పవన్ & రానా సినిమా: అయ్యప్పనుం కోషియుం తెలుగులో వర్కౌట్ అవుతుందా?

పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా సాగర్ చంద్ర దర్శకత్వంలో, త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన సహకారం తో ఇటీవల మొదలైన సినిమా, అయ్యప్పనుం కోషియుం అన్న మలయాళం సినిమా ఆధారంగా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా తెలుగులో ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అన్న చర్చ సినీ పరిశ్రమలో నడుస్తోంది. వివరాల్లోకి వెళితే..

సినిమా కథ :

అయ్యప్పనుం కోషియుం సినిమా అయ్యప్పన్ మరియు కోషి అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక సంఘటన కారణంగా జరిగిన సంఘర్షణను తెరకెక్కిస్తోంది. కోషి అనే యువకుడు ( పృథ్వీ రాజ్) మద్యపానం నిషిద్ధమైన అటవీ ప్రాంతంలో ఒక రాత్రి కార్లో వెళుతూ పోలీసులకు దొరుకుతాడు. మద్యం మత్తులో పోలీసులతో దురుసుగా ప్రవర్తిస్తాడు. అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయ్యప్పన్ ( బిజు మీనన్) తనపై చెయ్యి చేసుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళి కేసు నమోదు చేస్తాడు. మొత్తం కేసు వివరాలు కంప్యూటర్ లోకి ఎక్కించిన తర్వాత ఆ కోషి అనే అతను బాగా డబ్బు, పరపతి, రాజకీయ నాయకులతో సంబంధాల తో పాటు తమ పోలీస్ బాస్ ఐజి కి కూడా సన్నిహితుడని తెలుస్తోంది. దాంతో ఆయనను కాస్త మెత్తబరచడానికి పోలీసులు ఆయనతో మృదువుగా నడుచుకుంటారు. కానీ ఇప్పటికే కేసు విషయాన్ని రికార్డులలో నమోదు చేసిన కారణంగా 12 రోజులపాటు సబ్ జైలులో ఉండాల్సిందే అని చెబుతారు. అయితే కోషి, తాను ఆల్కహాల్ అడిక్ట్ అని, మందు తీసుకోకపోతే తల పగిలిపోతుంది అని, తన వద్ద నుండి సీల్ చేసిన బాటిల్స్ లో నుండి ఒక గ్లాసు మందు పోసి ఇవ్వాలని వేడుకుంటాడు. దానికి అంగీకరించిన అయ్యప్పన్, తన కోసం మందు కలుపుతుండగా, దానిని తన ఫోన్ లో వీడియో రికార్డ్ చేస్తాడు కోషి. సబ్ జైలు నుండి రాగానే ఆ వీడియోను మీడియాకు విడుదల చేసి తన ఉద్యోగం పోయేలా చేస్తాడు. తన డబ్బు పరపతి రాజకీయ నాయకులతో సంబంధాలు ఉపయోగించి పోలీస్ ఆఫీసర్ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తాడు. అయితే అయ్యప్పన్ తన దగ్గర డబ్బు లేకపోయినా, తన నిజాయితీ కారణంగా తనను అభిమానించే ఊర్లోని వ్యక్తులు, డిపార్ట్మెంట్ లోని వ్యక్తుల సహాయంతో కోషి గర్వాన్ని ఎలా అణిచేస్తాడు అన్నది మొత్తం సెకండాఫ్ కథ.

