియోజక వర్గంలో పోటీ చేస్తారా అని!

ఈసారి గంటా శ్రీనివాసరావు విశాఖ జిల్లాలోనే ఎంతో ప్రత్యేకమైన భీమిలి లో పోటీ చేస్తున్నారు. అది కూడా తన దగ్గరే రాజకీయం నేర్చుకుని, నాయకుడిగా ఎదిగి, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ముత్తంశెట్టి (అలియాస్) అవంతి శ్రీనివాసరావు మీద. ఒకప్పుడు ఒకే పార్టీలో ఉన్న వీరిద్దరూ ఇప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉండటం… ప్రత్యర్ధులుగా నిలవడం గమనార్హం. దీంతో ఇద్దరూ తమ వ్యూహ-ప్రతి వ్యూహాలకు పదునుపెడుతున్నారు.

ఇటు గంటా – అటు అవంతి ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం ఒకెత్తు అయితే… ఇద్దరూ భీమిలిలో గతంలో గెలుపొందినవారే కావడం… మరో ఎత్తు. ఇద్దరి పేర్లలోనూ శ్రీనివాసరావు ఉండటం మరో సారుప్యత. ఇక్కడ సీనియర్ అయిన గంటాకు, తన శిష్యుడయిన అవంతి యొక్క బలం, బలహీనతలు పూర్తిగా తెలుసు. దీంతో NDA తరపున భీమిలి టికెట్ ను తనకు ప్రకటించిన మరుక్షణం నుంచే ‘గంటా మార్క్’ రాజకీయం చేయడం ప్రారంభించారు. వైసీపీ లోని ముఖ్య నాయకులను సామ దాన భేద దండోపాయాలతో తనవైపు గంటా తిప్పుకున్నారని పలువురు పేర్కొంటున్నారు. భీమిలీలో వైఎస్సార్ సిపీకి చెందిన పలువురు నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ముఖ్యంగా విశాఖ జిల్లా పశుగణాభివృద్ది సంఘం చైర్మన్, భీమిలి మండల YCP జెడ్పీటీసీ నాయకుడు గాడు వెంకటప్పడు తన అనుచరులతో కలిసి ఆ పార్టీకి రాజీనామా చేసి, గంటా సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజక వర్గం నుంచి గెలుపొందిన గంటా… భీమిలికి వచ్చీ రావడంతోనే పెద్ద విక్కేట్ ని పట్టేయడంతో YCP శ్రేణులు డీలా పడిపోయాయి. ఇంకా పలువురు గ్రామ సర్పంచులు… గంటాకు మద్దతు ఇస్తుండటం YCPకి పెద్ద దెబ్బగా మారుతోంది.

2014లో భీమిలి నియోజక వర్గం నుంచే గెలిచిన గంటా… మంత్రి గా పనిచేశారు. అప్పటి పరిచయాలు ఇప్పుడు ఆయనకు బాగా కలిసి వస్తున్నాయని, దాంతోనే నియోజకవర్గంలో నాయకులూ, కార్యకర్తలు తిరిగి గంటా గూటికి చేరుతున్నారని TDP శ్రేణులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో… సాధారణంగానే TDPకి కంచుకోట అయిన భీమిలిలో గెలుపు అవకాశాలు ఈసారి గంటాకే ఎక్కువగా ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

LRS అమలుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊపు !

తెలంగాణలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లియర్‌ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close