బయట పడుతున్న ” గ్లోబరీనా” లీలలు

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రతిష్ట దారుణంగా మసకబారింది. 99 మార్కులు వచ్చిన విద్యార్థినికి, 9 బదులు 0 బబ్లింగ్ చేయడం వల్ల సున్నా మార్కులు రావడం, పదవ తరగతిలో టాప్ వచ్చిన విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల్లోనూ ఒక మార్కు చొప్పున రావడం, అరబిక్ పరీక్ష రాస్తే ఉర్దూ పరీక్ష రాసినట్లు, అందులో కూడా సున్నా మార్కులు వచ్చినట్లు రావడం, మొదటి సంవత్సరంలో సెంట్ పర్సెంట్ మార్కులు వచ్చిన విద్యార్థులకు 2వ సంవత్సరం అన్ని పరీక్షలలోనూ ఫెయిల్ అవ్వడం, ఇలాంటి సంఘటనలు ఒకటి తర్వాత ఒకటి బయటపడుతుండటంతో తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ఎంత అద్వానంగా జరిగిందో ప్రజలకు అర్థమవుతుంది. అయితే వీటన్నింటికి కారణం గ్లోబరీనా సంస్థ నిర్వాకమే అంటూ ఇప్పుడు వాదనలు తెరపైకి వస్తున్నాయి. దాంతో పాటు ఈ సంస్థ గతంలో చేసిన నిర్వాకం కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

జెఎన్టియు కాకినాడ తో గ్లోబరీనా సంస్థ వివాదం:

ఇవాళ మీడియా ముందుకు వచ్చిన జేఎన్టీయూ కాకినాడ రిజిస్ట్రార్ ఈ సంస్థ తో జెఎన్టియు కాకినాడ కి ఉన్న వివాదం గురించి, దానిపై నడుస్తున్న కోర్టు కేసు గురించి వివరించారు. 2013వ సంవత్సరంలో జేఎన్టీయూ కాకినాడ ఈ సంస్థతో ఆన్ లైన్ పరీక్షల నిర్వహణ కోసం, ఇంజనీరింగ్ విద్యార్థులకు కంటెంట్ డెవలప్మెంట్ కోసం ఒప్పందం కుదుర్చుకుందని, అయితే కంటెంట్ డెవలప్మెంట్ విషయంలో దారుణంగా విఫలం అయిందని, దాంతో చివరికి ఆ సంస్థతో ఒప్పందాన్ని యూనివర్సిటీ రద్దు చేసుకోవాల్సి వచ్చిందని వివరించారు. అయితే ఒప్పందం రద్దు మీద ఈ సంస్థ కోర్టుకు వెళ్లిందని, ప్రస్తుతం కోర్టులో కేసు ఇంకా నడుస్తోందని చెప్పుకొచ్చారు.

కేటీఆర్ తో సాన్నిహిత్యం కారణంగానే ఈ సంస్థకు టెండర్ దక్కిందంటూ పుకార్లు:

నిజానికి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సంస్థ ఎప్పట్నుంచో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని, పరీక్షలు నిర్వహిస్తోంది. అయితే ఆమధ్య టిఆర్ఎస్ ప్రభుత్వం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థను కాదని కొత్తగా టెండర్లు పిలిచి ఆ టెండర్ల ద్వారా గ్లోబరీనా సంస్థను ఎంపిక చేసుకుని ఒప్పందం కుదుర్చుకుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం కేవలం కేటీఆర్ తో సాన్నిహిత్యం కారణంగానే ఈ సంస్థకు అవకాశం దక్కిందని, అసలు నిజానికి ఐతే రూల్స్ ప్రకారం చూస్తే ఈ సంస్థకు అవకాశం దక్కకూడదని, 10 లక్షల మందికి పరీక్షలు నిర్వహించిన అనుభవం వుండాలన్న రూలు మొదట్లో ఉండేదని, అయితే కేవలం ఈ సంస్థ కోసమే ఆ నియమాన్ని మూడు లక్షల మంది పరీక్షలు నిర్వహించిన అనుభవం ఉంటే చాలు అని మార్చారని, ఇవన్నీ చూస్తుంటే ఈ సంస్థ యాజమాన్యానికి కేటీఆర్ తో ఉన్న అనుబంధం కారణంగానే ఈ అవకాశం ఆ సంస్థకు దక్కిందని, సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇది ఎంత వరకు నిజం అనేది తేలవలసి ఉంది.

అయితే మీడియా లో మాట్లాడుతున్న పలువురు విద్యావేత్తలు మాత్రం ఈ సంస్థ పై అనేక రకాల క్రిమినల్ కేసులు ఇదివరకే ఉన్నాయని, గుంటూరులో విశాఖపట్నంలో ఈ సంస్థ నిర్వాకం వల్ల ఇప్పటికీ కోర్టు కేసులు నడుస్తూ ఉన్నాయని వ్యాఖ్యానించారు.

వివరణ ఇచ్చిన గ్లోబరీనా సీఈవో

అయితే ఈ క్రమంలో మీడియా ముందుకు వచ్చిన సంస్థ వీఎస్ఎన్ రాజు తమకు ఏ పార్టీతో సంబంధం లేదని, చట్టబద్ధంగానే తమకు టెండర్ దక్కిందని, అయితే పరీక్ష నిర్వహణలో లోపాలు సరిదిద్దుకుంటామని, కాస్త సంయమనం పాటిస్తే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని విద్యార్థులకు న్యాయం చేస్తామని వ్యాఖ్యానించాడు.

ఏదిఏమైనా వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం కనుక్కో వలసిన అవసరం ఇంటర్మీడియట్ బోర్డ్ కు అటు ప్రభుత్వానికి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close