త్రివిక్ర‌మ్‌లో ఆత్మ‌బంధువుని చూశా: ఎన్టీఆర్ ఎమోష‌న‌ల్ స్పీచ్‌

ఇదివ‌ర‌కెప్పుడూ చూడ‌ని ఎన్టీఆర్‌ని `అర‌వింద స‌మేత` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్లో చూశారు అభిమానులు. ఓ పులిలా విజృంభించే ఎన్టీఆర్‌… వేదిక‌పై చిన్న‌పిల్లాడిలా ఏడ్చేయ‌డం… ఎమోష‌న‌ల్‌గా మారిపోవ‌డం అభిమానుల్ని ఎంతో క‌దిలించేసింది. ప్రీరిలీజ్ వేడుక జ‌రుగుతున్నంత సేపూ.. ఎన్నోసార్లు భావోద్వేగాల‌కు లోనైన ఎన్టీఆర్‌… వేదిక‌పై మాట్లాడుతున్న‌ప్పుడు మాత్రం క‌దిలిపోయాడు. త‌న తండ్రి మ‌ర‌ణాన్ని గుర్తు చేసుకుని కంట‌త‌డి పెట్టాడు.

‘‘త్రివిక్రమ్‌తో సినిమా చేయాలన్నది నా పన్నెండేళ్ల కల. చాలాసార్లు అనుకున్నాం. కుదర్లేదు. ‘నువ్వే నువ్వే’కంటే ముందు నుంచీ చాలా దగ్గరైన మిత్రుడు. క‌ష్ట‌సుఖాల్ని మాట్లాడుకునేంత చ‌నువు ఉంది. అయినా ఎందుకు కుదరడం లేదు? అని అనుకునేవాణ్ని. బహుశా నా జీవితంలో జరిగిన ఓ ఘటన ఈ చిత్రంతో ముడిపడి ఉందేమో. అందుకే ఇంత‌కాలం ఆగామేమో. ఈ సినిమా మొదలెట్టిన తరవాతే నాకు జీవితం విలువ అర్థమైంది. ‘వాడిదైన రోజున ఎవడైనా గెలుస్తాడు. కానీ యుద్ధం ఆపేవాడే మగాడు, మొనగాడు’ అనేది ఈ సినిమా తాత్పర్యం. ‘అరవింద సమేత’ టైటిల్‌ పెట్టినప్పుడు ‘ఇదేంటి అంత శక్తిమంతంగా లేద’నుకున్నారు. ఒక మగాడి పక్కన ఆడదానికంటే బలం ఇంకోటి ఉండదు. పన్నెండు సంవత్సరాల్లో త్రివిక్రమ్‌లో స్నేహితుడ్ని, ఓ దర్శకుడ్ని చూశా. ఇప్పుడు మాత్రం ఓ ఆత్మబంధువుని చూశాను. రేపొద్దున నాకెలాంటి కష్టం వచ్చినా, ఎన్ని దుఃఖాలొచ్చినా అభిమానులంద‌రితోపాటు త్రివిక్రమ్ కూడా నా తోడుంటాడు. ఈ సినిమా నా జీవితంలో ఓ మైలురాయిగా మిగిలిపోతుంది. ఎప్పుడూ ఈ మాట చెప్ప‌లేదు. ఇప్పుడు చెబుతున్నా.. ఇది నా 28వ సినిమా. ఇది వరకెప్పుడూ తండ్రి చితికి నిప్పంటించే సన్నివేశంలో నటించలేదు. యాధృచ్చికమో ఏమో తెలీదుగానీ, అలాంటి సన్నివేశం ఈ చిత్రంలో ఉంది. మనం ఒకటి అనుకుంటే, దేవుడు మరోలా రాస్తాడు కదా. ఈ నెల రోజులు అన్నలా, తండ్రిలా, మిత్రుడిలా నాతో ఉన్నాడు త్రివిక్రమ్‌. మనిషి బతికున్నప్పుడు విలువ తెలీదు. చనిపోయాక మన మధ్య ఉండడు. ఓ తండ్రికి ఇంతకంటే అద్భుతమైన కొడుకు ఉండడు. ఓ కొడుక్కి అంతకంటే అద్భుతమైన తండ్రి ఉండడు. ఓ భార్యకి గొప్ప భర్త, ఓ మనవడికి గొప్ప తాత మా నాన్నగారు. బతికి ఉన్నంత వరకూ ‘మనల్ని మోసుకెళ్లేది అభిమానులే. వాళ్లు జాగ్రత్త’ అని ఎన్నోసార్లు అన్నారు. ఈ ఒక్క సినిమా చూడ్డానికి ఆయన ఉంటే బాగుండేది. మా నాన్నకిచ్చిన మాట అభిమానులకు ఇస్తున్నా. మా జీవితం మీకు అంకితం’’ అంటూ ఉద్వేగ‌భ‌రితంగా ప్ర‌సంగించాడు ఎన్టీఆర్‌. ఎప్పుడూ గ‌ల గ‌ల మాట్లాడే ఎన్టీఆర్‌… ఈసారి మాట‌లు వెదుక్కోవ‌డం, కంట‌త‌డి పెట్ట‌డం అభిమానులు గుండెల్ని పిండేసేలా చేశాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“ఏబీ”కి నో పోస్టింగ్..! సుప్రీంలో స్టే పిటిషన్ వేసిన సర్కార్..!

ఇంటలిజెన్స్ మాజీ చీఫ్... సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును విధుల్లోకి తీసుకోవడానికి ఏపీ సర్కార్ సిద్ధపడలేదు. హైకోర్టు తీర్పును అమలు చేయకుండా.. నాన్చి..నాన్చి.. తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. హైకోర్టు...

మీడియా వాచ్ : టీవీ9 నుంచి ఇంకెంత మంది బయటకు..!?

తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టీవీ9పై ఇప్పుడు రాజకీయ రంగు పడింది. అధికారానికి మడుగులొత్తే చానల్‌గా మారిపోయింది. అదే సమయంలో పాత చార్మ్‌ను కొద్ది కొద్దిగా కోల్పోతూ.. వెలిసిపోతూ...

“సీఎంఆర్ఎఫ్ విరాళాల”పై రేవంత్ గురి..!

తెలంగాణ సర్కార్‌ను ఇరకాటంలో పెట్టడానికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొత్త తరహాలో ఆలోచిస్తూ ఉంటారు. కేటీఆర్ .. ఫామ్‌హౌస్ విషయాన్ని ప్రజల్లోకి చర్చకు పెట్టి టీఆర్ఎస్ ను కాస్త...

కేసీఆర్‌కు రామ్‌మాధవ్ బెదిరింపులేంటో..!?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అధికార, రాజకీయ కార్యకలాపాలకు త్వరలోనే ముగింపు తప్పదంటూ... బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ చేసిన హెచ్చరికలు ఇప్పుడు హైలెట్ అవుతున్నాయి. కరోనా విషయంలో... కాళేశ్వరం నిర్మాణ...

HOT NEWS

[X] Close
[X] Close