ప్రొ.నాగేశ్వర్: హైకోర్టు విభజన చంద్రబాబుకు ఇష్టం లేదా..?

హైకోర్టు విభజన అంశం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు చిత్తశుద్ధి లేదని తెలంగాణ వాదిస్తోంది. కేంద్రం కూడా.. కొత్తగా అదే వాదన వినిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో మూడు స్తంభాలు. ఒకటి లెజిస్లేచర్, రెండు ఎగ్జిక్యూటీవ్, మూడు జ్యూడీషియరి. జూన్ రెండో తేదీన … రాష్ట్రం విడిపోయిన మరుక్షణమే.. లెజిస్టేటివ్, ఎగ్జిక్యూటివ్ విడిపోయాయి. విడిపోయిన తర్వాత ఉమ్మడి రాజధానిగా.. హైదరాబాద్‌లో పదేళ్ల పాటు ఉండటానికి ఏపీ ప్రభుత్వానికి అవకాశం ఉంది. ఇక్కడ ఏపీ ప్రభుత్వానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. చంద్రబాబు ఏపీ సచివాలయాన్ని చాంబర్ ను ఆధునీకరించారు కూడా. ఆ తర్వాత అమరావతికి వెళ్లిపోయారు.

హైకోర్టు విభజన కోసం ఎందుకు ప్రశ్నించలేదు..?

హైదరాబాద్‌లో పదేళ్లు పాటు ఉండే అవకాశం ఉన్నప్పటికీ.., ఏపీ ముఖ్యమంత్రి.. స్వరాష్ట్రం నుంచి పాలన చేసుకుందామని… అమరావతి వెళ్లిపోయారు. దానికి ఆయనను అభినందించాల్సిందే. మరి హైకోర్టును ఎందుకు తీసుకెళ్లలేదు..? ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ ను తీసుకెళ్లిన చంద్రబాబు.. జ్యూడిషియరీని ఎందుకు తీసుకెళ్లలేదు. సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో.. బిల్డింగ్ ఏమైంది అని .. ధర్మాసనం ప్రశ్నించింది. మేము కడుతున్నాం..అని సమాధానం చెబుతున్నారు. మూడేళ్ల నుంచి అదే మాట చెబుతున్నారు. ఒక బిల్డింగ్ కట్టడానికి ఇన్నేళ్లు పడుతుంది. పోనీ మౌలిక సదుపాయాలు కల్పించమని ప్రభుత్వాన్ని అయినా కోరారా..? లేదు. విభజన హామీలన్నింటిపై.. కేంద్రంపై.. టీడీపీ ప్రభుత్వం, నేతలు విమర్శలు చే్సే టీడీపీ నేతలు.. ఒక్క రోజంటే.. ఒక్క రోజు కూడా.. మా రాష్ట్రానికి హైకోర్టు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించలేదు. బిల్డింగ్ కట్టరు… మౌలిక సదుపాయాలు కల్పించి ఇవ్వరు. ఒక వేళ కేంద్రం ఇవ్వాల్సి ఉంటే.. ఒక్క రోజు కూడా ఎందుకు ప్రశ్నించలేదు. దీన్ని బట్టి అర్థం అయిపోతుంది.. హైకోర్టు విభజన కాకపోవడానికి కారణం చంద్రబాబేనని.

హైకోర్టు భవనం ఇస్తామన్నా ఎందుకు స్పందించలేదు..?

తెలంగాణ ప్రభుత్వం ఒక ఆఫర్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనంలోనే పెట్టుకోమని చెప్పింది. తామే వేరే చోట హైకోర్టు పెట్టుకుంటామని చెప్పింది. అసెంబ్లీని రెండు భాగాలు చేశారు.. సచివాలయాన్ని రెండు భాగాలు చేశారు… అలాగే హైకోర్టును కూడా.. రెండు భాగాలు చేసుకుందామని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. అయినా కూడా.. ఏపీ ప్రభుత్వం ఒప్పుకోలేదు. తెలంగాణ ఉద్యమం కన్నా.. ముందు ఏపీలో… హైకోర్టు బెంచ్‌ల కోసం ఉద్యమాలు జరిగాయి. కర్నూలులో.. గుంటూరులో హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేయాలని.. న్యాయవాదులు ఉద్యమం కూడా చేశారు. మరి హైకోర్టు బెంచ్ కొరకే ఉద్యమాలు జరిగితే… ఇప్పుడు మొత్తానికే హైకోర్టు మొత్తానికే షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే..ఎందుకు స్పందించడం లేదు. మొత్తానికే హైకోర్టు తీసుకెళ్లే అవకాశం ఉన్నా… ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు.

హైకోర్టు విభజన జరిగితేనే విభజన పూర్తయినట్లు..!

జ్యూడిషియరీ విభజన పూర్తి కాకపోతే.. రాష్ట్ర విభజన పూర్తి కానట్లు కాదు. ఎగ్జిక్యూటీవ్, లెజిస్లేచర్, జ్యూడీషియరీ మూడింటిని విభజిస్తేనే రాష్ట్ర విభజన పూర్తయినట్లు. నిజంగా ఏ అడ్డంకులు కూడా లేవు. రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్ ప్రకారం.. ఏమీ ఇబ్బందులు లేకుండా.. విభజన చేయవచ్చు. స్పష్టంగా అవకాశం ఉన్నప్పుడు కూడా… రాష్ట్రం విభజించిన నాలుగేళ్ల తర్వాత.. ఎందుకు విభజన చేయడం లేదు. ఇక్కడ తెలంగాణ వాదులు రెండు వాదనలు వినిపిస్తున్నారు. హైకోర్టు న్యాయమూర్తుల్లో తెలంగాణ ప్రాతినిధ్యం తక్కువ ఉందని.. ఒకటి అయితే..రెండోది.. హైకోర్టులో చంద్రబాబుపై కేసులున్నాయని చెబుతున్నారు. అందుకే హైదరాబాద్ హైకోర్టు ఉమ్మడిగా ఉంటేనే.. చంద్రబాబుకు ఇబ్బంది లేకుండా ఉంటుందని భావిస్తున్నారని అంటున్నారు.

ముందుగా చంద్రబాబు..ఆ తర్వాత కేంద్రం సమాధానం చెప్పాలి..!

ఇవి నిజం కాదని నిరూపించాలంటే.. హైకోర్టును ఏపీకి తరలించాల్సిన అవసరం ఉంది. కోర్టు భవనాల నిర్మాణాన్ని.. ఇప్పుడు ఉమ్మడి హైకోర్టు పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఉంది. ప్రపంచ స్థాయి టెక్నాలజీతో.. అమరావతిలో నిర్మాణాలు జరుగుతున్నాయి. అయినా హైకోర్టు పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఏమిటి..? అందు వల్ల హైకోర్టు విభజన ఎందుకు ఆలస్యమవుతుందన్న విషయంపై కేంద్రం సమాధానం చెప్పే ముందు చంద్రబాబు కూడా చెప్పాల్సి ఉంటుంది. కేంద్రం కూడా సమాధానం చెప్పాలి. రాష్ట్ర విభజన విషయంలో.. కేంద్రానికి అపరిమిత అధికారాలు ఉంటాయి. పార్లమెంట్ చట్టం ద్వారా ఏపీ విభజన జరిగింది కాబట్టి… ఆ బాధ్యత కేంద్రానికి ఉంది. అందుకే.. హైకోర్టు విభజన విషయంలో ముందుగా… ఏపీ సమాధానం చెప్పాలి.. తర్వాత కేంద్రం సమాధానం చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.