రామ్‌చ‌ర‌ణ్‌తో గౌత‌మ్ తిన్న‌నూరి?

జెర్సీ సినిమాతో ప్రేక్ష‌కుల హృద‌యాల‌తో పాటు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని కూడా గెలుచుకున్నాడు గౌత‌మ్ తిన్న‌నూరి. అంత‌కు ముందు ‘మ‌ళ్లీ రావా’ అనే ఓ మంచి సినిమాతో.. త‌న జ‌ర్నీ మొద‌లెట్టిన గౌత‌మ్ – జెర్సీతో ‘మోస్ట్ వాంటెడ్‌’ జాబితాలో చేరిపోయిన‌ట్టైంది. రెండో సినిమాకే ‘జెర్సీ’లాంటి క‌థ‌ని డీల్ చేయ‌డం మామూలు విష‌యం కాదు. అందుకే… ‘జెర్సీ’ విజ‌యంలో ద‌ర్శ‌కుడిగా త‌న వాటానే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఇప్పుడు త‌న‌కు ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి.

తన మూడో సినిమా ఎన్వీ ప్ర‌సాద్ బ్యాన‌ర్‌లో ఫిక్స‌యిపోయింది. హీరో ఎవ‌ర‌న్న‌ది తేలాల్సివుంది. ఆ అవ‌కాశాలు రామ్‌చ‌ర‌ణ్ కే ఎక్కువ ఉన్నాయ‌ని తెలుస్తోంది. గౌత‌మ్ ద‌గ్గ‌ర ఓ పిరియాడిక‌ల్ స్టోరీ ఉంది. దాన్ని చ‌ర‌ణ్‌కి చెప్పాల‌ని భావిస్తున్నాడ‌ట‌. చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’తో బిజీగాఉన్నాడు. ఆ సినిమా పూర్త‌య్యే వ‌ర‌కూ మ‌రో క‌థ‌పై దృష్టి పెట్ట‌లేడు. కాక‌పోతే.. క‌థ విని ఓకే అనుకుంటే – ఓ పనైపోతుంది. కాలి గాయం వ‌ల్ల ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ షూటింగ్‌కి చ‌ర‌ణ్ బ్రేక్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ బ్రేక్‌లో గౌత‌మ్ క‌థ వినే ఛాన్సుంది. పైగా.. గౌత‌మ్ ఇప్పుడు ఏ హీరోకైనా క‌థ చెప్ప‌గ‌లిగే స్థాయికి తెచ్చుకోగ‌లిగాడు. చ‌ర‌ణ్‌తో మీటింగ్ అయిపోతే.. ఈ ప్రాజెక్టుపై ఓ క్లారిటీ వ‌స్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com