తెలుగు లో వర్కౌట్ అవుతుందా

ఒక రకంగా చెప్పాలంటే నిజాయితీ పరుడు అయిన ఒక సామాన్య పోలీస్ ఆఫీసర్, బాగా డబ్బు పరపతి రాజకీయ నాయకులతో సంబంధాలు కలిగిన ఒక యువకుడి మధ్య జరిగిన పోరాటం వంటిది ఈ సినిమా. సినిమా మొదటి సీన్ నుండి చివరి వరకు ఎటువంటి డీవియేషన్స్ లేకుండా ఇదే థీమ్ తో కథ కొనసాగుతుంది. నిజాయితీ పరుడైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్, డబ్బు పరపతి కలిగిన యువకుడి పాత్రలో రానా నటిస్తున్నారు. పోలీస్ ఆఫీసర్ భార్య, మాజీ మావోయిస్టు పాత్రలో సాయి పల్లవి ఉండే అవకాశం కనిపిస్తోంది. కాస్టింగ్ వరకు బానే ఉన్నట్టు అనిపిస్తున్నా, సినిమా యథాతథంగా తీస్తే బెడిసి కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా పృథ్వీ రాజ్, బిజూ మీనన్ ల మధ్య పోటాపోటీగా అనిపించిన పోరాటం తెలుగులో పవన్ కళ్యాణ్ , రానా ల ఇమేజ్ లలో ఉన్న తేడా కారణంగా వీరిద్దరి మధ్య పోటీ ఎంతవరకు హోరాహోరీగా ఉంటుంది అన్నది కూడా సందేహాస్పదం. అదీకాక ఒరిజినల్ వెర్షన్ లో పోలీస్ ఆఫీసర్ కు ఉన్న ఫ్లాష్ బ్యాక్ మొత్తాన్ని రెండు మూడు డైలాగులతో చెప్పిస్తే, దానిని తెలుగులో పూర్తి స్థాయి ఫ్లాష్ బ్యాక్ గా మార్చే అవకాశం కనిపిస్తోంది.

ఏది ఏమైనా, దబాంగ్ సినిమాని హరీష్ శంకర్ పూర్తిస్థాయిలో మార్పులు చేసి తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్లు మార్చి గబ్బర్ సింగ్ తీసిన విధంగా, ఈ సినిమాలో కూడా బేసిక్ థీమ్ మాత్రం కొనసాగించి మిగతా విషయాల్లో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చేస్తే, ఆ మార్పులు తెలుగు ప్రేక్షకులకు నచ్చితే సినిమా హిట్ అయ్యే అవకాశం బాగానే ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ సినిమాలో చేసిన థీమ్ పవన్ కళ్యాణ్ మరియు రానాలకు బాగానే సూట్ అయినప్పటికీ, ఆ థీమ్ తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకునే అవకాశం ఉన్నప్పటికీ, పూర్తిస్థాయి యధాతధంగా తీస్తే వర్కౌట్ అవ్వకపోవచ్చు. సినిమా భవిష్యత్తు, రచయిత మరియు దర్శకుడు చేసే మార్పులపై ఆధారపడి ఉంటుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

– Zuran

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉమెన్స్ డే రోజూ అమరావతి మహిళా రైతులకు దెబ్బలే..!

మహిళా దినోత్సవం రోజునా అమరావతి మహిళా రైతులకు ఎలాంటి గౌరవం లభించలేదు సరి కదా.. పోలీసులు చేతిలో దెబ్బలు తినాల్సి వచ్చింది. ఓ వైపు మహిళలకు అండగా నిలబడతామని పెద్ద పెద్ద ప్రకటనలు...

తొలి 10 నిమిషాలు ముందే చూపించేస్తార్ట‌!

మంచు విష్ణు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం మోస‌గాళ్లు. ఇదో వైట్ కాల‌ర్ మోసం చుట్టూ తిరిగే క‌థ‌. టెక్నాల‌జీని వాడుకుంటూ... మోస‌గాళ్లు ఎలా రెచ్చిపోతున్నారో చెప్పే క‌థ‌. ట్రైల‌ర్ ఇటీవ‌లే విడుద‌లైంది. కాజ‌ల్,...

బాల‌య్య రైట్ హ్యాండ్‌.. జ‌గ్గూ భాయ్‌

లెజెండ్‌తో.. జ‌గ‌ప‌తిబాబులోని విల‌న్ విశ్వరూపం చూపించాడు. ఆ సినిమాతో జ‌గ‌పతి బాబు కెరీర్ ట‌ర్న్ అయిపోయింది. హీరోగా ఎంత సంపాదించాడో తెలీదు గానీ, విల‌న్ గా మారాక మాత్రం జ‌గ‌ప‌తి ఆస్తులు పెరిగాయి....
video

మ‌హిళా శ‌క్తి @ విరాట ప‌ర్వం

https://www.youtube.com/watch?v=dQ9S_uy-5sM విరాట‌ప‌ర్వం... ఈ సినిమా పేరు చెప్ప‌గానే ఓ ప్రేమ‌క‌థో, ఓ విప్ల‌వ గాథో, ఓ అభ్యుద‌య చిత్ర‌మో, ఓ సామాజిక స్పృహ ఉన్న ప్ర‌య‌త్న‌మో... అనిపిస్తోంది. పోస్ట‌ర్లూ అలానే ఉన్నాయి. అయితే.....

HOT NEWS

[X] Close
[X] Close