గ్రేటర్‌ ఫలితాలు వెల్లడయ్యేది సాయంత్రమే!

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల కౌంటింగ్‌ శుక్రవారం జరగాల్సి ఉండగా.. మధ్యాహ్నంలోగా అన్ని ఫలితాలు వచ్చేస్తాయని తొలుత అందరూ అనుకున్నారు. మేయర్‌ పీఠం ఎవరి వశం అవుతుందో.. సమస్తం క్లారిటీ వచ్చేస్తుందని భావించారు. అయితే మజ్లిస్‌ అరాచక దాడులు, మారిన పరిణామాల నేపథ్యంలో సాయంత్రం అయితే తప్ప.. ఫలితాలు వెల్లడయ్యే అవకాశం కనిపించడం లేదు. మజ్లిస్‌ దాడుల పుణ్యమాని పాతబస్తీలోని పురానాపూల్‌ డివిజన్‌ పరిధిలో ఎన్నికల సంఘం రీపోలింగ్‌కు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ రీపోలింగ్‌ శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అది అయిన తర్వాతే కౌంటింగ్‌ ప్రారంభించాలని తాజాగా నిర్ణయించారు.

నిజానికి పాతబస్తీ అల్లర్లు పోలింగ్‌నాడేచోటు చేసుకున్న నేపథ్యంలో.. ఎన్నికల సంఘం సత్వరం స్పందించి.. అదే రోజున లేదా బుధవారం నిర్ణయం తీసుకుని ఉంటే గురువారమే రీపోలింగ్‌ సాధ్యం అయ్యేది. అయితే ఎన్నికల సంఘం ఈ విషయంలో మీనమేషాలు లెక్కించింది. జరిగిన అల్లర్లు ఎంత బాహాటంగా జరిగినప్పటికీ.. వారు నిర్ణయం తీసుకోలేకపోయారు. చివరికి జనం అందరూ చూసిన గొడవల తర్వాత తాము స్పందించకుంటే బాగుండదనుకున్నారో ఏమో.. ఒకే డివిజన్లో శుక్రవారం రీపోలింగ్‌కు ఆదేశించారు. అయితే అదేరోజున కౌంటింగ్‌ ఉన్నందున ఒకవైపు కౌంటింగ్‌లో ఫలితాలు వెల్లడైపోతూ ఉంటే.. అది ఓటింగ్‌ సరళి మీద ప్రభావం చూపిస్తుంది కదా అనే అనుమానం పలువురికి కలిగింది.

ఆ నేపథ్యంలోనే కౌంటింగ్‌ సమయంలో మార్పులు చేశారు. సాయంత్రం 5 గంటలవరకు పురానాపూల్‌ ఓటింగ్‌ జరగనున్నందున సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియను ప్రారంభించాలని తాజాగా నిర్ణయించారు. దీనివలన 5 గంటల తర్వాత మాత్రమే ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

RRR రికార్డ్ బ్రేక్ చేసిన ‘పుష్ష 2’

'పుష్ష 2' రికార్డుల వేట మొద‌లైంది. మొన్న‌టికి మొన్న 'పుష్ష 2' హిందీ డీల్ క్లోజ్ అయ్యింది. దాదాపు రూ.200 కోట్లు హిందీ రైట్స్ రూపంలో వ‌చ్చాయి. ఆడియో రైట్స్ విష‌యంలోనూ పుష్ష...
video

‘మిరాయ్‌’… 20 రోజుల్లోనే ఇంత తీశారా?

https://www.youtube.com/watch?v=xnubQ829q0c తేజ స‌జ్జా, కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి 'మిరాయ్‌' అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు అదే...

కోమ‌టిరెడ్డిలో మ‌రో కోణం… కొడుకు పేరుతో సేవ!

నిత్యం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు... వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. హ‌డావిడి. వైఎస్ హాయం నుండి వేగంగా ఎదిగిన మంత్రి కోమటిరెడ్డి, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ నేనున్నా అని అండ‌గా ఉంటారు. ముఖ్యంగా కోమ‌టిరెడ్డి కుమార్...

పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నేత..?

తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలపై కన్నేసిన బీజేపీ ప్రచారంలో వెనకబడిన అభ్యర్థులను మార్చాలని నిర్ణయం తీసుకోనుందా..? సర్వేలతో ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకుంటున్న జాతీయ నాయకత్వం పెద్దపల్లి లోక్ సభ అభ్యర్థిని మార్చనుందా..?...

HOT NEWS

css.php
[X] Close
[X] Close