ఆచార్య టీజ‌ర్ అప్ డేట్‌

`టీజ‌ర్ వ‌ద‌లుతావా.. లేదంటే లీక్ చేసేయ్య‌మంటావా` అంటూ కొర‌టాల శివ‌కు స్వీట్ అండ్ సెటైరిక‌ల్ వార్నింగ్ ఇచ్చారు చిరంజీవి. `ఆచార్య‌` టీజ‌ర్‌పై చిరు త‌న‌కు తాను వేసుకున్న సెటైర్ ఇది. దానికి కొర‌టాల కూడా త‌లొంచాడు. `టీజ‌ర్ లీక్ చేయొద్దు.. నేను విడుద‌ల చేస్తా` అని మాట ఇచ్చాడు. అన్న‌ట్టే.. ఇప్పుడు టీజ‌ర్ కి సంబంధించిన అప్ డేట్ వ‌చ్చేసింది. ఈనెల 29న సాయింత్రం 4 గంట‌ల 5 నిమిషాల‌కు ఆచార్య టీజ‌ర్ వ‌స్తోంది. నిజానికి రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 26నే టీజ‌ర్ ని తీసుకొద్దామ‌నుకున్నారు. టీజ‌ర్ షాట్లు కూడా క‌ట్ చేసేశారు. అయితే.. మ‌ణిశ‌ర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వ‌డంలో ఆల‌స్యం అవ్వ‌డంతో.. టీజ‌ర్ కాస్త ఆల‌స్యం అయ్యింది. అయితే 29న మాత్రం ప‌క్కాగా వ‌చ్చేస్తోంది. ధ‌ర్మ‌స్థ‌లి నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. ఆ ఊరితో పాటు… ఆచార్య‌గా చిరు పాత్ర‌ని ప‌రిచ‌యం చేసే టీజ‌ర్ ఇది. రామ్ చ‌ర‌ణ్ మాత్రం ఈ టీజ‌ర్‌లో క‌నిపించ‌డు. ఎందుకంటే.. రామ్ చ‌రణ్ ఇటీవ‌లే సెట్స్ పైకి వ‌చ్చాడు. చ‌ర‌ణ్ రాక‌ముందే… టీజ‌ర్ షాట్స్ అన్నీ పూర్తి చేశాడు కొర‌టాల‌. ఈ వేస‌వికి ఆచార్య థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పేకాడితే తప్పేంటి ..? ఎదురుదాడే మంత్రుల కవరింగ్..!

ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులు తాము ఏం చేసినా కరెక్టేనని అనుకుంటున్నట్లుగా ఉన్నారు. ఏ అంశంపైనైనా విమర్శిస్తే తప్పేంటి అని ఎదురు దాడి చేస్తున్నారు. ఇతర విషయాల సంగతేమో కానీ.. పేకాట విషయంలోనూ అదే వాదన...

తెలంగాణ పట్టభద్రుల ఎన్నికల్లో కులమే హాట్ టాపిక్…!

కులాల రొచ్చు ఆంధ్రలోనే ఎక్కువ అని ఇప్పటి వరకూ అనుకుంటూ ఉంటాం. పాలన ఎలా ఉన్నా.. అభివృద్ధి ఉన్నా లేకపోయినా... కులం ప్రాతిపదికనే ఏపీలో రాజకీయాలు నడుస్తున్నాయి. రాజకీయ నేతలు నేరుగా కులం...

ఆ బిల్లు రెండో సారి వెనక్కి..! ఏపీ పెద్దలకు రాజ్యాంగం బేసిక్స్ తెలియవా..!?

ఓ చట్టం చేయాలంటే ఆషామాషీ కాదు. ప్రభుత్వ పెద్దలకో.. మరొకరికో వచ్చిన ఆలోచనలను పేపర్ పెట్టేసి అసెంబ్లీలో ఆమోదించడం కాదు. దానికి చాలాపెద్ద కసరత్తు ఉంటుది. ఇదంతా అధికారులు పూర్తి చేయాలి. రాజ్యాంగ...

“సారంగదరియా” క్రెడిట్ కోసం రచ్చకెక్కిన జానపద గాయనీ మణులు

మిలియన్ల కొద్దీ వ్యూస్ తో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది సారంగదరియా పాట. లవ్ స్టోరీ పేరిట శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న సినిమాలో నాగచైతన్య సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొన్నీమధ్య...

HOT NEWS

[X] Close
[X] Close