” గ్రేటర్‌ మేయర్‌”కు అమావాస్య టెన్షన్..!

హైదరాబాద్ మేయర్ ఎన్నికకు ఖరారు చేసిన ముహుర్తం వివాదాస్పదం అవుతోంది. ఎన్నికలు ముగిసి రెండు నెలలు అవుతున్నా… రెండు రోజుల కిందట వరకూ.. తాము కార్పొరేటర్లమని గెలిచిన వాళ్లు చెప్పుకోలేకపోయారు. ఓ బీజేపీ కార్పొరేటర్ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయకుండానే చనిపోయారు కూడా. దానికి కారణం పాత పాలక వర్గానికి ఇంకా గడువు ఉండటమే. ఫిబ్రవరి పదకొండో తేదీతో పాలకవర్గం గడువు ముగుస్తుంది. అప్పటి వరకూ ఆ పాలక వర్గాన్నే కొనసాగించి అదే రోజు.. కొత్త మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపికను చేపడుతున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.

అయితే ఫిబ్రవరి పదకొండో తేదీన అమావాస్య వచ్చింది. దీంతో కొంత మంది కార్పొరేటర్ అభ్యర్థులకు చిక్కులు ప్రారంభమయ్యాయి. ముహుర్తాలను నమ్మే కార్పొరేటర్లు… అమావాస్య రోజు ప్రమాణం చేయడానికి సిద్ధంగా లేరు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ఈ అంశంపై మండిపడుతున్నారు. ఆ రోజు మంచి రోజు కాదన్న ఉద్దేశంతో బీజేపీ కార్పొరేటర్లు కొంత మంది అయినా డుమ్మా కొడతారని…ఆ కోణంలో మేయర్ సీటును కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని బీజేపీ అనుమానిస్తోంది. అందుకే బీజేపీ నేతలు… ముహుర్తాన్ని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రేటర్ కమిషనర్‌ను కూడా కలిశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. తన చేతుల్లో ఏమీ లేదని.. ఎన్నికల కమిషనరే నిర్ణయం తీసుకున్నారని తేల్చేశారు.

దాంతో ఇప్పుడు బీజేపీ నేతలు అమావాస్య రోజున ప్రమాణం చేయాలా.. లేక మొత్తంగా డుమ్మా కొట్టాలా అన్న ఆలోచనలో ఉంది. అభిప్రాయసేకరణ చేస్తోంది. పదకొండో తేదీన కోరం లేకపోతే.. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడుతుంది. ఒక్క బీజేపీ కార్పొరేటర్లు మాత్రమే హాజరు కాకపోతే.. కోరం సమస్య రాదు. ఇతర పార్టీల కార్పొరేటర్లు కూడా అలాగే ఫీలవ్వాలి. అది కష్టమే. ఒక వేళ కోరం సమస్య వస్తే.. మరో తేదీన నిర్వహిస్తారు. రెండో సారి సమావేశం అవ్వాల్సి వస్తే .. కోరం ఉన్నా లేకపోయినా మేయర్ ఎన్నిక జరుగుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉమెన్స్ డే రోజూ అమరావతి మహిళా రైతులకు దెబ్బలే..!

మహిళా దినోత్సవం రోజునా అమరావతి మహిళా రైతులకు ఎలాంటి గౌరవం లభించలేదు సరి కదా.. పోలీసులు చేతిలో దెబ్బలు తినాల్సి వచ్చింది. ఓ వైపు మహిళలకు అండగా నిలబడతామని పెద్ద పెద్ద ప్రకటనలు...

తొలి 10 నిమిషాలు ముందే చూపించేస్తార్ట‌!

మంచు విష్ణు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం మోస‌గాళ్లు. ఇదో వైట్ కాల‌ర్ మోసం చుట్టూ తిరిగే క‌థ‌. టెక్నాల‌జీని వాడుకుంటూ... మోస‌గాళ్లు ఎలా రెచ్చిపోతున్నారో చెప్పే క‌థ‌. ట్రైల‌ర్ ఇటీవ‌లే విడుద‌లైంది. కాజ‌ల్,...

బాల‌య్య రైట్ హ్యాండ్‌.. జ‌గ్గూ భాయ్‌

లెజెండ్‌తో.. జ‌గ‌ప‌తిబాబులోని విల‌న్ విశ్వరూపం చూపించాడు. ఆ సినిమాతో జ‌గ‌పతి బాబు కెరీర్ ట‌ర్న్ అయిపోయింది. హీరోగా ఎంత సంపాదించాడో తెలీదు గానీ, విల‌న్ గా మారాక మాత్రం జ‌గ‌ప‌తి ఆస్తులు పెరిగాయి....
video

మ‌హిళా శ‌క్తి @ విరాట ప‌ర్వం

https://www.youtube.com/watch?v=dQ9S_uy-5sM విరాట‌ప‌ర్వం... ఈ సినిమా పేరు చెప్ప‌గానే ఓ ప్రేమ‌క‌థో, ఓ విప్ల‌వ గాథో, ఓ అభ్యుద‌య చిత్ర‌మో, ఓ సామాజిక స్పృహ ఉన్న ప్ర‌య‌త్న‌మో... అనిపిస్తోంది. పోస్ట‌ర్లూ అలానే ఉన్నాయి. అయితే.....

HOT NEWS

[X] Close
[X] Close