గౌతమ్ ఇప్పుడప్పుడే చైతుని వదిలేలా లేడు..

‘ఏ మాయ చేసావే’ సినిమాతో స్లో నేరేషన్ ఉన్నా సరే సినిమా హిట్ కొట్టొచ్చు అని చెప్పిన దర్శకుడు గౌతమ్ మీనన్. ఆ సినిమాతోనే నాగ చైతన్యకు మొదటి సూపర్ హిట్ అందించాడు కూడా ఈ డైరక్టర్. ఏ మాయ చేసావే సినిమాతోనే చైతుకి లవర్ బోయ్ ఇమేజ్ వచ్చింది. అయితే ఆ ఇమేజ్ నుండి మనోడు ఎంత ప్రయత్నించి మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నా బయట పడట్లేదు. ఇక చేసేదేమీ లేక మళ్లీ అదే గౌతమ్ మీనన్ తో అలాంటి ఫీల్ ఉన్న సినిమానే ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా తో వచ్చేందుకు సిద్ధమయ్యాడు.

సినిమా కూడా దాదాపు షూటింగ్ కంప్లీట్ అయ్యి రిలీజ్ కు రెడీ అవుతుంది. సినిమా మళ్లోసారి ఏ మాయ చేసావేలోని చైతుని గుర్తు చేస్తుందనడంలో సందేహం లేదు. రిలీజ్ చేసిన ట్రైలర్స్ అలానే అనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా అయ్యాక గౌతమ్ మీనన్ మెగా పవర్ స్టార్ సినిమా ఉంటుందని అన్నారు. కాని చరణ్ తని ఒరువన్ తెలుగు రీమేక్ బిజీలో ఉన్నాడు కాబట్టి.. మళ్లీ నాగచైతన్యతోనే మరో లవ్ స్టోరీని తీసేందుకు సిద్ధమయ్యాడట గౌతమ్ మీనన్.

తెలుగులో చైతన్య, తమిళ్ లో శింభు, కన్నడలో పుణీత్ రాజ్ కుమార్, మలయాళంలో ఓ హీరో ఇలా నాలుగు సౌత్ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడట గౌతమ్. ఒకేసారి నాలుగు భాషల్లో తీయడం అంటే అది గొప్ప విషయమే అని చెప్పాలి. మరి క్రేజీ ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరనేది ఇంకొద్దిరోజుల్లో తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోహ‌న్‌బాబు ‘స‌న్ ఆఫ్ ఇండియా’

ఫాద‌ర్ ఆఫ్ ది నేష‌న్ అని... మ‌హాత్మాగాంధీని పిలుస్తారు. ఇక నుంచి టాలీవుడ్ మాత్రం `స‌న్ ఆఫ్ ఇండియా` అంటే.. మోహ‌న్ బాబుని గుర్తు చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ పేరుతో ఇప్పుడు...

వీడు మామూలోడు కాదు..! ఏకంగా లంచం కోటి..!

అవినీతిని అరికట్టేందుకు రూ. 2వేల నోట్లను కేంద్రం నియంత్రించేసింది కానీ.. అదేమీ ఈ తరహా సంపాదనకు అలవాటు పడిన వారికి అడ్డం కాలేదు. రూ. 2వేల నోట్లు కాకపోతే.. రూ. ఐదు వందల...

షాకింగ్ : హైకోర్టు జడ్జిల ఫోన్ల ట్యాపింగ్..!?

ఆంధ్రప్రదేశ్‌లో అవాంఛనీయమైన పరిణామాలు రోజు రోజుకు వెలుగు చూస్తున్నాయి. అక్కడ న్యాయవ్యవస్థ విశ్వసనీయతపై దెబ్బ కొట్టేందుకు భారీ కుట్రలు జరుగుతున్నాయని మాజీ న్యాయమూర్తి ఈశ్వరయ్య ఫోన్ సంభాషణతో వెల్లడయింది. తాజాగా ఇప్పుడు.. న్యాయమూర్తుల...

విశాఖలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కాదు ఓటు బ్యాంకుకు ఇళ్ల స్థలాలు..!

ఆంధ్రప్రదేశ్‌కు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నంను చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న ప్రభుత్వం... దానికి తగ్గట్లుగా "లుక్" ఉండే ప్రాజెక్టులన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి రద్దు చేసుకుంటూ పోతోంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను క్యాన్సిల్ చేస్తోంది. ఓ...

HOT NEWS

[X] Close
[X] Close