రాహుల్ గాంధీ ట్వీట్ ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది!

కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఇప్పుడు మ‌రో వివాదంలో చిచ్చుకుంటున్న‌ట్టుగా ఉంది! ఆయ‌న పోటీ చేస్తున్న వాయ‌నాడ్ తోపాటు దేశంలో చాలా ప్రాంతాల్లో ఇవాళ్ల పోలింగ్ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ ఒక ట్వీట్ పెట్టారు. దేశంలోని యువ‌త‌ని ఉద్దేశించి ఆయ‌న స్పందిస్తూ…. ల‌క్ష‌ల సంఖ్య‌లో ఓటు వేసేందుకు యువ‌త క‌ద‌లి వ‌స్తున్నార‌న్నారు. తొలిసారి ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌డం కోసం చాలామంది యువ‌త బారులు తీరార‌న్నారు. యువ‌త చేతిలో దేశ భవిష్య‌త్ ఉంద‌నీ, వారిపై త‌న‌కు పూర్తిగా న‌మ్మ‌కం ఉంద‌నీ, వారంతా భార‌తీయుల‌కు న్యాయ్ చేస్తార‌నీ, తెలివిగా ఓటు వేస్తార‌ని ఆశిస్తున్నా అన్నారు.

దీనిలో వివాదాస్ప‌దం కావ‌డానికి ఏముందంటే… న్యాయ్ అనే ప‌దాన్ని కేపిట‌ల్ లెట‌ర్స్ లో రాహుల్ ట్వీట్ చేయ‌డం. న్యాయ్ అంటే ఎన్నిక‌ల సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకున్న సంక్షేమ ప‌థ‌కం పేరు క‌దా! కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే అంద‌రికీ క‌నీస ఆదాయ భ‌రోసా ఇస్తామ‌నేది ఆ ప‌థ‌కం ఉద్దేశం. ఎన్నిక‌లు జ‌రుగుతున్న రోజునే రాహుల్ ప్ర‌చారం చేస్తున్నార‌నీ, ఇది కోడ్ ఉల్లంఘ‌న అవుతుంద‌నీ, వాయ‌నాడ్ లో రీపోలింగ్ చేయాల్సిన అవ‌స‌రం ఉందంటూ ఈసీకి విపక్షాలు ఫిర్యాదు చేసేశాయి. దీనిపై ఈసీ స్పంద‌న ఎలా ఉంటుందో చూడాలి.

ఇంకోప‌క్క‌.. చోకీదార్ చోర్ అంటూ రాహుల్ వ్యాఖ్య‌ల‌పై కోర్టు వివాదం ఇంకా ఒక కొలీక్కి రాలేదనే చెప్పాలి. దీనిపై ఆయ‌న కోర్టుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే, రాహుల్ ఫైల్ చేసిన అఫిడ‌విట్ లో ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌లేద‌నీ, సుప్రీం కోర్టు తీర్పును ఆపాదించాన‌ని మాత్ర‌మే ఆయ‌న స్పందించారంటూ ముకుల్ రోహ‌త్గీ కోర్టుకు వివ‌రించారు. రాహుల్ క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌లేద‌నీ, విచారం వ్య‌క్తం చేస్తున్నా అని మాత్ర‌మే అన్నారంటూ ఇవాళ్ల కోర్టులో వాద‌న‌లు జ‌రిగాయి. ఎన్నిక‌ల ప్ర‌చారంలో చౌకీదార్ చోర్ అంటూ రాహుల్ చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై భాజ‌పా నేత కోర్టును ఆశ్ర‌యించిన నేప‌థ్యంలో రాహుల్ ని కోర్టు వివ‌ర‌ణ కోరిన సంగ‌తి తెలిసిందే. తాజాగా జ‌రిగిన వాదోప‌వాదాల నేప‌థ్యంలో రాహుల్ గాంధీకి కోర్టు ధిక్క‌ర‌ణ నోటీసుల‌ను జారీ చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close