కొత్త సచివాలయం ఆరు నెలల్లో కాదు ఏడాదిలో..!

ఏడాది కంటే ఒక్క రంటే.. ఒక్క రోజు ఎక్కువ సమయం ఇవ్వబోమని ఆ లోపు కట్టేయాల్సిందేనని కొత్త సచివాలయం విషయంలో వర్క్ ఏజెన్సీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రిపబ్లిక్ డే రోజు ముందస్తు షెడ్యూల్‌లో లేకపోయినా ఆయన సచివాలయం పనులు పరిశీలించడానికి వెళ్లారు. అయితే అక్కడ జరుగుతున్నది చూసిన కేసీఆర్ తాను అనుకున్నది వేరు… జరుగుతున్నది వేరని అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద నిర్మాణయంత్రాలతో.. చురుగ్గా పనులు సాగుతాయని ఆయన ఆశించినట్లుగా ఉన్నారు కానీ.. ఇంకా అక్కడ పునాదులు కూడా పూర్తి కాలేదు. చాలా పునాదులు ఇంకా తవ్వేదశలోనే ఉన్నారు. కింద రాళ్లు ఉన్నాయని అందుకే ఆలస్యం అవుతోందని నిర్మాణ సంస్థల ప్రతినిధులు వివరణ ఇచ్చారు. ఏం చెప్పినా సరే ఏడాదికి మించి సమయం ఇవ్వబోమని.. ఆ లోపు కట్టాల్సిందేనని కేసీఆర్ తేల్చి చెప్పారు.

తెలంగాణకు కొత్త సచివాలయం కట్టాలని సీఎం కేసీఆర్ మొదటి సారి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి కలలు కంటున్నారు. చాలా సార్లు శంకుస్థాపన వరకూ వెళ్లింది. కానీ సాధ్యం కాలేదు. ఓ సారి ఎర్రగడ్డ అన్నారు..మరోసారి బైసన్ పోలో గ్రౌండ్స్ అన్నారు. దాదాపుగా అన్ని ప్రయత్నాలూ చేశారు. చివరికి ఎక్కడా కుదరలేదు. కానీ ఎన్నికల ఫలితాలు కలసి రావడంతో ఏపీకి కేటాయించిన భవనాలన్నింటినీ స్వాధీనం చేసుకుని… కూలగొట్టేసి..ప్రస్తుతం ఉన్న చోటే విశాలమైన స్థలం క్రియేట్ చేసుకుని… కొత్త సచివాలయ నిర్మాణం ప్రారంభించారు. కానీ అనుకున్నట్లుగా సాగడం లేదు. పర్యావరణ అనుమతుల పేరుతో ఇంత కాలం లేట్ అయింది. ఇటీవల పనులు ప్రారభించారు. తెలంగాణ కొత్త సెక్రటేరియట్ అన్ని హంగులతో.. తెలంగాణ సాంస్కృతిక వైభవం కళ్లకు కట్టినట్లుగా సిద్ధమవనుంది.

మొదట్లో ఆరు నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నట్లుగా ప్రభుత్వం లీకులు ఇచ్చింది. బడ్జెట్ కూడా విడుదల చేసింది. కానీ ఆరు నెలల్లో సాధ్యం కాదని రియలైజ్ అయి.. ఏడాదికి డెడ్లైన్ మార్చింది. కొత్త సచివాలయానికి తెలంగాణ రాజకీయాలకు సంబంధం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. సీఎంగా ఇందులో బాధ్యతలు చేపట్టేది కేటీఆరేనని టీఆర్ఎస్ నేతలు బలంగా నమ్ముతున్నారు. అయితే ఈ భవనం నిర్మాణం ఇప్పటికే మామూలుగా మార్చికల్లా పూర్తవుతుందని ప్లాన్లు వేశారు. కానీ ఇప్పుడు అది వచ్చే ఏడాదికి మారిపోయింది. మరి కేసీఆర్ పట్టాభిషేకం సంగతి కూడా మారుతుందో లేకపోతే.. దానికి దీనికి సంబంధం లేదని ముందుకెళ్తారో… మిలియన్ డాలర్ల క్వశ్చనే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉమెన్స్ డే రోజూ అమరావతి మహిళా రైతులకు దెబ్బలే..!

మహిళా దినోత్సవం రోజునా అమరావతి మహిళా రైతులకు ఎలాంటి గౌరవం లభించలేదు సరి కదా.. పోలీసులు చేతిలో దెబ్బలు తినాల్సి వచ్చింది. ఓ వైపు మహిళలకు అండగా నిలబడతామని పెద్ద పెద్ద ప్రకటనలు...

తొలి 10 నిమిషాలు ముందే చూపించేస్తార్ట‌!

మంచు విష్ణు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం మోస‌గాళ్లు. ఇదో వైట్ కాల‌ర్ మోసం చుట్టూ తిరిగే క‌థ‌. టెక్నాల‌జీని వాడుకుంటూ... మోస‌గాళ్లు ఎలా రెచ్చిపోతున్నారో చెప్పే క‌థ‌. ట్రైల‌ర్ ఇటీవ‌లే విడుద‌లైంది. కాజ‌ల్,...

బాల‌య్య రైట్ హ్యాండ్‌.. జ‌గ్గూ భాయ్‌

లెజెండ్‌తో.. జ‌గ‌ప‌తిబాబులోని విల‌న్ విశ్వరూపం చూపించాడు. ఆ సినిమాతో జ‌గ‌పతి బాబు కెరీర్ ట‌ర్న్ అయిపోయింది. హీరోగా ఎంత సంపాదించాడో తెలీదు గానీ, విల‌న్ గా మారాక మాత్రం జ‌గ‌ప‌తి ఆస్తులు పెరిగాయి....
video

మ‌హిళా శ‌క్తి @ విరాట ప‌ర్వం

https://www.youtube.com/watch?v=dQ9S_uy-5sM విరాట‌ప‌ర్వం... ఈ సినిమా పేరు చెప్ప‌గానే ఓ ప్రేమ‌క‌థో, ఓ విప్ల‌వ గాథో, ఓ అభ్యుద‌య చిత్ర‌మో, ఓ సామాజిక స్పృహ ఉన్న ప్ర‌య‌త్న‌మో... అనిపిస్తోంది. పోస్ట‌ర్లూ అలానే ఉన్నాయి. అయితే.....

HOT NEWS

[X] Close
[X] Close