ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి… ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ… ఈ మూడుజిల్లాలు… నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా… రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపడుతుందో నిర్ణయించే శక్తి ఈ మూడు జిల్లాలదే అంటే ఆశ్చర్య పోనవసరం లేదు…..

సెంటిమెంట్ అనుకున్నా… కో-ఇన్సిడెన్స్ అనుకున్నా… ఈ ఉత్తరాంధ్రలో మెజారిటీ సీట్లు గెలిచిన వాళ్ళే రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం జరుగుతూ వస్తోంది.

ఇంక రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ 24 స్థానాలను కైవసం చేసుకుంది… అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా గెలుపొందారు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో 28 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది.. జగన్ ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఉత్తరాంధ్ర గాలి ఎటు వీస్తుంది అనేది కీలకంగా మారింది.

ప్రతిసారి ఉత్తరాంధ్ర ప్రజల తీర్పు చాలా విలక్షణంగా ఉంటుంది. ఇక్కడ మూడు జిల్లాలు పక్కపక్కనే ఉన్నా… ఒక్కో జిల్లాలో ఉన్న లోకల్ పరిస్థితులు ఒక్కోలా ఉంటాయి.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది స్థానాలు ఉండగా ‘కింజరాపు’ కుటుంబ సభ్యుల ప్రభావం బలంగా ఉంటుంది. దివంగత నేత ఎర్రన్నాయుడి సోదరుడైన అచ్చెన్నాయుడు తెదేపా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా ఉండటం, బీసీ నాయకుడిని పార్టీ గుర్తించి ఉన్నతమైన పదవిని ఇవ్వడంతో ఈ జిల్లాలో ఎక్కువగా ఉన్న బీసీ శ్రేణులు టీడీపీకి సపోర్టుగా ఉన్నారు.. అలాగే పార్లమెంటులో రామ్మోహన్ నాయుడు గొంతు బలంగా వినిపించడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. వీరిద్దరి ప్రభావంతో ఈసారి ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో తెదేపా-జనసేన-బీజేపీ కూటమి మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి.

అలాగే విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలు ఉండగా… ఇక్కడ రాజకీయం ఎప్పుడూ రాజుల చుట్టూనే తిరుగుతుంది. విజయనగరం , బొబ్బిలి రాజుల మధ్య గతంలో శతృత్వం ఉన్నా… ఇప్పుడు ఇరువురూ తెలుగుదేశం పార్టీ గూటికే చేరారు. దీంతో TDP బలం పుంజుకుంది. అయితే ఈ జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం ప్రభావం కూడా ఉంటుంది. విజయనగరంలో 9 స్థానాలు ఉండగా… ఇరు పార్టీల సభ్యుల మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి.

ఇక ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో సిటీ, రూరల్ కలిపి మొత్తం 15 ఎమ్మెల్యే స్థానాలు ఉండగా.. ఇక్కడ కుటుంబ రాజకీయాలు లేకపోయినా… వలస వచ్చిన రాజకీయ నాయకుల హంగామా ఉంటుంది. సిటీలో జనాభా కూడా చాలా వరకూ వలస వచ్చిన వారే కావడంతో… విశాఖలో స్థానిక నాయకుల ప్రభావం కంటే రాష్ట్ర రాజకీయాల ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో అభివృద్ధి గత అయిదేళ్ళలో కుంటుపడటం… తీరాన్ని ఆనుకొని సిటీగా రక్షణగా ఉండే రుషికొండపై తవ్వకాలు చేయడం… వంటివి అధికార పార్టీకి కీడు చేసే ఘటనలుగా ప్రజలు చెప్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఈ జిల్లాలో 10 స్థానాలకు పైగా తెదేపా-జనసేన-బీజేపీ కూటమి ఎగరేసుకుపోతుందని సర్వేలు చెబుతున్నాయి.

ఇలా ఎలా చూసినా… ఉత్తరాంధ్రలో 2014లోని రిజల్ట్ మళ్ళీ 2024లో పునరావృతం అవుతుందని స్పష్టంగా తెలుస్తోంది… 34 అసెంబ్లీ స్థానాల్లో TDP – జనసేన – బీజేపీ కూటమి కనీసం 25 స్థానాలు గెలుస్తుందని, వైకాపా 10స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని సర్వేల్లో తేలింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close