అలాస్క రోడ్డు ప్రమాదంలో డాక్టర్. ఎం.వి.వి.ఎస్ మూర్తి మృతి

మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి సభ్యులు, గీతం విశ్వవిద్యాలయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్. ఎం. వి. వి. ఎస్ మూర్తి గారితో పాటు శ్రీ వెలువోలు బసవపున్నయ్య , శ్రీ వీరమాచినేని శివ ప్రసాద్, శ్రీ వి. బి ఆర్ చౌదరి (చిన్న) అమెరికా లో అలాస్క రాష్ట్రం లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు దుర్మరణం పాలవడం పట్ల డాక్టర్. ప్రసాద్ తోటకూర, మాజీ తానా అధ్యక్షులు తమ తీవ్ర దిగ్భ్రాంతిని తెలియజేస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వీరితో ఇదే కారులో ప్రయాణిస్తున్న కడియాల వెంకటరత్నం (గాంధీ) తీవ్ర గాయాలతో అలాస్క ఆసుపత్రిలో కోలుకుంటున్నారు.

వీరంతా శనివారం  కాలిఫోర్నియా నుంచి బయలుదేరి అలాస్క చేరుకొని సరదాగా వెకేషన్ గడుపుతున్న సమయంలో ఈ విధంగా దుర్మరణం చెందడం చాలా విచారకరం. అక్టోబర్ 6వ తేదీన కాలిఫోర్నియా లో జరగనున్న గీతం పూర్వ విద్యార్థి సమావేశంలో  డాక్టర్. ఎం. వి. వి. ఎస్ మూర్తి  గారు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించవలసి ఉంది. ఇంతలోనే ఈ దుర్మరణం వార్త అందరిని కలచివేసింది. వీరు ప్రయాణిస్తున్న 2017 డాడ్జ్ వ్యాన్ ఎదురుగా వస్తున్న ఫోర్డ్ ట్రక్కుకు  గుద్దుకోవడంతో ఇద్దరు అక్కడిఅక్కడే మృతి చెందగా మరో ఇరువురు హెలికాప్టర్ లో ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యంలో మరణించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close