కొన్ని అనుమానాలు… తార‌క్ స‌మాధానాలు

‘అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌’ – ఈ సినిమాపై అటు అభిమానుల‌కు ఇటు ప్రేక్ష‌కుల‌కు ఎన్నో అనుమానాలు.
వాట‌న్నింటినీ నివృత్తి చేసే ప్ర‌య‌త్నం చేసేశాడు ఎన్టీఆర్‌. ‘అర‌వింద స‌మేత‌’ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్లో ఎన్టీఆర్ స్పీచ్ పూర్తిగా ఎమోష‌న‌ల్‌గా సాగినా… తానేం మాట్లాడాల‌నుకున్నాడో స్ప‌ష్టంగా మాట్లాడేశాడు. ఈ సినిమాపై క‌లుగుతున్న కొన్ని అనుమ‌నాల్ని ప‌టా పంచ‌లు చేశాడు. కొన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు అందించాడు.

అనుమానం 1: అస‌లు ఆ టైటిలేంటి?? ఎన్టీఆర్ ఇమేజ్‌కి స‌రితూగుతుందా?

ఎన్టీఆర్ స‌మాధానం: అర‌వింద స‌మేత టైటిల్ పెట్టిన‌ప్పుడు నా ఇమేజ్‌కి స‌రిపోతుందా? అని చాలామంది అనుకున్నారు. ఓ మగాడి పేరు ప‌క్క‌న ఆడ‌దాని పేరు కంటే బ‌లం ఉంటుందా?

అనుమానం 2: అస‌లు ఆ పాట‌లేంటి? ఎన్టీఆర్ సినిమాలో ఇంత‌టి ఎమోష‌న‌ల్ గీతాలా? డాన్స్ చేయ‌డానికి అవ‌కాశ‌మే లేకుండా చేశారే..!

ఎన్టీఆర్ స‌మాధానం: న‌ట‌న‌లో డాన్స్ ఓ భాగం త‌ప్ప – డాన్స్‌లో భాగం న‌ట‌న కాదు. నేను ముందు న‌టుడ్ని. ఆ త‌ర‌వాతే డాన్స‌ర్‌ని

అభిమానుల ప్ర‌శ్న‌: త‌మ‌న్ సంగీత మైన‌స్ అయ్యిందా?

ఎన్టీఆర్ క్లియ‌రెన్స్‌: త‌మ‌న్ ఈ చిత్రానికి వాయిద్యాలు అందించ‌లేదు. త‌న ప్రాణం పెట్టాడు. త‌మ‌న్ కాకుండా మ‌రో సంగీత ద‌ర్శ‌కుడ్ని ఊహించ‌లేను. ఈ సినిమాకేం కావాలో అదే అందించాడు. త‌న పాట‌లన్నీ స‌న్నివేశం, సందేశం మోసుకెళ్తాయి.

ఇలా దాదాపుగా వినిపిస్తున్న అనుమానాల‌కు త‌న స‌మాధానాల‌తో క్లియ‌రెన్స్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు ఎన్టీఆర్‌. ఈ స్పీచుతో ‘ఈ సినిమాలో మాస్ బీట్లు లేవు’ అనుకున్న‌వారికీ, టైటిల్‌పై అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న వాళ్ల‌కూ స‌మాధానాలు అందేసిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close