విశాఖకు అతి పెద్ద టూరిజం ఎట్రాక్షన్ తీసుకు వచ్చింది కూటమి ప్రభుత్వం.గత వైసీపీ ప్రభుత్వం ఫ్లోటింగ్ బ్రిడ్జి ఏర్పాటు చేసి అభాసుపాలయింది. ఈ సారి కూటమి ప్రభుత్వం పకడ్బందీగా అంతర్జాతీయ స్థాయి టూరిజం ఎట్రాక్షన్ తీసుకు వచ్చింది. కైలాసగిరి హిల్‌టాప్‌లో 55 మీటర్ల పొడవైన గాజు వంతెన నిర్మించారు. ఇది భారతదేశంలోనే అతిపొడవైన కాంటిలీవర్ గ్లాస్ వంతెన.
ప్రకృతి ప్రేమికులకు, సాహసికులకు ఒక అద్భుతమైన అనుభూతి ఇస్తుంది. 360 అడుగుల ఎత్తులో ఉన్న హిల్‌టాప్ పార్క్‌లో శివ–పార్వతి విగ్రహాలు, రోప్‌వే, టాయ్ ట్రైన్, టైటానిక్ వ్యూపాయింట్ ఉన్నాయి. ఇప్పుడు వాటికి తోడు – గాజు వంతెనపై నడిచి, సముద్రాన్ని తిలకించే అవకాశం కల్పిస్తున్నారు. రూ.7 కోట్లతో నిర్మించిన ఈ వంతెన ..కింది నుంచి ఎటువంటి సపోర్ట్ లేకుండా ఉంటుంది. గాలిలో తేలుతున్నట్టు అనిపించే తో కలిసి ఉంటుంది. ఒకేసారి 40 మంది సందర్శకులు నడవగలిగే సామర్థ్యంతో నిర్మించారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన 2024 అక్టోబర్‌లో నిర్మాణం ప్రారంంభించారు. వేగంగా నిర్మించారు. పెట్టుబడి అంతా ప్రైవేటు సంస్థ పెట్టుకుంటుంది. ఆదాయంలో నలభై శాతం వీఎంఆర్డీఏకు ఇస్తుంది. విశాఖను అంతర్జాతీయ టూరిజం కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. త్వరలో పలు టూరిజం స్పాట్లు అందుబాటులోకి రానున్నాయి.